స్పాట్ లైట్

చతుర్ముఖ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి భారత దేశం ప్రపంచ దేశాల దృష్టిలో పడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు విదేశీ పర్యటనలు జరిపినా అంతర్జాతీయంగా ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతూనే ఉంటుంది. తాజాగా జర్మనీ, ఫ్రాన్స్, రష్యా,స్పెయిన్‌లలో జరిపిన పర్యటన అనేక కోణాల్లో ఈ నాలుగు దేశాలకూ భారత్‌ను సన్నిహితం చేయడమే కాకుండా అనేక కీలక ఒప్పందాలు కుదరడానికీ దారితీసింది. ముఖ్యంగా రష్యాతో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధాన్ని మోదీ పర్యటన బలోపేతం చేయడమే కాకుండా ఇరు దేశాల మధ్య సరికొత్త బాంధవ్యానే్న ఆవిష్కరించింది. మూడేళ్ల క్రితం కేంద్రంలో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచీ మోదీ చేపట్టిన విదేశీ పర్యటనలకు తాజాగా నాలుగు దేశాల్లో ఆయన జరిపిన పర్యటనకు ఎంతో తేడా ఉంది. అమెరికాతోనే భారత్ సన్నిహితమవుతోందన్న వాదనలను తొలగిస్తూ రష్యాతో అనుబంధమూ తమకు అంతే కీలకమని మోదీ రుజువు చేశారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో ఆయన జరిపిన చర్చలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను స్పృశించడంతో పాటు ఎన్నో విషయాల్లో సరికొత్త సాన్నిహిత్యాన్నీ ఆవిష్కరించాయి. కుదంకుళంలో మరో రెండు అణు విభాగాల ఏర్పాటుకు సంబంధించి కుదిరిన ఒప్పందం కూడా ఇరు దేశాలు భవిష్యత్‌లో పౌర అణు ఇంధన సహకార రంగంలోనూ ముందుకు దూసుకుపోవడానికి దోహదం చేసేవే! అలాగే జర్మనీ చాన్సరల్ మెర్కెల్‌తో మోదీ జరిపిన చర్చలు కూడా ఐరోపా యూనియన్ సభ్య దేశాలతో భారత్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పాయి. భారత ఆర్థిక వ్యవస్థలోనూ, పాలనాపరంగా వచ్చిన మార్పులను ఈ పర్యటనల సందర్భంగా మోదీ మరింత బలంగానే చాటిచెప్పారు. తక్షణ అనుమతులకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారాలు తీశామన్న సంకేతాలనూ అందించారు. కేవలం ద్వైపాక్షిక అంశాలకే చర్చలను పరిమితం చేయకుండా భూగోళ పరిరక్షణకు అత్యంత కీలకమైన పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్నీ చాటిచెప్పడం ద్వారా అంతర్జాతీయంగా భారత్ ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందో కూడా మోదీ చాటి చెప్పారు. ముఖ్యంగా ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు మాక్రన్-మోదీల మధ్య జరిగిన చర్చలు పరస్పర సహకార అంశాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. రక్షణ, తీర ప్రాంత పరిరక్షణ విషయంలో పరస్పరం కలసికట్టుకా ముందుకు వెళ్లాలన్న ఆకాంక్షనూ ఇరువురూ వ్యక్తం చేయడం ఉగ్రవాద నిర్మూలన ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేదే. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగినప్పటికీ ఈ కూటమి ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పడం ద్వారా ఐరోపా దేశాలన్నింటితోనూ సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతాలను మోదీ అందించారు. ఓ పక్క స్టార్టప్‌లు, మరో పక్క ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాల్లో దూసుకుపోతున్న భారత్‌కు ఐరోపా దేశాలతో సన్నిహితంగా పనిచేసే అవకాశం రావడం అన్నది ద్వైపాక్షిక బంధంలో కీలక అధ్యాయం. నాలుగు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకోవడం ద్వారా మోదీ తన అంతర్జాతీయ దౌత్య నీతికి మరింత పదును పెట్టడమే కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ అన్ని దేశాలతో లోతైన బంధానికి భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతాలనూ అందించారు.