స్పాట్ లైట్

ఏది దారి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగుతుందా? ఒకవేళ వైదొలిగినా అనుకున్న రీతిలో తన హక్కులతో పాటు ఆర్థికపరమైన ప్రయోజనాలను సంతరించుకోగలుగుతుందా అన్నది రోజురోజుకూ సందేహాల పరంపరగానే సాగుతోంది. ఇందుకు కారణం దేశ రాజకీయ నాయకత్వం ఈ విషయంలో విభేదాలమయం కావడమే. రెండు ప్రధాన పార్టీల మధ్య పరిష్కారానికి ఆస్కారం లేనంత రీతిలో విభేదాలు నెలకొన్నప్పుడు ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం అన్నది సాధ్యం కాదన్న వాదన ఇటీవల కాలంలో బలం పుంజుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాని థెరిసామే తిరుగులేని మెజారిటీని సంతరించుకుని ఉంటే బ్రెడ్జిట్ చర్చలను బలంగా ముందుకు తీసుకెళ్లేవారే కానీ ఎన్నికల్లో ఉన్నమెజారిటీ కూడా పోవడంతో మరో చిన్నపార్టీ మద్దతుపైనే మనుగడ సాగిస్తున్న థెరిసామే బ్రిటన్ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పరిరక్షించే అవకాశం లేదన్న వాదన పదునెక్కుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు జతకలిపి అఖిలపక్షంగా ఏర్పడ్డారు. కొరివితో తలగోక్కునే చందంగా‘హార్డ్ బ్రెగ్జిట్’ వద్దేవద్దంటూ వీరంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఐరోపా యూనియన్‌తో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై కొత్త పార్లమెంటరీ గ్రూప్ కూడా ఏర్పడడం ఈ మొత్తం వ్యవహారంలో సరికొత్త మార్పు. బ్రిటన్‌కు ఏది మంచో దాన్ని సాధించుకోవాలే తప్ప తాను అనుకున్న మార్గంలోనే ముందుకు వెళ్తానని మే భావిస్తే అంతకు మించిన అవివేకం ఉండదన్నది ఈ పార్టీల భావన. ఈ కొత్త గ్రూప్ రావడంతో బ్రెగ్జిట్ చర్చల వ్యవహారం మరింత సందిగ్ధంలో పడినట్టయింది. మరి ఈ పరిస్థితిని థెరిసామే ఏ విధంగా అధిగమించగలుతారో. అధికారంలో కొనసాగడానికి మద్దతు ఇస్తున్న పార్టీని ఎంత వరకూ నమ్మగలుగుతారన్నది వేచి చూడాల్సిందే. ఈ సవాళ్లను అధిగమించేందుకు బ్రిటన్ ప్రయోజనాల చుట్టూ అలముకున్న పరిస్థితులు బ్రెగ్జిట్‌పై ప్రతికూల సంకేతాలనే అందిస్తున్నాయ.