స్పాట్ లైట్

సంక్షోభమా..నువ్వెంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షోభాలు, దైన్యం, పేదరికానికి అతీతమైనదే బాల్యం. ఆ బాల్యానికి పరిసారాలతో సంబంధం లేదు. స్నేహితులు కలిస్తే చాలు ఆటపాటల ఆనందంలో అలసి సొలసిపోతారు. అనిర్వచనమైన అనుభూతి తన్మయత్మమైపోతారు. సిరియా కల్లోలం గురించి.. అక్కడి జనజీవనానికి రోజువారీగా ఎదురవుతున్న జీవన్మరణ సమస్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడు ఎక్కడినుంచి దాడి చేస్తారో, ఏ క్షణంలో ఎవరి ప్రాణాలు హరీమంటాయో అంతుబట్టని ప్రత్యక్ష నరకం సిరియా. చుట్టూ శిథిల భవనాలు దైన్యంగా చూస్తున్న చిన్నారుల్లో మాత్రం అదేది పట్టని ఆటపాటల ఆనందం. అదే బాల్యం. దేశమేదైనా కాలమాన పరిస్థితులెలా ఉన్నా చిన్ననాటి ముచ్చట్లు చిన్ననాటివే. మరపురాని అనుభూతులే.