స్పాట్ లైట్

చైనా కవ్వింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ యుద్ధం చేయాల్సివస్తే అది తొలుత పాకిస్తాన్‌తో కాదు, చైనాతోనే అనేది నిపుణుల అభిప్రాయం. ఆ వాదనకు ఆధారమేనా అన్నట్టు చైనా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చైనా సామ్రాజ్యవాద కాంక్షకు పాక్ కూడా అండగా నిలుస్తోంది. దొంగచాటుగా పాక్ ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్‌లోని చాలా భాగాన్ని చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ పేరిట చైనాకు విక్రయిస్తోంది. ఇంకో పక్క హిందూ మహాసముద్రంపై భారత్‌కు ఉన్న ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు చైనా గత దశాబ్దకాలంగా అనేక కుయుక్తులు పన్నుతునే ఉంది. ఒక పక్క భూగర్భంపై కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా మరో పక్క సముద్రజలాలపైనా వివాదాలకు తెరతీస్తోంది. మాటల దూకుడుతో పాటు హిందూమహాసముద్రంపై చైనా రక్షణ తంత్రాన్ని రచిస్తోంది. అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తూ తన నిఘా వ్యవస్థ పరిజ్ఞానాన్ని విస్తరింపచేస్తోంది. భారత్ సైతం చైనా ఆక్రమిత ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా ముందడుగు వేస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఓఆర్)లో చైనాకు దీటుగా అణ్వస్త్ర సహిత జలాంతర్గాములను మోహరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఆధునీకరించిన కొత్త పరిజ్ఞానంతో సముద్రగర్భంలోనూ నిఘా పెట్టేందుకు అవసరమైన సత్తాను చైనా సమకూర్చుకుంటోంది. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంలోఈ వ్యవస్థ ఏర్పాటుకు తద్వారా శత్రుదేశాలకు చెక్ చెప్పాలని చైనా చూస్తోంది. ఈ పరిజ్ఞానంతో నీటి అడుగున ఉష్ణోగ్రతలు, ఇతర అంశాలను అధ్యయనం చేసే సౌలభ్యం లభిస్తుంది. దీంతో చైనా జలాంతర్గాములకు ముందస్తు సమాచారం అందుతుంది, సాఫీగా ప్రయాణించడమే గాక, ఇతర దేశాల నౌకలు, జలాంతర్గాముల రాకపోకలపై కూడా కనే్ససి ఉంచే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా ఉంది. తాజగా చైనా ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయడం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలకు ఆందోళన కలిగించే పరిణామమే. దీంతో దక్షిణ చైనా సముద్రంతో పాటు హిందూ మహాసముద్రంలో చైనాకు ఆధిపత్యం లభిస్తుందని చైనా రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చైనా పరిజ్ఞానం అమెరికా అంత ఆధునికమైనది కాదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయినా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరగడంపై అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సైతం ఆందోళనగా ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 90 శాతం తమదేనని చైనా వాదిస్తోంది. ఈసముద్ర తీరంలో బ్రూనై, మలేషియా, తైవాన్, ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి దేశాలకు చైనా వ్యవహారం మింగుడుపడటం లేదు. దక్షిణ చైనా సముద్రంతో ఈ దేశాలకు తీరం ఉన్నా వాటికి హక్కు లేదనే విధంగా చైనా ఏకపక్షంగా వాదిస్తోంది.
నేలపై, సముద్రంపై...
చైనా దూకుడు వైఖరి భారత్‌కు ఇబ్బందిగానే తయారైంది. ఇప్పటికే ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా తన రక్షణ స్థావరాన్ని ఏర్పాటుచేసింది. బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమం, సముద్రమార్గాలతో ఆసియా, ఆఫ్రికాల్లో తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు చైనా పన్నుతున్న వ్యూహాలతో వివిధ దేశాల మధ్య ఉద్రిక్తవాతావరణం ఏర్పాడుతోంది. డ్రాగాన్‌కు ధీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి వ్యూహచరన చేయాల్సిన అవసరం భారత్‌పై పడింది.
