స్పాట్ లైట్

‘ప్యారిస్’ నిలబడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ అంతర్జాతీయ ఒప్పందానికైనా బలమైన నాయకత్వం, స్పష్టమైన మార్గనిర్దేశన, దాని అమలులో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలిగే దూరదృష్టి ఎంతో అవసరం. దశాబ్దాల తరబడి అమెరికా వంటి దేశాల అభివృద్ధి ఆకాంక్షల పుణ్యమా అని భూగోళం అగ్నిగోళమే అయింది. భరించలేని ఉష్ణోగ్రతలు నిప్పుల వర్షాన్ని కురిపించే పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకూ అన్ని విషయాల్లోనూ ఈ తరహా నాయకత్వాన్ని అందించిన అమెరికా మొండి చేయి చూపించడంతో ప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేశంపై పడింది. చిన్నా-పెద్ద, ధనిక-పేద అనే తేడా లేకుండా అన్ని దేశాలు వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఆశాకిరణంగా ప్రపంచ దేశాల సమీకృత కృషితో ముందుకు వచ్చిన ప్యారిస్ ఒప్పందం పుడమి రక్షణకు, పర్యావరణ పరిరక్షణకు ఓ చిరుదివ్వెగానే వెలిసింది. ఇప్పుడు అమెరికా స్వచ్చందంగానే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సారథ్యం నుంచి తప్పుకోవడంతో ఆ విధంగా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడంతో అంతర్జాతీయ నాయకత్వం కోసం ఆశిస్తున్న చైనా వంటి దేశాలకు ఇదో సువర్ణావకాశంగా మారింది. ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటించిన భారత్, రష్యా, చైనా, జర్మనీ, తదితర దేశాలు ప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకుంటామని, నిధుల పరంగా ఏ రకమైన కొరత లేకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతామని చెప్పడం కొంత ఊరట కలిగించే పరిణామం. ప్రతి దేశం కూడా తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ నిధులను కేటాయిస్తూ వచ్చింది. అమెరికా ఈ విషయంలో అత్యధిక స్థాయిలో నిధులను కేటాయించేది. ఇప్పుడు ఆ బాధ్యత నుంచి అమెరికా తప్పుకోవడంతో ఆ మేరకు ఏర్పడిన నిధుల కొరతను భర్తీచేయడానికి అన్ని దేశాలూ ఉత్సాహంగా ముందుకు రావడం ప్రశంసనీయ పరిణామమే. ట్రంప్ తప్పు చేశాడంటూ ఎలుగెత్తి చాటిన ప్రపంచ దేశాలన్నీ ఆ తప్పువల్ల కలిగే నష్టం ప్రపంచాన్ని కబళించకుండా నిరోధక చర్యలు చేపట్టాయి. వ్యక్తి మనుగడ కంటే ప్రపంచ మనుగడ ముఖ్యం. పర్యావరణ సమతూకం అత్యంత ముఖ్యం. దీనిని కాపాడుకోగలిగితేనే ఈ భూమిమీద మనిషిసహా అన్ని జీవజాతులూ మనుగడ సాగించే అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని ఎంతమాత్రం విస్మరించడానికి వీలులేదు. ప్యారిస్ పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు పూర్తిగా ఏ ఒక్క దేశంపైనో ఆధారపడినవికావు. అన్ని దేశాలు సమష్టి బాధ్యతగా వాతావరణ మార్పులను నిరోధించడానికి ముందుకు వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా కాలుష్య ఉద్గారాల పరిమాణాన్ని గరిష్ఠ స్థాయిలో తగ్గించాలని సంకల్పించినా ఏ దేశం కూడా దీన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడం లేదన్న వాస్తవాలూ వెలుగులోకి వస్తున్నాయి. అంటే చట్టపరంగా ఈ ఒప్పందాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేయాలన్న నిబంధన అంటూ ఏమీ లేదన్నమాట. ఈ విషయంలోనే వర్ధమాన దేశాలకూ, ధనిక దేశాలకూ మధ్య కోపెన్‌హెగన్ నాటినుంచీ తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తుతూనే వచ్చాయి. పర్యావరణం కాలుష్యమయం కావడానికి ప్రధాన కారణం అమెరికా వంటి పెద్ద దేశాలు అయినప్పుడు సమాన బాధ్యతగా ఈ పరిరక్షణ భారాన్ని మిగతా దేశాలపై ఎలా విధిస్తారన్న వాదన ఎప్పుడూ ఉంది. 2015లో ఈ ఒప్పందం కుదిరినప్పుడే కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గిస్తామని, ప్రమాదకరమైన మిథైన్‌ను వాతావరణంలోకి విసర్జించడానికి అరికడతామని అన్ని దేశాలూ ప్రతిజ్ఞ చేశాయి. కాని అది ప్రతిజ్ఞ మాత్రమే. తప్పనిసరిగా తమ నిర్దేశిత లక్ష్యాలను అమలు చేసి తీరాలన్న నిబంధన ఏదీ లేదు. ప్రతి ఐదేళ్లకోసారి తాము చేసిన వాగ్దానాలను ఏమేరకు అమలు చేశామో పునఃసమీక్షించుకోవాలని కూడా ప్యారిస్ ఒప్పందం నిర్దేశిస్తోంది. అప్పటి పరిస్థితులను బట్టి కొత్త లక్ష్యాలనూ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం అన్ని దేశాలకూ నిర్బంధం కాకపోవడం వల్లే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన గల అమెరికా దాన్నుంచి తప్పించుకోగలిగింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఈ ఒప్పందానికి అమెరికా కట్టుబడే వ్యవహరించింది. ఒకవేళ హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్షురాలిగా ఎన్నికై ఉంటే, ఈ ఒప్పందంలో అమెరికా కొనసాగివుండేదే. అయితే ప్రస్తుతం పరిస్థితులు తలకిందులు అయ్యాయి కాబట్టి అమెరికా నిధులు లేకపోయినా ప్యారిస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళే బాధ్యతను మిగతా దేశాలన్నీ అనివార్యంగా చేపట్టాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అన్ని దేశాలు ఇచ్చిన విరాళాలపైనే ఈ ఒప్పందం అమలవుతుంది తప్ప కేవలం అమెరికా డబ్బుపై కాదు. ఇందుకు సంబధించి ఐక్యరాజ్య సమితి బలమైన ఏర్పాటు చేసింది. అన్ని దేశాలు తమ వంతు బాధ్యతగా నిధులను అందించగలిగితే అమెరికా లేకపోయినా మరింత పటుతరమైన తీరిలో ఇది అమలయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదేశం కూడా పర్యావరణ పరిరక్షణ దిశగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలి. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం దీన్నుంచి వైదొలగినప్పటికీ భవిష్యత్‌లో వచ్చే అమెరికా అధ్యక్షుడు మళ్లీ దీనిలో చేరే అవకాశం లేకపోలేదు.