స్పాట్ లైట్

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో అభివృద్ధి ఎండమావేనా? రాజకీయ పార్టీల కుమ్ములాటలతో విధానపరమైన స్పష్టత కనిపించకపోవడంతో దేశ ప్రగతి, ప్రజాస్వామ్యం బలాన్ని సంతరించుకోవడం అన్నది అంత సజావుగా కనిపించడం లేదు. తాజా పరిణామాలు ఇందుకు ప్రబల నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్ని వారాల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష కూటమి నిర్ణయాత్మకమైన మెజారిటీని సంపాదించినప్పటికీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేకపోవడం విస్మయాన్ని కలిగించే అంశమే. శతాబ్దాల రాచరికానికి స్వస్తి పలికి దేశంలో ప్రజాస్వామ్య విధానాన్ని పునరుద్ధరించేందుకు జరిగిన పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న రాజకీయ పార్టీలు తీరా అధికారం తమ చేతికి వచ్చిన తర్వాత అసలు లక్ష్యాన్ని పక్కనబెట్టి అధికారమే పరమావధిగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు మారాలంటే అన్ని విధాలుగా బలమైన విధానపరమైన వ్యవస్థాగత ఏర్పాటు అవసరం. ముఖ్యంగా రాచరిక పాలననుంచి ప్రజాస్వామ్య పథంలో అడుగుపెట్టే దేశాలు తాము అనుసరించబోయే పాలనా విధానాలు మొదలుకుని ప్రతి విషయంలోనూ స్పష్టతను కనబర్చాలి. కాని అధికారం చేతికందిన తర్వాత నేపాల్ రాజకీయ పార్టీల్లో దేశ విధానానికి సంబంధించి ఏళ్ల తరబడి ఒక అవగాహన అంటూ లేకపోయింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానమా లేక మరో తరహా పాలనా విధానాన్ని అనుసరించాలన్నదానిపై ఎప్పటికప్పుడు విభేదాలే ప్రధానమయ్యాయి. కనీసం రాజ్యాంగ ముసాయిదాను రూపొందించుకుని కొత్త పాలనా విధానాన్ని ఏర్పరచుకోవడంలోనూ విఫలమైన పార్టీలు అనుకున్న స్థాయిలో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించలేకపోయాయి. ఆ విధంగా అస్తవ్యస్థ చందంగా ఏళ్లకు ఏళ్లే గడిచిపోయాయి. అనేకసార్లు ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు ఓ పరంపరగా మారిపోయే పరిస్థితీ తలెత్తింది. మొత్తానికి కొత్త రాజ్యాంగానికి సంబంధించి పార్టీల మధ్య అవగాహన ఏర్పడినా ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై స్పష్టత చేకూరినా కూడా అనుకున్న దానిపై రాజకీయ సుస్థిరతకు ఆస్కారమే లేకపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో తిరుగులేని రీతిలో విపక్ష కూటమి మెజారిటీని సంపాదించుకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మాత్రం మీన మేషాల చందంగానే సాగడం విడ్డూర పరిణామమే. ఎన్నికలకు ముందు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్), అలాగే సీపీఎన్ (మావోయిస్టు)ల మధ్య అవగాహన కుదిరింది. దాని ప్రకారమే రెండు పార్టీలూ కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీచేశాయి. అయితే తాజాగా తలెత్తిన విభేదాలే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవరోధంగా మారుతున్నట్లుగా స్పష్టమవుతోంది. అయితే దేశంలో పరోక్ష ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావడం లేదు. నేపాలీ కాంగ్రెస్ మాత్రం నైష్పత్తిక ప్రాతినిధ్య విధానమే సరైనదని సూచిస్తోంది. అయితే యూఎంఎల్ పార్టీ మాత్రం మెజారిటీ ప్రాతిపదికనే ఓటింగ్ జరగాలని వాదిస్తోంది. విధానపరంగా కొన్ని అంశాలను పరిష్కరించుకోగలిగినప్పుడే ఇతరత్రా కూడా జటిలంగా మారుతున్న అంశాలను అదే స్ఫూర్తితో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం నేపాలీ కాంగ్రెస్ సారథ్యంలో సాగుతోంది. ఇటీవల ఎన్నికైన పార్టీలకు అధికారాన్ని అప్పగించే విషయంలో నేపాలీ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానమే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేయడం లేదు. అలాగే దేశంలో కొత్త రాజధానులకు సంబంధించి కూడా వివాదాలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేశంలోని ఏడు రాష్ట్రాలకు రాజధానులు ఏమిటన్నదానిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా లేదు. ముందుగా ఈ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన తర్వాతే రాజధానుల ఎంపికకు సంబంధించి దృష్టిపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా వెలుగుచూసిన తాత్కాలిక ప్రతిపాదనలపైనే ఆయా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఓ స్పష్టమైన వైఖరిని అవలంబించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని వాస్తవం. అలాగే నేపాలీ కాంగ్రెస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ విషయంలో అనుకున్న స్థాయిలో క్రియాశీలతను కనబరచడం లేదు. పరిస్థితులు ఈ రకంగా జటిలంగా మారుతున్న నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ఈ అంశాన్ని పరిశీలించాలి, అందుకు అనుసరించాల్సిన రాజకీయపరమైన మార్గమేమిటన్నదానిపై స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. దాంతో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, దేశ రాజధాని ఖాట్మండులో సమావేశమై సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిణామాలను బట్టి ఇదే సముచితమైన విధానంగా కనిపిస్తోంది. దేశ ప్రజలు తమ వంతు బాధ్యతగా కమ్యూనిస్టులకు అధికారాన్ని కట్టబెడితే మెజారిటీ తీర్పును వెలువరించారు. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాదేశిక నమూనా ప్రాతిపదికగా కొత్త వ్యవస్థను పాదుకొల్పాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన కూటమిదే. అయితే ఆ విధానం ఏ రీతిలో అమలవుతుంది? ఆ దిశగా ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు అన్నదానిపైనే అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుంది. దేశ రాజకీయాల మాట ఎలా వున్నా అంతర్యుద్ధ పరిస్థితులు సమసిపోయి కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ నేపాల్ అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అధికారాన్ని అప్పగిస్తే అభివృద్ధి వరద సృష్టిస్తామని చెప్పిన పార్టీలకు అధికారంకోసం కుమ్ములాటతోనే సరిపోయింది. ఈ పరిస్థితుల్లో నేపాల్ ప్రజలు మరోసారి నష్టపోవడానికి వీల్లేదు. వారిచ్చిన తీర్పును శిరసావహించి రాజకీయ పరమైన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటూ నేపాల్‌లో బలమైన, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ ఖరారైతే అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు కూటమి గతానికి భిన్నంగా సరైన అవగాహనతో విధానపరమైన స్పష్టతతో నేపాల్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యల్లో తీవ్రజాప్యమే జరిగింది. ఇంకెంతమాత్రం అందుకు ఆస్కారం ఉండకూడదు. ప్రజలిచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకుంటే మాత్రం నేపాల్ అభివృద్ధి ఎండమావే అన్నది కళ్లకు కట్టే వాస్తవం.