స్పాట్ లైట్

నన్ను దించతరమా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియంతృత్వానికి వ్యతిరేకంగా జనం తమగళాన్ని వినిపించి నియంతలను తరిమికొట్టి ఎన్నో దేశాలకు ప్రజాస్వామ్య స్ఫూర్తినందించి అరబ్ స్ప్రింగ్ వేడి తగ్గిందా? ఒక్క టునీషియా తప్ప ఎక్కడా ఆ తరహా ప్రజా ఉద్యమాలకు కాలం చెల్లినట్టేనా..!జనం తిరగబడటంతో ఒకప్పుడు నియంతలు పరుగులు పెట్టేవారు..కానీ సిరియా విషయానికొస్తే అరాచకాలు తాళలేక జనమే ప్రాణభయంతో పరుగులు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
సముద్ర మార్గమైనా, భూమార్గమైనా ప్రాణాలు దక్కితే చాలన్న ఆందోళన సిరియా ప్రజల్లో తలెత్తింది. జనంలో ఎంతగా భయాందోళనలు రేకెత్తించినా అసాద్ మాత్రం నిర్భీతిగానే అధికారంలో కొనసాగుతున్నారు. సిరియా నుంచి పారిపోతున్న శరణార్థులను భరించలేక ఇరుగు పొరుగు దేశాలు కకావికలు అవుతున్నాయి. ఇంతగా జనాన్ని బెంబేలెత్తిస్తున్న లేదా దేశంలో అంతూ పొంతూ లేని రీతిలో అరాచక పరిస్థితులకు, మారణకాండకు కారణమవుతున్న అసాద్ తిరుగులేని అధికారాన్ని ఇంకా కొనసాగించడానికి కారణం ఏమిటి? ఏ దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినా దాన్ని తీర్చడం తన ప్రాథమిక బాధ్యతగా పరుగులు పెట్టే అమెరికా సిరియా విషయంలో ఎందుకు వౌనం వహిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడానికి కారణం ఏమిటిన్నది అగ్రరాజ్యాల ఆంతరంగిక రాజకీయ సమస్యే అయినా వాటి ఉదాసీనత కారణంగా సిరియా నలిగిపోతోంది. మిలిటెంట్లకు ప్రభుత్వ దళాలకు మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆధిపత్య పోరులో వేలాదిగా ప్రజలు మరణిస్తున్నా ప్రపంచ దేశాలకు పట్టక పోవడం విచారకరం. అన్ని చోట్లా విప్లవాలు, ఉద్యమాలు ఫలించవు. అదే నిజమైతే సిరియా అధ్యక్ష పీఠం నుంచి అసాద్ ఎప్పుడో వైదొలగిపోయి ఉండేవాడే! కానీ, సంఘర్షణలు ఎంత తీవ్రమైతే అంతగానూ ఆయన శక్తిమంతమవుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నా..ఉన్నవారు పొరుగు దేశాలకు పారిపోతున్నా అసాద్‌కు చీమకుట్టినట్టయినా లేదు. జనం తిరగబడితేనే సీటు వదిలి పారిపోవాల్సిన నియంత ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా.. ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నా, సైనికుల్లో ఒక వర్గం ధిక్కరిస్తున్నా అసాద్ బెసగడం లేదు. ఈ అరాచకం నుంచి మరింత శక్తిని పుంజుకుంటున్నాడు. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. నియంతృత్వాల్ని మట్టి కరిపించేందుకు అరాచకాన్ని సృష్టిస్తే అందులోంచి ఐసిస్ వంటి జిహాదీ సంస్థలు పుట్టుకొస్తాయి. ఇరాక్‌లో వేళ్లూని సిరియాలో ఐసిస్ బలపడటానికి కారణం అక్కడ అరాచక పరిస్థితులే..‘ఇస్లామిక్ ఖలీఫా కంటేకూడా అసాద్ నియంతృత్వమే సిరియా ప్రజలకు మేలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయోమో..అందుకే ఆయన్ని దిగిపొమ్మనకుండా రక్షిస్తున్నాయేమో..!