స్పాట్ లైట్

చైనా ‘బెల్ట్’తో పాక్‌కు దెబ్బే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ప్రాంతీయ, అంతర్జాతీయ ఆధిపత్యం కోసం చైనా చేపట్టిన బృహత్తర వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబిఓఆర్) ప్రాజెక్టు అందులో పాలుపంచుకుంటున్న భాగస్వామ్య దేశాలన్నింటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితిని కుంగదీసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అత్యంత ఘనంగా ఈ ప్రాజెక్టును చైనా ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా..ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ విధంగా చూసినా కూడా ఇది సభ్య దేశాలను ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లను రుణకూపంలోకి నెట్టేసేదేనని నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇదే రీతిలో సాగితే ఈ దేశాలన్నీ దివాలా తీసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్న సంకేతాలూ బలంగానే వస్తున్నాయి. ఆక్రమిత పాకిస్తాన్ మీదుగా వెళ్లే ఆర్థిక కారిడార్‌ను ఇప్పటికే చైనా, పాకిస్తాన్‌లు చేపట్టాయి. ఈ ప్రాజెక్టుపై భారత వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే వన్ బెల్ట్ వన్ రోడ్ అనే భారీ నిర్మాణానికి చెనైన శ్రీకారం చుట్టిందనే భావించాలి. భారత్‌ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో చైనా-పాకిస్తాన్‌లు చేతులు కలిపి ఇతర దేశాల సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తిగా చైనా ఆధిపత్యానికే దోహదం చేసేదే అవుతుంది తప్ప ఏ విధంగానూ ఇతర దేశాలకు మేలు చేసేది కాదన్న వాదన వినిపిస్తోంది. అనేక దేశాలు చేతులు కలిపి చేపట్టే ఏ ప్రాజెక్టయినా ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ అన్ని దేశాలకూ మేలు చేసేది కావాలి. కానీ వన్‌బెల్ట్-వన్‌రోడ్ ప్రాజెక్టు అంతిమలక్ష్యం చైనాకు ఎనలేని లబ్ధిని చేకూర్చడమే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ దేశాలు దివాళా తీయడానికే దారితీస్తుందన్న కథకాలు ఊహకందనివే.
ఈ ప్రాజెక్టు ఆక్రమిత కాశ్మీర్ మీదుగా వెళుతోంది కాబట్టే భారత్ దీనిని వ్యతిరేకించడం ఎంతైనా సమంజసం. కాని, ఇందులో పాల్గొంటున్న దేశాలకు దీనివల్ల నష్టమే తప్ప లాభం లేని పరిస్థితి ఏర్పడడం అన్నది అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను తీవ్రస్థాయిలో దెబ్బతీసేదే అవుతుంది. రోడ్లు, రైల్వే లైన్లు, రహదారులను ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలను సంధానం చేస్తూ చైనా ఈ ప్రాజెక్టు తలపెట్టినప్పటికీ దీనివల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందన్నది అసలు వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. అసలు తమకు నష్టదాయకంగా మారే ఈ ప్రాజెక్టుపై మిగతా దేశాలు ఎందుకు ఆసక్తి కనబరిచాయి... చైనా అసలు ఉద్దేశం ఈ దేశాలకు అర్థం కాలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టు వల్ల ఆయా దేశాలకు ఏ విధంగా నష్టం చేకూరుతోందంటే అది చైనా తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల వల్లేనని స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా చేపట్టే ప్రాజెక్టు నిధులపై 16 శాతానికి మించిన స్థాయిలోనే చైనా వడ్డీ వేస్తోంది. ఈ స్థాయిలో వడ్డీ వసూలు చేస్తే అది అపరిమితంగా పెరిగిపోతూ ఉంటే సభ్య దేశాలు దీన్ని కట్టడం అన్నది ఎప్పటికీ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇదే స్థాయిలో చైనా తన ఆధిపత్యాన్ని, ఆర్థికపరమైన ఒత్తిడిని సభ్యదేశాలపై కొనసాగిస్తూపోతే అరకొర ఆర్థిక వ్యవస్థలు కలిగిన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు అంతూపొంతూ లేని రుణకూపంలో చిక్కుకుపోతాయని నిపుణలు లెక్కలతో సహా చెబుతున్నారు. చైనా సహకారంతో చేపట్టిన ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు తమ ఆర్థిక వ్యవస్థకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా వెల్లడించినప్పటికీ ఈ ప్రాజెక్టువల్ల చైనాకే తప్ప పాకిస్తాన్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదన్న కథనాలూ వస్తున్నాయి. తన కరెన్సీ ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఇటు వన్ రోడ్- వన్ బెల్డ్ ప్రాజెక్టును, అటు ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును చైనా చేపట్టినట్లు తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. అంతర్జాతీయంగా బలమైన మారకద్రవ్యంగా ఉన్న డాలరును దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే దాని స్థానే తన మారకద్రవ్యమైన యువాన్‌ను ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకురావలన్న లక్ష్యంతోనే చైనా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
చైనా ఆశలకు వన్‌బెల్ట్-వన్‌రోడ్ ప్రాజెక్టు చాలా బలంగానే దోహదం చేస్తుందనేది వాదన. ఒకపక్క భారత్, అఫ్గానిస్తాన్ ఇరాన్‌లతో పాకిస్తాన్‌కు సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ అనేక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నప్పటికీ వన్‌బెల్డ్-వన్‌రోడ్ ప్రాజెక్టులో చేరేలా దానిపై చైనా ప్రభావాన్ని చూపించకలిగింది. అంతేకాదు ఆ విధంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను భారీ పరిమాణంలో సమకూర్చుకోవడానికి అత్యంత వ్యూహాత్మక రీతిలో అడుగులు వేస్తోంది. పాకిస్తాన్‌తో చేపట్టిన దాదాపు అరవై బిలియన్ రూపాయల ఆర్థిక లావాదేవీలను యువాన్ మారకంలోనే చైనా చేపట్టడం దాని కుత్సిత వ్యూహానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక కారిడార్ ప్రాజెక్టుతో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా తీసుకుంటున్న చర్యలు మరింతగా పరిస్థితిని విషమింపజేసే అవకాశం ఉంది. మొత్తంమీద తన కరెన్సీని బలోపేతం చేసుకునే ఉద్దేశంతో చైనా అనేక దేశాలను రొంపిలోకి దింపేసింది. చివరికి అవి వడ్డీ కట్టలేక దివాళా తీసే పరిస్థితికి తెచ్చేసేందుకు సమాయత్తమైంది.