స్పాట్ లైట్

సమస్యలు మొదలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందస్తుగానే ఎన్నికలకు దిగిన బ్రిటన్ ప్రథాని ధెరీసామే పరిస్థితి మొదటికొచ్చింది. ఉన్నదీ, ఉంచుకున్నదీ పోయిననట్టుగా బ్రిటన్ ప్రజలు దిమ్మతిరిగే రీతిలో ఇచ్చిన తీర్పు అనేక రకాలుగా దేశ రాజకీయ పరిస్థితిని సంక్షోభంలో పడేసింది. ఎన్నికలకు ముందు మెజార్టీలోనే ఉన్న కన్సర్వేటివ్ పార్టీకి తిరుగులేని మెజార్టీ సంపాదించాలన్న ఆశతో పార్లమెంట్‌ను రద్దు చేసి మూడేళ్ల ముందుగానే ఎన్నికలకు దిగిన ధెరీసాకు ఇప్పుడు కల్లో కూడా ఊహించని పరిస్థితే ఎదురైంది. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపైనే దాదాపు నలభై శాతం ప్రజలు వ్యతిరేకించిన నేపథ్యంలో దేశ రాజకీయ పరిస్థితి సంక్షుభితంగా మారింది. ముఖ్యంగా ఇటు కన్సర్వేటివ్ పార్టీకి గానీ అటు లేబర్ పార్టీకిగానీ మెజార్టీ రాని పరిస్థితి గతంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం బ్రెగ్జిట్ వ్యవహారం సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇలాంటి వాతావరణం ఎదురుకావడం దేశ రాజకీయ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. నిన్న మొన్నటి వరకూ హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో మెజార్టీలో ఉన్న టోరీలు మైనార్టీలో పడిపోవడం ఊహకైనా అందని పరిణామం. గతంలో కంటే కూడా మరిన్ని సీట్లను పెంచుకున్న లేబర్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అధికార పార్టీని బ్రెగ్జిట్ చర్చల్లో నిలువరించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐరోపా యూనియన్‌తో జరిపే చర్చల్లో బ్రిటన్ తన వాదనను బలంగా వినిపించే అవకాశం కనిపించడం లేదు. అలాగే స్కాటిష్ జాతీయ వాదుల నుంచి వస్తున్న స్వతంత్య్ర స్కాట్‌లాండ్ ఆశలపై కూడా ఈ ఫలితాలు నీళ్లు చల్లాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ వచ్చి ఉంటే ప్రధాని ధెరీసా మరింత బలంగా బ్రెగ్జిట్ చర్చల్ని ప్రారంభించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ముందు అనుకున్నట్టుగా 19 నుంచి ఈ చర్చలు ప్రారంభం అవుతాయా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత మెజారిటీ కోల్పోయి మరో ప్రాంతీయ పార్టీతో చేతులు కలిపి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాన్ని ఎన్నాళ్లు థెరిసా కొనసాగించగలుగుతారన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఏ విధంగా చూసినా బ్రిటన్ ప్రజలిచ్చిన ఈ అనూహ్య తీర్పు సమీప భవిష్యత్తులో థెరిసాకు మరిన్ని కష్టాలనే తెచ్చిపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అదీ అరకొర మెజారిటీతో ఐరోపా యూనియన్‌తో బ్రెగ్జిట్ చర్చలను థెరిసా బలంగా చేపట్టే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎందుకంటే, మద్దతిచ్చేందుకు ముందుకొచ్చిన డెమొక్రాటిక్ యూనియనిస్టు పార్టీ ఎన్నాళ్లు దీన్ని కొనసాగిస్తో చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ఎలాంటి మెలిక పెట్టినా పరిస్థితి మొదటికొచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐరోపా యూనియన్‌తో రాజీ పడడం తప్ప దక్కిందే దక్కుడని సర్దుకోవడం తప్ప థెరిసా మే కు మరో అవకాశం లేదన్నది స్పష్టమే. ఇదిలావుంటే లేబర్ పార్టీ కూడా పార్లమెంటు ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకోవడంతో బ్రెగ్జిట్ చర్చలను థెరిసా అనుకున్నట్లుగా ముందుకు సాగేలా సహకరించే అవకాశమూ లేదు. అనున్నదొకటి-అయ్యిందొకటి తరహాలో వచ్చిన ఫలితాలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన థెరిసా తన లక్ష్యాలను ఏ మేరకు నెరవేర్చుకోగలుగుతారన్నది వేచిచూడాల్సిందే. ప్రస్తుత సంకేతాలు మాత్రం ఆమెకు అడుగడుగునా అవరోధాల మయమైన సవాళ్లనే విసిరే అవకాశం ఉంది. మొదటినుంచీ కూడా ఐరాపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలు ఈ అవకాశాన్ని మరింతగా వినియోగించుకోబోతున్నాయి. థెరిసా ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి ఈ వర్గాల నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదే స్థాయి ఫలితాలను కనబరిస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి ఖాయమని ఆ పార్టీ అధినేత జలేమి కార్బిన్ చాలా ధీమాగానే ఉన్నాడు. గతంలో కంటే మెరుగైన ఫలితాలనే తమ పార్టీ సాధించడం కన్సర్వేటివ్ పార్టీ రాజకీయ ప్రాబల్యం తగ్గుతోందని చెప్పడానికి నిదర్శనమని ఆయన అంటున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి అధికార, ప్రతిపక్షాలు బ్రెగ్జిట్ చర్చల్లో పాల్గొంటాయా? ఆ విధంగా బ్రిటన్ ప్రయోజనాలను గరిష్ఠ స్థాయిలో కాపాడుకోగలుగుతాయా అన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. సంకీర్ణ ప్రభుత్వంతో థెరిసా మే ఏ విధంగానూ తన ప్రాబల్యాన్ని చాటుకునే అవకాశం లేదు. అయితే అన్ని వర్గాలను కలుపుకుని పోవడం ద్వారా బ్రెగ్జిట్ ప్రయోజనాలను ఆమె సాధించుకోగలిగితేనే ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించుకోగలుగుతారు. లేని పక్షంలో సమస్యల తుట్టెను ముందుగానే కదిలించిన ఆమె, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.

-బి.రాజేశ్వర ప్రసాద్