స్పాట్ లైట్

ఒరిగేదెంత.. వదిలేదెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెగ్జిట్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఐరోపా యూనియన్ నుంచి దూరమైతే బ్రిటన్ నష్టపోతుందన్న వాదనలు బలపడుతున్నాయి. లిస్బన్ ఒప్పందంలోని 50 అధికరణ అమలుకు బ్రిటన్ ప్రధాని ధెరిసా మే ముందుకెళితే..అనేక ఇబ్బందులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు సాగే లావాదేవీల చర్చల్లో బ్రిటన్ ఎంత మేర తన ప్రయోజనాలను కాపాడుకోగలుగుతుందన్నది స్పష్టం కావడం లేదు. ఇంత వరకూ ఈయూతో చర్చలు ఎలా మొదలు పెట్టాలన్నదానిపై ఎలాంటి రోడ్ మ్యాప్ లేదు. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ అనుకూల, వ్యతిరేక ఓటు మధ్య తేడా అతి స్వల్పమేనన్న వాదనా వినిపిస్తోంది. ఇందులో భాగంగా నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా తన వైఖరిని ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. బ్రెగ్జిట్ శాసనానికి బ్రిటన్ రాణి ఆమోదం లభించినా అది మళ్లీ పార్లమెంట్‌కు రావాల్సి ఉంటుంది. అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని అయోమయం ధెరిసా మేను వెంటాడుతోంది.
**
ఐరోపా యూనియన్ ఏర్పాటులో కీలకపాత్ర వహించిన బ్రిటన్ ఇప్పుడు ఆ కూటమి నుంచి నిష్క్రమించడం అన్నది అంత సులువుగా ముగిసేదిగా కనిపించడం లేదు. తొమ్మిది నెలల క్రితం ఐరోపా యూనియన్‌లో ఉండటం వల్ల అంతా నష్టమేనని బ్రిటన్ భావించింది. వలసలసహా అన్ని రకాలుగానూ ఎడతెగని సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం ఈ కూటమిలో ఉండడమేనని బల్లగుద్ది మరీ చెప్పింది. దానికి అనుగుణంగానే అప్పటి ప్రధాని కామెరూన్ ఎంత కాదన్నా బ్రిటన్ వాసులు బ్రెగ్జిట్‌కు ఓటేశారు. అంటే ఐరోపా యూనియన్ కూటమి నుంచి బ్రిటన్ నిష్క్రమణకు నాందీ ప్రస్తావన జరిగింది. ఇప్పుడు లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణ అమలుకు ప్రస్తుత బ్రిటన్ ప్రధాని థెరిసామే శ్రీకారం చుడితే ఈ నిష్క్రమణ ప్రక్రియ అధికారికంగా మొదలవుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం రాణి సంతకం కూడా జరిగిపోవడంతో ఇక ఐరోపా యూనియన్‌తో చర్చలే ఆలస్యం అన్న పరిస్థితి ఏర్పడింది.
ఇంతవరకూ సజావుగా సాగినా బ్రిటన్ ప్రయోజనాలను పరిరక్షించుకునే విధంగా ఐరోపా యూనియన్‌తో చర్చలు సాగే అవకాశం ఉందా? అందుకు లేబర్ పార్టీ ఎంతమేరకు సహకరిస్తుంది? బ్రిటన్‌లోని ఇతర పార్టీల వైఖరి ఏమిటన్నది అంతుబట్టకుండా వుంది. అంతా సజావుగానే జరుగుతుందని, బ్రిటన్ ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం కలగని రీతిలోనే ఐరోపా యూనియన్‌తో చర్చలు జరుపుతామని... అనుకున్నది సాధిస్తామని థెరిసామే చెబుతున్నా అది అంత తేలిక కాదన్నది తాజా వాస్తవం. ప్రస్తుతం ఐరోపా యూనియన్‌లోని 27 సభ్య దేశాల్లో మెజారిటీ దేశాలు బలమైన ఆర్థిక వ్యవస్థలే. నిష్క్రమణ ప్రక్రియ మొదలెడితే రెండేళ్లపాటు ఎడతెగని రీతిలో చర్చలు జరిగి ఆ గడువులోగానే అది ముగియాల్సి వుంటుంది. ఇప్పటివరకూ ఈ రకమైన పరిస్థితి ఐరోపా యూనియన్‌కు ఏర్పడలేదు కాబట్టి సభ్యదేశాల్లో ఏదీ కూడా తప్పుకునే పరిస్థితి రాలేదు కాబట్టి బ్రిటన్ తన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం రాజీపడ్డా, తప్పటడుగు వేసినా అది బ్రెగ్జిట్ ప్రయోజనాలు అందకుండా పోయేందుకే ఆస్కారం ఇచ్చేదే అవుతుంది. ఏ విధంగా చూసినాకూడా ఐరోపా యూనియన్‌తో బ్రిటన్ సంబంధాలు అత్యంత సంక్లిష్టంగానే ఉండబోతున్నాయన్నది వాస్తవం.
