స్పాట్ లైట్

ఏమిటి.. లోగుట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దన్న పాత్ర పోషిస్తూ, ప్రపంచాన్ని తమ ఆదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ఎపుడూ ప్రయత్నించే అమెరికా మరోమారు చిన్నబోయింది.అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. అమెరికా పాలనా యంత్రాంగాన్ని నడిపేందుకు అవసరమైన ఖర్చులను నిర్ధేశించే ద్రవ్యవినిమయ బిల్లును సెనేట్ తిరస్కరించడంతో షట్‌డౌన్ మొదలైంది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డోనాల్డ్ ట్రంప్‌కు ఇది ఇబ్బందికరమై పరిస్థితే. పెంటగాన్ సహా ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు ఆగిపోయాయి. నిజానికి అమెరికాకు ఇది కొత్త కాదు, ఇలా ఇప్పటికే 17 సార్లు జరిగింది. ఆక్రమంలో 18వ సారి షట్‌డౌన్ జరిగింది. చివరి సారిగా 2013 అక్టోబర్ 16 నుండి 16 రోజుల పాటు, అంతకు ముందు 1995 నవంబర్‌లో ఐదురోజులు, 1996లో నెల రోజుల పాటు షట్‌డౌన్ అయ్యిం ది. రోజుల పాటు షట్‌డౌన్ అయ్యింది. సెనేట్, వైట్‌హౌస్‌లు ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉన్న సమయంలో షట్ డౌన్ కావడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. డెముక్రాట్లు కావాలనే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని, పన్ను తగ్గింపు విజయాన్ని తక్కువ చేసేందుకే డెముక్రాట్లు కుట్ర పన్నుతున్నారని డోనాల్డ్ ట్రంప్ వాదన. ఫిబ్రవరి 16వరకూ ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు ప్రతినిధుల సభలో 230-197 ఓట్లతో ఆమోదం పొందినా, 50-48 తేడాతో సెనేట్‌లో వీగిపోయింది. తల్లిదండ్రుల వెంట అమెరికా చేరుకున్న సుమారు ఏడు లక్షల మంది అక్రమ వలసదారులున్నారు. వాళ్లను తరిమేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. గత సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం దానికి భిన్నమైన నిర్ణయం తీసుకుని వారిని దేశం నుండి తరిమేయాలని భావించింది. డ్రీమర్ల భద్రత అంశంపై కొందరు రిపబ్లికన్లు కూడా డెమోక్రాట్లకు మద్దతు ఇస్తున్నారు. వలసదారులను రక్షించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యం షట్‌డౌన్‌కు కారణమైంది. ఫలితంగా అమెరికా ప్రభుత్వానికి వారానికి 42వేల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లుతుందని అంచనా. మొత్తంగా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు లేకుండానే 40 రోజులపాటు సెలవులో పంపారు. అమెరికాలో 15 లక్షలమంది సైనికులున్నారు. 40వేల మంది హోంలాండ్ సెక్యూరిటీ ఉద్యోగులు విధుల్లో ఉంటారు. పెంటగాన్‌లో పనిచేసే 7.4 లక్షల మంది పౌరుల్లో మూడింట రెండొంతుల మంది ఇంట్లోనే ఉండాలి. వైట్ హౌస్, కాంగ్రెస్, కేంద్ర కోర్టులు, వైద్యం, పోలీసు, పౌర విమానయానం వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. అంతర్గత రెవి న్యూ, సోషల్ సెక్యూరిటీ, పట్టణాభివృద్ధి, విద్య, వాణిజ్యం, కార్మిక, పర్యావరణ శాఖలు మూతపడతాయి. 2010లో ఆర్ధిక మాంద్యం కన్నా తీవ్రమైన ప్రభావాన్ని చూపే ఘటనగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అత్యవసరాలు మినహా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు షట్‌డౌన్ ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 8 లక్షల మంది ఉద్యోగులను అత్యవసరం. షట్‌డౌన్ ముగిసే వరకూ వివిధ వీసాలపై అమెరికా వెళ్లేవారు తమ ప్రయత్నాలను మానుకోక తప్పదు. 1.15 లక్షల మంది న్యాయశాఖలో పనిచేస్తున్నారు.

- బి.వి ప్రసాద్