స్పాట్ లైట్

నెగ్గుకురాగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్‌లో సడలుతున్న కన్సర్వేటివ్ పట్టు తాజా సర్వేలో తగ్గిన ఓట్ల శాతం
ప్రధాని థెరిసా మే తప్పటడుగులే కారణమా

బ్రెగ్జిట్ సెగల్లో దిక్కుతోచని స్థితిలో పడ్డ బ్రిటన్ ప్రధాని థెరిసా మే పరిస్థితి రోజురోజుకూ సంకటమయంగా మారుతోంది. ఎలాగైనా బ్రెగ్జిట్‌ను సాధించాలనే లక్ష్యంతో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ఆమెకు అసలు ఎన్నికల్లో గెలవగలమా అన్న సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీనుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పూర్తి ప్రజా బలంపై బ్రెగ్జిట్‌పై నెగ్గుకు రావాలన్న ధీమాతో ఉన్న థెరిసా మే ఇప్పుడు డీలా పడే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల ఆలోచన హర్షణీయమే అయినప్పటికీ ఆమె ఇటీవల కాలంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవాలన్న ఆలోచనతో అదే ధీమాతో ఎన్నికల దిశగా అడుగు వేసిన ఆమెకు ఇప్పుడు ఏవిధంగా ముందుకు వెళ్లాలో తెలియని అగమ్య పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన సర్వేలో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓట్లకు గండిపడిందన్న బలమైన సంకేతాలే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డిమెన్షియా పన్ను విషయంలో థెరిసా మే తీసుకున్న నిర్ణయాలు, అలాగే పలు ఇతర అంశాలకు సంబంధించి ఆమె తప్పటడుగులు వేయడం ఈ రకమైన పరిస్థితికి కారణమైంది. ఐరోపా యూనియన్ నుంచి పూర్తిస్థాయిలో విడిపోయేలోగా బ్రిటన్‌కు సంబంధించి అన్ని హక్కులను సాధించుకోవాలన్న ఆశయాన్ని ఏవిధంగానైనా నెరవేర్చుకోవాలన్నదే థెరిసా పట్టుదల. అయితే ఈ ఆతృతతో అనేక తొందరపాటు నిర్ణయాలకు ఆమె అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు దీని పర్యవసానంగానే అధికార పార్టీ ఓటర్ల శాతం తగ్గుతోందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడ లేని హామీలను గుప్పిస్తూ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఓట్లకు గండికొట్టాలని థెరిసా మే ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవేవీ అనుకున్న ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఓపక్క ఓట్లకోసం ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పిస్తున్నా వాటికి గండికొట్టే రీతిలో పన్నుల పరంగానూ ఇతరత్రాగానూ జనంపై భారం వేసే నిర్ణయాలను తీసుకోవడం వల్ల థెరిసాకు ఈ అయోమయ పరిస్థితి తలెత్తింది. జూన్ 8న ముందస్తు ఎన్నికల ప్రకటన చేసినప్పుడు థెరిసా మే పాప్యులారిటీ అనూహ్యంగా ఉంది. 650 సీట్లు కలిగిన పార్లమెంటులో ఆమె ఘనవిజయం సాధిస్తారనీ, 1983లో మార్గరెట్ థాచర్ సాధించిన 144 సీట్లను కూడా ఆమె అధిగమిస్తారంటూ అంచనాలు విస్తృతంగానే వెలుగులోకి వచ్చాయి. కానీ వారం తిరక్కుండానే పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే అధికార కన్సర్వేటివ్ పార్టీ ప్రతిపక్ష లేబర్ పార్టీలు ఎన్నికల ప్రణాళికలను విడుదల చేశాయో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తమ ఓట్లను కాపాడుకోవడం కంటే కూడా లేబర్ పార్టీ ఓట్లను ఆకట్టుకోవాలన్న థెరిసా మే అత్యాశే ఇందుకు ప్రధానంగా కారణమైందని చెప్పక తప్పదు. ఒకవేళ అనుకున్న స్థాయిలో వచ్చే ఎన్నికల్లో ఆమె మెజారిటీ సాధించకపోతే అనుకున్న స్థాయిలో తిరుగులేని ఆధిక్యాన్ని సంతరించుకోలేకపోతే బ్రెగ్జిట్ ఆశలు ఆవిరైనట్టే! ఎందుకంటే ఎన్నికల్లో తనకు తిరుగులేని మెజారిటీ వస్తుందన్న నమ్మకంతోనే ఆ దిశగా ఆమె అడుగులు వేశారు. అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే మాత్రం ఐరోపా యూనియన్‌నుంచి బ్రెగ్జిట్ లావాదేవీల్లో బ్రిటన్ అనుకున్న విధంగా లబ్ధి పొందగలగడమన్నది అసాధ్యమే అవుతుంది.