స్పాట్ లైట్

ఏమిటీ సంకటం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుశా ఇప్పటి వరకూ వచ్చిన అమెరికా అధ్యక్షులెవరికీ ఎదురుకాని విపత్కర, విడ్డూర పరిస్థితి ఇది! మీడియా అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ శే్వతసౌధాన్ని అధిష్టించినప్పటి నుంచి ఆయనకు అంతటా వ్యతిరేకతే వ్యతిరేకత.. ఇందులో కొంత స్వయంకృతం అయితే.. ప్రభుత్వ పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు. వలసలపై వేటువేసి ముస్లిం దేశాల్లో ఆగ్రహం రగిలించిన ట్రంప్.. వీసాలపైనా కత్తిదూసి అన్ని దేశాల్లోనూ కలవరం పుట్టించారు. పుడమిని రక్షించుకోకపోతే భవిష్యత్‌కు ముప్పేనంటూ సభ్య దేశాలు గగ్గోలు పెడుతున్నా పర్యావరణ సమతూక పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందానికీ తూట్లు పొడిచారు. ఇలా ఒకటా రెండా.. తనకు తోచిందే ఆలోచన.. తాను తీసుకున్నదే నిర్ణయం అన్న చందంగా సాగుతున్న ట్రంప్‌కు వ్యతిరేకత పుట్టడంలో విడ్డూరమేమీ లేదు.
పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే ఇప్పుడు ట్రంప్ వద్దు.. ఆయనుంటే దేశానికే ముప్పు అన్నంత వరకూ..! దేశీయంగానే అమెరికన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా వీధికెక్కారు. ఆయన్ని అభిశంసించాల్సిందేనంటూ సాక్షాత్తు తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగానే ముక్తకంఠంతో డిమాండూ మొదలు పెట్టారు. అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటిలో మిన్నంటిన ఈ ప్రదర్శనలు శే్వతసౌధాధీశుడికి సెగ పుట్టించేవేననడంలో ఎలాంటి సందేహం లేదు. లాస్ ఏంజిలెస్ సహా 45 పట్టణాల్లో జరిగిన ఈ ప్రదర్శనలు ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోశాయి. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలోనూ ఇలాంటి ప్రదర్శనలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన పాలనాతీరుపైనా జనం నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప్రదర్శనలకు కాంగ్రెస్ సభ్యుల నుంచీ మద్దతు అందడంతో రాజకీయంగానూ వీటి ప్రాధాన్యత పెరిగింది. తెల్లారితే ట్రంప్ నోట ఎలాంటి మాట వినాల్సి వస్తుందోనన్న భయం జనంలో కనిపిస్తోందంటే ఆయన పాలన వారిని ఎలా బెంబేలెత్తిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా అమెరికా వ్యవహారం కాబట్టి వీటి వెనుక పార్టీ రాజకీయాలుంటాయనుకోవచ్చు. కానీ బ్రిటన్‌లోనూ ట్రంప్ వ్యతిరేక సెగలు రాజుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ట్రంప్‌ను ఆ దేశ ప్రధాని థెరీసా మే ఆహ్వానించారు. అనంతరం అమెరికాలోనూ, బ్రిటన్‌లోనూ చోటుచేసుకున్న పరిణామాలు కల్లోలానే్న రేపాయి.
బ్రెగ్జిట్‌పై పట్టు బిగించాలనుకున్న థెరీసాకు ఆ దేశ ఓటర్లు చుక్కలు చూపించారు. ఉన్న మెజార్టీని తీసేసి మరో చిన్న పార్టీపై ఆధారపడితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిని ఆమెకు కల్పించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తమ దేశ పర్యటనకు వద్దంటూ ట్రంప్‌కు ఆమె చల్లగా చెప్పినా ఆయన వినే పరిస్థితి లేదు. ఎలాగైనా సరే బ్రిటన్‌లో అడుగు పెట్టి తీరతానంటున్న ట్రంప్‌ను రానివ్వకూడదన్న పట్టుదల ప్రజల్లో పెరిగింది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా నెలలకు ముందే ఎక్కడలేని హడావుడీ జరుగుతుంది. అమెరికా అధికారులు, గూఢచారులు ఆ దేశంలోని కీలక స్థావరాల్లో పాగా వేస్తారు. ఇంతటి హడావుడి సృష్టించే అమెరికా అధ్యక్షుడి పర్యటన పట్ల ఇంత వ్యతిరేకత రావడం విడ్డూరమే! తనను వద్దంటున్న దేశంలో పర్యటించి తీరాలన్న ట్రంప్ పట్టుదలా అంతే విస్మయకరంగా ఉంది. ట్రంప్ వంటి విచ్ఛిన్నకర అధ్యక్షుడు చరిత్రలోనే లేరన్న నినాదాలు మిన్నంటుతున్నాయి. పనులు మానుకునైనా సరే ట్రంప్ పర్యటనను అడ్డుకుంటామంటూ మిలియన్లకొద్దీ బ్రిటన్‌లు భీష్మించుకు కూర్చోవడం కూడా ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేపుతోంది. సొంత దేశం వద్దంటున్నా... పొరుగు దేశం రావద్దంటున్నా ట్రంప్ తదుపరి వ్యూహమేమిటో ఎవరికీ తెలియదు.. ఆయనకు తప్ప..!