స్పాట్ లైట్

ఐసిస్‌తో అమీతుమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని వారాలుగా ఐసిస్ మిలిటెంట్లతో ఫిలిప్పీన్స్ సైనిక దళాలు జరుపుతున్న పోరాటం ఓ కొలిక్కివచ్చింది. దీర్ఘకాలంగా మిలిటెంట్ల కబ్జాలో ఉన్న మరావీ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీగానే సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్‌తోపాటు అనేక దేశాల్లో మాటువేసిన ఇస్లామిక్ మిలిటెంట్లు అనేక పట్టణాలను స్వాధీనం చేసుకుని శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు. మరానీ పట్టణాన్ని హస్తగతం చేసుకునే దిశగా సైన్యం భారీ ఎత్తున రంగంలోకి దిగింది. అయితే ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న మాటే మిలిటెంట్ల పేరు కొత్తగా వినిపిస్తున్నప్పటీ వీరికి ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. 11 నెలల క్రితం దేశాధ్యక్ష పదవిని చేపట్టిన రోడ్రిగో జ్యూటర్ట్ ప్రభుత్వానికి ఐసిస్ పెనుసవాల్‌గా మారింది. దాదాపు 2లక్షల మంది ప్రజలు నివసిస్తున్న మరావీ పట్టణం యుద్ధకాండగా మారడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అజ్ఞాత ప్రాంతాలకు పరుగులుపెట్టే పరిస్థితి తలెత్తింది. రెండు మూడు రోజులు వ్యవధిలోనే ఈ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా మిలిటెంట్లను నామరూపాల్లేకుండా చేస్తామని ప్రకటిస్తున్న సైనికులు ఆ దిశగానే వ్యూహాత్మంగా రంగంలోకి దిగారు.
ఈతిరుగుబాటు దారులకు ఇతర మిలిటెంట్ సంస్థల నుంచి కచ్చితంగా మద్దతు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో కూడా ఐసిస్ సిద్ధాంతాలు బలంగా వ్యాపిస్తున్నాయని చెప్పడానికి ఈ మిలిటెంట్లకు రోజువారీగా అందుతున్న మద్దతే కారణమని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇప్పటి వరకూ మరణించిన మిలిటెంట్లలో ఆగ్నేయాసియా, మలేసియా, ఇండోనేసియాకు చెందిన వారు కూడా ఉండడంతో మాటె రెబల్స్‌కు కచ్చితంగా ఐసిస్ మద్దతు ఉందని సైన్యం చెబుతోంది. రంజాన్‌కు ముందు మరావీ పట్టణంపై ఈ మిలిటెంట్ల బృందం మెరుపుదాడి చేసి దాన్ని కబ్జా చేసింది. ఆ విధంగా ఐసిస్ ఫిలిప్పీన్స్ అనుబంధ సంస్థగా ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించింది. పట్టణ ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మిలిటెంట్లను ఏరివేసేందుకు అనేక ప్రాంతాలు సైనికులు ఖాళీ చేయించారు. యుద్ధ ప్రాతిపదికన వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. దేశంలో ఎక్కడా కూడా రెబల్స్ ఊసులేని రీతిలో ఈ మిలిటెంట్లను మట్టుబెడతామని సైన్యం చెబుతోంది. వీరి మాటలు ఎలా ఉన్నా జనం మాత్రం తిండీతిప్పలు లేక ఎప్పుడు ఎక్కడికి తరలిపోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు.

chitram...
ఫిలిప్పీన్స్ దళాలకు ఐసిస్ మద్దతుతో రెచ్చిపోతున్న మాటో రెబెల్స్‌కు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇస్లామిక్ మిలిటెంట్ల బారిన చిక్కిన మరావీ పట్టణాన్ని తిరిగి
హస్తగతం చేసుకునేందుకు సైన్యం సన్నద్ధమైంది. వేలాదిగా జనాన్ని తరలించడంతో సర్వత్రా నిర్వేదం, భీకర నిశ్శబ్దం ఆవహించింది.