స్పాట్ లైట్

ధిక్కారంలో ధీమా ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధిక్కారమే నైజంగా సాగుతున్న ఉత్తర కొరియా రానున్న కాలంలో ఇబ్బడి ముబ్బడిగా ఇటు బాలిస్టిక్ క్షిపణులను, అటు ఖండాంతర క్షిపణులను సమీకరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు అమెరికా ఆంక్షలను, అంతర్జాతీయ హెచ్చరికలను, ఐరాస తీవ్ర స్వరాన్ని పెడచెవిన పెట్టిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తనకు అడ్డే లేదన్న రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా వారం తిరక్కుండానే రెండు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించడాన్ని బట్టి చూస్తే ప్రపంచ దేశాల హెచ్చరికలు తమకు ఎంతమాత్రం పట్టవన్న ధిక్కార ధోరణి ఆ దేశ నాయకత్వంలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తాము ప్రయోగించిన క్షిపణి పరీక్షలన్నీ అనుకున్న ఫలితాలను అందించాయానీ, ఇక అదే దారిలో ముందుకు దూసుకుపోతామన్నట్లుగా ఉత్తర కొరియా వ్యవహరించడం అమెరికా సహా అనేక దేశాలను కలవరపెడుతోంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియాకు అమెరికా అన్నివిధాలుగా కొమ్ముకాస్తున్నా ఉత్తర కొరియాపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి ధైర్యంగా ముందుకు రావడం లేదు. అందుకు కారణం అటు రష్యానుంచి, ఇటు చైనానుంచి ఎక్కడ ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఆందోళనే. ముఖ్యంగా ఉత్తర కొరియా జరిపిన తాజా క్షిపణి పరీక్ష అనేక రకాలుగా శక్తిమంతమైనది కావడం దక్షిణ కొరియాలో ఆందోళనకు దారితీస్తోంది. తాము ఎంతగా పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నా అందుకు ససేమిరా అన్న రీతిలోనే ఉత్తర కొరియా వ్యవహరించడం దక్షిణ కొరియాకు మింగుడు పడటం లేదు. ఇటీవలే దక్షిణ కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూన్ జో ఇన్ ఉత్తర కొరియాతో సఖ్యతకు తాము సిద్ధమంటూ బలమైన సంకేతాలే ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఉత్తర కొరియా నియంతృత్వ నాయకత్వం శాంతి చర్చలకు ఎంతమాత్రం సమ్మతించడం లేదు. తనకు మొదటినుంచీ వెన్నుదన్నుగా వున్న చైనా హితవచనాలు కూడా కిమ్‌కు పట్టడం లేదు. అమెరికానుంచి తమను తాము రక్షించుకోవాలంటే భారీ ఎత్తున క్షిపణులను ఆయుధాలను సమీకరించుకోవడం తప్ప మరో మార్గమే లేదన్న ధిక్కార స్వరాన్ని ఆయన అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐరాస భద్రతామండలి చేపట్టనున్న అత్యవసర సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఉత్తర కొరియాను కట్టడి చేయకపోతే దాని చేష్టలు మొత్తం ప్రపంచ శాంతికే సవాలుగా మారతాయన్న హెచ్చరికలను ఎంత తీవ్రంగా పరిశీలించబోతున్నారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే అణ్వాయుధాలను ప్రయోగించే శక్తిగల క్షిపణులను తయారుచేయడమే తమ అంతిమ లక్ష్యమంటూ ఉత్తర కొరియా ప్రకటించడం ఈ అత్యవసర సమావేశానికి కారణమవుతోంది. నిజంగా ఉత్తర కొరియాకు అణ్యాయుధాలను తయారుచేసుకోగలిగే శక్తి ఉందా? ఒకవేళ ఉన్నా అందుకు ఆ దేశం అభివృద్ధి చేసుకుంటున్న క్షిపణులు ఇప్పటికిప్పుడు ఎంతమేరకు ఉపయోగపడతాయన్నది సందేహాస్పదమే. ఈ దేశ నాయకత్వం ఎంతగా పరితపించినా మరో పదిహేనేళ్ల తర్వాత గానీ దానికి ఈ రకమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని నిపుణులు చెబుతున్నారు.