స్పాట్ లైట్

శరణార్థుల గతి ఇంతేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ సూడాన్ శరణార్థుల్ని ప్రపంచ దేశాలు వదిలేశాయా? వారి కడగళ్లను, బాధలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరిస్తున్నాయా? అక్కడి పరిస్థితుల్ని లోతుగా గమనిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. నిరంతర హింసాకాండతో అట్టుడుకుతున్న దక్షిణ సూడాన్‌లో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించే మాట ఎలా ఉన్నా.. అత్యంత దయనీయంగా జీవితాల్ని సాగిస్తున్న ఇక్కడి ప్రజల జీవితాల్లోనూ వెలుగుపూలు పూసే అవకాశమే కనిపించడం లేదు. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా దక్షిణ సూడాన్ పరిస్థితుల్ని తట్టుకోలేక వేలాదిగా పొరుగున ఉన్న ఉగాండాకే ప్రజలు తరలిపోతున్నారు. అక్కడ కూడా వీరికి తీవ్రస్థాయిలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఉగాండాకు చేరుకున్న వేలాది దక్షిణ సూడాన్ శరణార్థుల్లో మూడింట రెండొంతుల మంది అభంశుభం తెలియని పిల్లలే కావడం గుండె పిండేసేదే! ఉగాండా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా శాంతి భద్రతల పరంగా ఎన్నో సమస్యలు సవాళ్లు ఉన్నప్పటికీ దక్షిణ సూడాన్ నుంచి తరలివస్తున్న వారిని మాత్రం కాదనకుండా ఆహ్వానిస్తోంది. ఎప్పటికప్పుడు వారికి చేయూతనిస్తూ భారీ స్థాయిలో శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. అయితే పరిమిత వనరులతో ఇంత మంది శరణార్థుల అవసరాలు తీర్చడమన్నది నిరంతరం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకొచ్చి శరణార్థుల్ని ఆదుకోవాల్సిన ప్రపంచ దేశాలు తమకు పట్టని రీతిలోనే వ్యవహరించడం విచారకరం. అరకొర ఆర్థిక పరిస్థితులున్న దేశాల మాట ఎలా ఉన్నా తిరుగులేని సంపద కలిగిన ధనిక దేశాలు సైతం దక్షిణ సూడాన్ శరణార్థుల అవస్థలపై శీతకనే్న వేశాయి. దక్షిణ సూడాన్ సంఘర్షణల్లో దాదాపు 20లక్షల మంది పిల్లలు అనాధలే అయ్యారు. ఎప్పటికప్పుడు నిధుల కోసం ఐక్యరాజ్య సమితికి ఆర్తనాదాలు చేసే పరిస్థితే ఏర్పడుతోంది. ఎంతగా అభ్యర్థించినా ఈ శరణార్థులను ఆదుకునేందుకు తగిన పరిమాణంలో నిధులు ఇవ్వడానికి ధనిక దేశాలు ససేమిరా అంటున్నాయి. ఫలితంగా.. పోషకాహారం కొరవడి ఈ పిల్లలు తీవ్రస్థాయి అనారోగ్యానికీ గురవుతున్నారు. ఓ పక్క నేటి పిల్లలే రేపటి ప్రపంచ పౌరులన్న ఘనమైన నినాదంతో హోరెత్తిస్తున్న దేశాలు కొంతలో కొంతైనా ఉగాండాలోని శరణార్థ శిబిరాల్లో మగ్గుతున్న పిల్లల్ని పట్టించుకోవడం, వారిని ఆదుకోవడం అన్నది తక్షణావసరం. ఇప్పటికే దాదాపు 9లక్షల మంది దక్షిణ సూడాన్ శరణార్థులు ఉగాండా చేరుకున్నారు. రోజువారీగా వేలాదిగా తరలివస్తున్న వారిని కూడా ఆదుకోవడం అన్నది ఉగాండాకు తలకు మించిన భారంగానే పరిణమించింది. ప్రపంచంలో ఏ దేశం ఎదుర్కోనంత తీవ్రస్థాయిలో శరణార్థ సంక్షోభాన్ని ఉగాండా ఎదుర్కోవాల్సి వస్తోంది. అనేక పెద్ద దేశాలు శరణార్థుల ముఖం మీదే తలుపులు వేసేస్తున్నా..తన ఆర్థిక స్థితిగతులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఉగాండా మాత్రం వీటి పట్ల మానవీయ దృక్పథంతోనే వ్యవహరించడం ప్రశంసనీయం. అయితే ఎంతకాలం వీరిని సొంతంగా పోషించగలుగుతుంది? లక్షలు దాటుతున్న శరణార్థుల దైనందిన అవసరాల తీర్చగలుగుతుందన్నది సమాధానం లేని ప్రశ్నగానే మారుతోంది. శరణార్థ అనుకూల విధానంలో భాగంగా వీరికి ఉండేందుకు స్థలాన్ని, జీవించేందుకు పొలాన్ని ఉగాండా ప్రభుత్వం అందిస్తోంది. అంతే కాదు వీరిని సొంత పౌరులుగా భావించి తమ వారితో సమానమైన వౌలిక హక్కుల్నీ కల్పిస్తోంది. ఎక్కడైనా పనిచేసేందుకు.. వ్యాపారమూ చేసుకునే స్వేచ్ఛనూ కల్పించింది. ఓ చిన్న దేశం ఇంత పెద్ద బాధ్యతలు మోస్తున్నా.. పెద్ద దేశాలు మాత్రం పెద్ద మనసుతో ముందుకు రాకపోవడం శోచనీయం. ఇంత తీవ్రమైన శరణార్థ సంక్షోభాన్ని విస్మరించడమంటే. ఉగాండానూ దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేయడమే అవుతుంది. ఇప్పటికైనా మాటలు కట్టి పెట్టి ధనిక దేశాలు ఉగాండాను, ఆ విధంగా దక్షిణ సూడాన్ శరణార్థుల్ని ఆదుకోవాలి.. అప్పుడే మానవత్వం, మానవీయత..