స్పాట్ లైట్

మెలికల డ్రాగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశం వస్తే వివాదాన్ని రగిలించడంలో చైనాకు చైనానే సాటి. 1960వ దశకంలో జరిగిన యుద్ధాన్ని తరచూ పావుగా వాడుకుంటూ అరుణాచల్‌పై భారత్‌ను యాగీ చేస్తూ వచ్చిన చైనా ఇప్పుడు భూటాన్ మెలికతో మరో వివాదాన్ని రేపింది. భూటాన్ మీదుగా ఓ రహదారిని నిర్మిస్తూ కవ్వింపుచర్చలకు పాల్పడింది. డోకో-లా ట్రై జంక్షన్‌గా పేర్కొనే ఈ ప్రాంతంలో చైనా చేపట్టిన ఈ చర్యలను భారత్ తీవ్రంగానే వ్యతిరేకించింది. అయితే ఈ రహదారిని తమ భూభాగంలోనే నిర్మించుకుంటున్నామని భూటాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించనేలేదంటూ చైనా చేస్తున్న వాదనలో నిజం గురివింద చందమే. పరిస్థితి శృతి మించడంతో ఇరుదేశాల మధ్య తీవ్రస్థాయిలోనే సంఘర్షణ వాతావరణం తలెత్తింది. బంకర్ల విధ్వంసమూ జరిగింది. అగ్నికి ఆజ్యం పోసిన సందంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు టిబెట్ మీదుగా వెళ్తున్న భారతీయ యాత్రికులను వెనక్కి పంపేసి పరిస్థితిని మరింత జఠిలంగా మార్చింది. ఇంతకూ ఈ వివాదం మూలమేమిటీ? భారత్, చైనాల మధ్య భూటాన్ ప్రాధాన్యత ఏమిటన్నది ఈ వివాదంలో కీలక అంశం. డోకో-లా ప్రాంతంలో తలెత్తిన వివాదం భూటాన్-్భరత్- చైనాలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధించిందే. సిక్కింలోని భారత్-చైనా-్భటాన్ ట్రై జంక్షన్‌లోగల భారత సైనిక బంకర్‌ను చైనా ధ్వంసం చేయడంతో రగిలిన ఈ వివాదం ఇరుదేశాలు పరస్పరం తీవ్ర స్థాయిలో హెచ్చరించుకునే వరకూ విషమించాయి. 1962నాటి భారత దేశానికి ఆర్థికంగా, రాజకీయంగా ,సైనిక పరంగా ఎదిగిన నేటి భారతానికి ఎంతో తేడా ఉందని చెంపపెట్టులాంటి సమాధానాన్ని రక్షణ మంత్రి అందించడంతో పరిస్థితి ఉద్రిక్తతల స్థాయి వరకూ వెళ్లింది. నిజానికి అరుణాచల్ వ్యవహారంలో భారత్, చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం లాంటిదే ఈ ట్రైజంక్షన్ వివాదం కూడా.1962 నుంచి ఎలాంటి పరిష్కారం లేకుండా అడపాదడపా ఈ వివాదం తెరమీదకు వస్తునే ఉంది. ముఖ్యంగా భారత్‌కు అంతర్జాతీయంగా ఎప్పుడూ గుర్తింపు లభించినా అమెరికా వంటి దేశాలు మద్దతు ప్రకటించినా కూడా దీన్ని జీర్ణించుకోలేని చైనా పాత సమస్యలను తవ్వుతూ కొత్త వివాదాలకు దారులు తీస్తునే వస్తుంది. మొన్న అరుణాచల్‌లో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువుదలైలామా పర్యటన సందర్భంలోనూ చైనా అలజడి రేపింది. అరుణాచల్ భూ భాగంలోకి ప్రవేశించి తన జండాలు పాతుతూ సమస్యలను రగిలిస్తునే వచ్చింది.
ఇప్పుడు అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ దిగ్విజయంగా ముగించుకోవడం చైనాకు కలవరపాటుగా మారింది. అందుకే టిబెట్‌ను అడ్డం పెట్టుకుని ఈ పాత గాయాన్ని రేపింది. భారత్, అమెరికాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై ఎప్పుడు చర్చ జరిగినా చైనా ఇదే రకంగా వ్యవహరిస్తోంది. అలాగే చైనా చేపట్టే ప్రతిచర్యనూ అందులోని దుర్నీతి కోణంలో భారత్ అడ్డుకుంటునే వస్తోంది. ఇటీవల అనేక దేశాల మీదుగా సాగే విధంగా, తన భౌగోళిక ప్రాబల్యాన్ని పెంచుకుంటూ చైనా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్(ఒబిఓఆర్)ను భారత్ వ్యతిరేకించింది. ఇప్పుడు డోకోలా వ్యవహారం దీనికి అందివచ్చింది. భారత యాత్రికులను తిప్పిపంపడం ద్వారా మన మనోభావాలనే చైనా దెబ్బతీసింది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా కుత్సిత వ్యూహం బయటపడింది. భారత నిజాయితీ మరోసారి నిగ్గుదేలింది. భూటాన్ భూ భాగాన్ని ఆక్రమించుకోవాలన్నదే చైనా వ్యూహంగా కనిపిస్తుందన్నది స్పష్టం. ముఖ్యంగా ఇది భారత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్నందున దీన్ని పరిరక్షించుకునే విషయంలో భూటాన్‌తో భారత్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పెద్దగా ప్రతిఘటించలేని దేశం కాబట్టి భూటాన్ భూ భాగాన్ని కబ్జా చేయాలన్న చైనా ప్రయత్నాలు ఎంత మాత్రం సాగే అవకాశం లేదు. ఈ విషయంలో డ్రాగన్‌ను నిలువరించేందుకు భారత్‌తోపాటు ఇతర దేశాలూ కలిసివస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

బి. రాజేశ్వర ప్రసాద్