ఈ నెల 29 నుంచే లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం అధికారికంగా నిష్క్రమణ ప్రక్రియను ప్రారంభించడానికి థెరిసామే సన్నద్ధం అయిపోయారు. బ్రెగ్జిట్‌కు అనుకూల, ప్రతికూల వర్గాలు తమ వాదనలను గట్టిగానే వినిపిస్తున్నాయి. ఐరోపా భారం దించుకుంటే యునైటెడ్ కింగ్‌డమ్ మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని ఒక వర్గం వాదన అయితే, వ్యతిరేకిస్తున్న వర్గాలు మాత్రం ఇది ఎంతమాత్రం లాభదాయకం కాదన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.
ఏ విధంగా చూసినా కూడా ఐరోపా యూనియన్‌తో బ్రిటన్ తెగతెంపులు అంత తీపిగానూ, అంత చేదుగానూ ఉండకపోవచ్చునన్నది వాస్తవంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఐదో ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దీని వాటా 2.29 ట్రిలియన్ డాలర్లుగా వుంది. ఇక ఐరోపా యూనియన్ విషయానికి వస్తే రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగింది. ఎప్పుడైతే బ్రెగ్జిట్ ఓటింగ్ జరిగిందో బ్రిటన్ కరెన్సీ విలువ దాదాపు 20 శాతం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో అధికారికంగా బ్రెగ్జిట్ చర్చలను మొదలెడితే దాని ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపైన, పౌండ్ అంతర్జాతీయ విలువపైన తీవ్రంగానే ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొరివితో తల గోక్కునే కంటే ఐరోపా యూనియన్‌తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకపోవడమే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ కూడా ఏ విధంగా అధికారిక చర్చలు జరపాలన్న దానిపై థెలిసామే ప్రభుత్వానికి ఎలాంటి రోడ్‌మ్యాప్ లేదు. ఒకవేళ ఉన్నా, దాని ప్రకారమే ముందుకు వెళితే బ్రిటన్‌కు నష్టం కలిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
అందరూ అనుకున్నట్టుగా ఐరోపా యూనియన్ నుంచి వైదొలగితే బ్రిటన్ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలదొక్కుకోవడమే కాకుండా అంతర్జాతీయంగానూ ఎదుగుతుందన్నది సందేహాల మయంగానే మారింది. ఏ విధంగా చూసినా కూడా నిష్క్రమణ ప్రక్రియ సందేహాలు, సంశయాల మయంగానే, అత్యంత సంక్లిష్టంగానే కొనసాగడం తథ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ చర్చలు పూర్తయినా అంతిమ ఫలితంపై బ్రిటన్ పార్లమెంటులో మళ్లీ ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కుతున్న విపక్షాలు అడ్డం తిరిగితే కథ మొదటికి రావడం ఖాయం.

చిత్రాలు.. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే * ఐరోపా యూనియన్ నుంచి వైదొలగడానికి వీల్లేదంటూ లండన్‌లో జరిగిన భారీ ప్రదర్శన

- బి. రాజేశ్వర ప్రసాద్