స్పాట్ లైట్

మార్పుతో అవకాశాల కూర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయంగా రాణిస్తున్న భారత్ నిన్న ప్యారిస్.. నేడు దావోస్
ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో యువత కలిగిన భారత్ తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. ప్రస్తుత ధనిక దేశాల్లో కొన్నింటిని సమీప భవిష్యత్తులోనే భారత్ ప్రగతిపరంగా అధిగమించే అవకాశ ఉందన్న సంకేతాలు ప్రస్ఫుటిస్తున్నాయి. అంతేకాదు అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ మాటే వేదమన్న వాక్కూ బలంగా వినిపించింది. పర్యావరణ సమతూకాన్ని కబళిస్తున్న వాతావరణ ప్రతికూల మార్పులను నిరోధించేందుకు చారిత్రక రీతిలో కుదిరిన ప్యారిస్ పర్యావరణ ఒప్పందం వెనుక కూడా భారత్ క్రియాశీలక పాత్ర వహించింది.
ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న తరుణంలో భారత వ్యాపార, వాణిజ్య అవకాశాలు సమీప భవిష్యత్తులో మరింతగా ఇనుమడించే సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ లక్ష్యాలను వర్తమానానికి ముడిపెడుతూ విధానపరమైన స్పష్టతతో దూర ఆలోచనతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనేక రకాలుగా ఆర్థిక పుష్టిని కల్పిస్తున్నాయి. ఫలితంగా అభివృద్ధి వేగాన్ని పుంజుకుంది. ప్రగతి పరుగులు పెడుతోంది. అన్నింటికీ మించి సంపద కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వ విధానాల ప్రయోజనాలు అందరికీ అందే స్పష్టత కూడా క్రమంగా వ్యవస్థీకృతం అవుతోంది. బహుముఖీయంగా విస్తరిస్తున్న నేటి ప్రపంచంలో రాణించాలంటే ‘నా దారి నాదే అంటే కుదరదు’. మన ఆలోచనలను అవసరాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లగలిగినప్పుడే సంపద చూకూరుతుంది. ఆ లక్ష్యంతోనే భారత్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అంతర్జాతీయంగా పరివర్తనాపరంగా వస్తున్న మార్పుల పరంపరను అవగతం చేసుకుంటూ ఆ వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూనే దేశ అవసరాలను తీర్చేందుకు ముఖ్యంగా ఆదాయంలో నెలకొన్న సమతూక రాహిత్యాన్ని తొలగించేందుకు నిత్యం వెంటాడే నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించేందుకు ఇటు సంఘర్షణలు, అటు హింసాకాండలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తదేక దీక్షతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతటా ఈ రకమైన సవాళ్లు, సమస్యలు విస్తరించాయి. ఆయా ప్రభుత్వాల సుస్థిరతకే ముప్పు వాటిల్లే పరిణామాలు ఎప్పటికప్పుడు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వృద్ధిని, అటు అభివృద్ధిని ఏకకాలంలో సాధిస్తూ ప్రగతిపథంలో దూసుకువెళుతున్న భారత్ అంతర్జాతీయంగా తన ప్రభావశీలతను ఇనుమడింపజేసుకోవాల్సిన సమయమిది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని ప్రత్యేకత, అలాగే సంక్లిష్టత భారత్‌కు ఉంది. అత్యంత సంక్లిష్టమైన పాలనా వ్యవస్థను ముందుకు తీసుకువెళుతూ భిన్నస్వభావాలు కలిగిన స్వభావాన్ని ఒకే తాటిపై నడిపిస్తూ ఎప్పటికప్పుడు విజయాలను నమోదు చేసుకుంటూనే వస్తోంది. అయినప్పటికీ అసాధారణ విజయాలనే నమోదు చేసుకుంటోంది. దీన్నిబట్టి చూస్తే వ్యవస్థాగతంగా భారత్‌కు తిరుగులేని అంతర్గత సత్తా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఇవన్నీ కూడా భారత్ అంతర్గత శక్తికి, బాహ్యయుక్తికి ప్రపంచ దేశాలకు బలమైన సంకేతాలు ఇచ్చేదే. అందరికోసం ప్రభుత్వం, ప్రతి ఒక్కరిదీ అభివృద్ధి అన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న విధానాలు మరింతగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎలాంటి ఒడిదుడుకులు తలెత్తినా తట్టుకోగలిగే అంతర్గత సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పడానికి కొనేళ్ల క్రితం ప్రపంచ దేశాలను అట్టుడికించిన ఆర్థిక మాంద్యం సమయంలోనే భారత్ వృద్ధిరేటు నిలకడగా ఉండడమే నిదర్శనం. అంతటి ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకున్న భారత్ ప్రస్తుత సంక్లిష్ట వాతావరణాన్ని అందిపుచ్చుకుని అందులో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశమే బలమైన వేదిక కాబోతోంది. సంక్లిష్ట ప్రపంచంలో భాగస్వామ్య భవితవ్యాన్ని రూపొందించుకోవాలన్న ఆశయంతో జరుగుతున్న ఈ సదస్సులో భారత్‌కు సముచిత స్థానం లభించడమే కాకుండా భారత మాట ఏమిటన్న ఆసక్తిని కూడా అంతర్జాతీయంగా రేకెత్తించింది. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో యువత కలిగిన భారత్ తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. ప్రస్తుత ధనిక దేశాల్లో కొన్నింటిని సమీప భవిష్యత్తులోనే భారత్ ప్రగతిపరంగా అధిగమించే అవకాశ ఉందన్న సంకేతాలు ప్రస్ఫుటిస్తున్నాయి. అంతేకాదు అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ మాటే వేదమన్న వాక్కూ బలంగా వినిపించింది. పర్యావరణ సమతూకాన్ని కబళిస్తున్న వాతావరణ ప్రతికూల మార్పులను నిరోధించేందుకు చారిత్రక రీతిలో కుదిరిన ప్యారిస్ పర్యావరణ ఒప్పందం వెనుక కూడా భారత్ క్రియాశీలక పాత్ర వహించింది. అలాగే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్‌లో కూడా నిరుపమానమైన భూమికనే పోషించింది. ఇటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ, మరోపక్క ఎన్‌ఎస్‌జీలోనూ సభ్యత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ఆ విధంగా తన అంతర్జాతీయ నాయకత్వ పటిమను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలోనే అంతర్జాతీయంగా తిరుగులేని గుర్తింపును సాధించిన భారత్, రానున్న కొనే్నళ్ల కాలంలో తన నిరుపమానతను కూడా అద్వితీయంగా నిరూపించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఎంతగా అంతర్జాతీయ వేదికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే క్రియాశీలక రీతిలో విధానపరమైన మార్పులకు ఊతాన్ని ఇవ్వగలిగితే అంతగానూ భారత్‌కు వరుస విజయాలు చేకూరుతాయి.

బి.రాజేశ్వర ప్రసాద్