స్పాట్ లైట్

అమెరికా దాడి వెనుక వ్యూహం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమానుష రీతిలో ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా, సంబంధం ఉన్నాలేకపోయినా ఉత్సాహంగా ముందుకొచ్చి తన బలాన్ని ప్రదర్శించడం అన్నది అమెరికాకు ఆనవాయితీగా మారింది. ప్రజాస్వామ్య హక్కుల పేరిట, మానవత్వ రక్షణ పేరిట ఈ రకమైన చర్యలు చేపట్టని చరిత్ర అమెరికాకు ఎంతో ఉంది. అయితే తాజా క్షిపణి దాడులను సిరియాపై దురాక్రమణ గానే రష్యా అభివర్ణించడం అంతేకాకుండా ఈ దాడి ద్వారా సిరియాలో కల్లోలం లేపడం ఒక దేశాన్ని అలజడికి లోనుచేయడమేనని కూడా రష్యా చెబుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ పరిణామంతో మరింతగా బెడిసికొట్టాయి. సిరియాలో రసాయన ఆయుధాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్టు అమెరికా చెబుతున్నా దీని వెనక సిరియా అంతరంగిక వ్యవహాల్లో తలదూర్చాలన్న వ్యూహం కూడా కనిపిస్తోందన్నది రష్యా, తదితర దేశాల వాదన. ఈ దాడులో ఉపయోగించిన విషవాయువు అత్యంత ప్రమాదకరమైందని, క్షణాల్లో ప్రాణాలు తీసే ఈ ఘాతుకాలను ఏ మాత్రం విస్మరించినా అది ఇతరాత్రా అనేక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అమెరికా చెబుతోంది. అంతర్జాతీయ విధ్వంసక ఆయుధ చట్ట నిర్వచన ప్రకారం సరీన్ అనే ఈ విషవాయువుసామూహిక వినాశనానికి దారితేసేదేనని అమెరికా అంటోంది. ఈ దాడికి గురైన బాధితులు అనేక మంది క్షణాల్లో మరణించడం, కొందరు నురగలు కక్కుతూ జీవచ్ఛవాలుగా మారిపోవడం ఈ వాయువు ఎంత ప్రమాదకరమైందో స్పష్టం చేస్తోందని చెబుతోంది.
ఈ తరహా పరిణామలు పునరావృతం కాకుండా ఉండేందుకే తామీ దాడి జరిపినట్టుగా అమెరికా చెబుతున్నా అది ఎంతమేరకు వాస్తవాలకు అద్దం పడుతుందన్నది వేచి చూడాల్సిందే.