దేశీయ పరిజ్ఞానంతో 90 వేల కోట్ల వ్యయంతో నాలుగు ఎస్‌ఎన్‌బిఎన్‌లలో రెండోదైన ఐఎన్‌ఎస్ అరిధమన్‌ను విశాఖపట్టణంలో అభివృద్ధి చేస్తున్నారు. ఐఎన్‌ఎస్ అరిధమన్‌నువచ్చే ఏడాది ఐవోఆర్‌లో మోహరించేందుకు నావికాదళం సిద్ధమవుతోంది. ఇప్పటికే దాని నిర్మాణం కూడా పూర్తికావచ్చింది. దాంతో పాటు 60వేల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ సహకారంతో ఆరు స్కార్పియన్ ఎస్‌ఎస్‌ఎన్‌లను భారత్ నిర్మిస్తోంది. అందులో ఒకటి ఐఎన్‌ఎస్ కల్వరి ఇటీవల ప్రధాని జాతికి అంకితం చేశారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ యార్డు దీనిని తయారుచేసింది. దీంట్లో అనేక ప్రత్యేకతలున్నాయి. దీనిలో స్టెల్త్ యుద్ధ విమానాలలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు. దీనిని శత్రువుల రాడార్స్ గుర్తించడం కష్టం.
దీనిలో చాలా బరువైన అన్ని రకాల ఆధునిక క్షిపణులను మోసుకువెళ్లి ప్రయోగించవచ్చు. దీంతో శత్రువుల సబ్ మెరైన్స్, యుద్ధనౌకలను దూరం నుండే సులువుగా గుర్తించి నాశనం చేసే పరిజ్ఞానం ఇమిడి ఉంది.శత్రువుల ఆయుధాలను గుర్తించి దాడి చేసే టోర్బోడ్‌లను అమర్చారు. హిందూ మహాసముద్రంలో సంచరించే అత్యంత ప్రమాదకరమైన షార్క్ చేపల్లో టైగర్ షార్క్ జాతికి చెందిన కల్వరి షార్క్ పేరును ఈ సబ్‌మెరైన్‌కు పెట్టారు. డీజిల్, ఎలక్ట్రానిక్ విధానంతో నడిచే ఈ జలాంతర్గామి 67 మీటర్ల పొడవు, 6.2 మీటర్ల వ్యాసార్ధంతో 1550 టన్నుల బరువు ఉంటుంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనా కుతంత్రాలకు కల్వరి అడ్డుకట్ట వేస్తుంది. హిందూ మహాసముద్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ ‘సాగర్’గా వ్యవహరిస్తున్నారు. సాగర్ అంటే అన్ని ప్రాంతాల భద్రత - అభివృద్ధి (సెక్యూరిటీ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ) అని అర్ధం.
మలక్కా, లోంబాక్, సుందా సంధులలో వ్యూహాత్మకంగా పట్టుసాధించాలంటే ఎప్పటికపుడు ఉత్తర అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్, అండమాన్‌లలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల మోహరింపు నిర్వహణ చాలా ముఖ్యమని భారత్ ఇప్పటికే గుర్తించింది. గల్ఫ్ ఆఫ్ అడెన్ నుండి పశ్చిమ పసిఫిక్ ప్రాంతం వరకూ 24 గంటలూ పర్యవేక్షించే యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను ఇప్పటికే భారత్ మోహరించింది. సముద్ర జలాలు, తీర ప్రాంతాల్లో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొని వెనువెంటనే ఆ ముప్పును అరికట్టే చర్యలను చేపట్టాలంటే స్థిరమైన సావధానత అవసరం అనేది భారత్ యోచన. సముద్ర దొంగల అణచివేత కోసమే హిందూ మహాసముద్రంలో జలాంతర్గాములను మోహరిస్తున్నామని చైనా బుకాయింపులు తోసిపుచ్చిన భారత్ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకుంటోంది. భారత్‌ను దిగ్బంధం చేసేందుకే చైనా జలాంతర్గాములను మోహరిస్తోందని ఇప్పటికే ఆ దేశ విదేశాంగ శాఖకు సమాచారాన్ని కూడా ఇచ్చింది. పాకిస్తాన్‌లోని గ్వదార్ పోర్టులో చైనా మోహరింపు వల్ల కూడా భవిష్యత్‌లో ఉన్న ముప్పును కూడా భారత్ విస్మరించలేదు. ఒక వేళ గ్వదార్‌కు చైనా యుద్ధనౌకలు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు సైతం భారత్ సిద్ధమైంది.

-బి.వి. ప్రసాద్