స్పాట్ లైట్

న్యాయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది జరిగిన తిరుగుబాటును కర్కశంగా అణచివేసిన టర్కీ అధ్యక్షుడు రసెప్ తయిప్ ఎర్డోగన్‌కు మళ్లీ సెగలు మొదలయ్యాయి. ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలు తాజాగా భారీఎత్తున చేపట్టిన ర్యాలీ టర్కీలో రాబోయే పరిణామాలకు సంకేతాన్ని అందిస్తోంది. 25 రోజులపాటు న్యాయం కోసం పోరాటమన్న నినాదంతో జరిగిన ర్యాలీ ముగింపు సందర్భంగా లక్షల సంఖ్యలోనే జనం తరలివచ్చారు. అంకారా నుంచి ఇస్తాంబుల్ వరకు మొత్తం 280 మైళ్ల దూరం పాటు ఈ పాదయాత్ర జరిగింది. గత ఏడాది తిరుగుబాటు జరిగినప్పటినుంచి తన అధికారాన్ని పదిలపరుచుకునేందుకు అణచివేత ఒక్కటే మార్గమన్న రీతిలో అధ్యక్షుడు ఎర్డోగన్ వ్యవహరించడం ప్రతిపక్షంతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర స్థాయి ఆగ్రహాన్ని రగిలించింది. మళ్లీ తిరుగుబాటుకు ఆస్కారం లేని రీతిలో పూర్తిస్థాయి అధికారాలను ఎర్డోగన్ హస్తగతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌లో ఆయన నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర స్థాయి వివాదానే్న రేకెత్తించింది. ఎర్డోగన్ నిరంకుశ ధోరణిని ఎదుర్కోవాలంటే అందుకు ఈ స్థాయి ప్రదర్శన ఒక్కటే మార్గమన్న రీతిలో ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ప్రజలను సమీకరించింది. ఇదే రీతిలో ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని, మీడియా స్వేచ్ఛ ఉండదని, పౌర సమాజాలు కూడా అధికారుల అణచివేత పరిస్థితుల మధ్య బతకాల్సి వస్తుందని విపక్ష నాయకుడు ఫిలిక్ డారోగ్లు హెచ్చరించారు. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు బలహీనంగానే ఉన్నా తాజా ర్యాలీతో దానికి మరింత శక్తి లభించినట్లయింది. భారత్‌లో మహాత్మాగాంధీ ఆంగ్ల పాలకులకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఏవిధమైన ఉద్యమాలు సాగించారో అదే రీతిలో ఎర్డోగన్‌కు వ్యతిరేకంగా టర్కీ ప్రజలను సమీకరిస్తున్నామని విపక్షాలు చెప్పడం ప్రజల్లో మరింత స్ఫూర్తిని రగిలించింది. మిలిటెంట్ సంస్థలపైనే తాను చర్యలు తీసుకుంటున్నానని ఎర్డోగన్ చెబుతున్నప్పటికీ వీటికి స్పష్టత లేకపోవడం వల్ల సామాన్య ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందని విపక్షాలు చెబుతున్నాయి. మొత్తం మీద మిలిటెంట్ తిరుగుబాటును ఎర్డోగన్ అణచివేయగలిగినా ఇప్పుడు ప్రజల్లో రగులుకుంటున్న వ్యతిరేకతను ఏవిధంగా అధిగమించగలుగుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

చిత్రం.. టర్కీలో జస్టీస్ మార్చ్