స్పాట్ లైట్

‘సంపన్నం’ కదిలింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సంక్లిష్టమైన అంశాలను శోధించి సాధించడానికి అంతర్జాతీయంగా ఎన్నో వేదికలున్నాయి. అలాంటి వాటిల్లో అత్యంత కీలకమైనది సంపన్న దేశాలతో కూడుకున్న జి-20. ఇప్పటివరకు ఎన్నో శిఖరాగ్ర సదస్సులను ఈ దేశాల కూటమి నిర్వహించింది. తాజాగా జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన శిఖరాగ్ర భేటీకి అనేక కోణాల్లో ప్రాధాన్యత చేకూరింది. ఈ భేటీలో సంపన్న దేశాలతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాలు కీలక భూమికను పోషించడం, పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన సహా అనేక కీలక అంశాలపై దృష్టి పెట్టడం ముదావహమే అయినా ఈ రకమైన భేటీలో తీసుకునే నిర్ణయాలు ఎంతమేరకు ఆచరణాత్మకమవుతాయన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడు శిఖరాగ్ర సదస్సు జరిగినా ప్రపంచ దేశాలన్నీ భూతాపం పెరిగిపోతోందని, వాతావరణం వేడెక్కిపోతోందని, జీవానుకూల పరిస్థితులు ఎప్పటికప్పుడు అడుగంటి పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తాయి. వాటిని నిరోధించాలని ఘంటాపథంగా ఉద్ఘాటిస్తాయి కూడా. కానీ ఆచరణకు వచ్చేసరికి ఎవరిదారి వారిదే అన్న చందంగా పరిస్థితులు మారిపోతాయి. వాతావరణ మార్పుల నిరోధన అవకాశాలు చేజారిపోతున్న తరుణంలో అటో ఇటో అన్న రీతిలో పారిస్ శిఖరాగ్ర సదస్సు జరగడం... అమెరికా సహా అన్ని దేశాలు అనివార్య పరిస్థితుల్లోనే ఆ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నివసించడానికే వీల్లేనంత స్థాయిలో సమస్త జీవకోటి మనుగడనూ ప్రశ్నార్థకం చేస్తూ భూగోళం వేడెక్కిపోతున్నా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడమన్నది ఎంతమాత్రం సమంజసం కాదు. తప్పనిసరిగా నిర్బంధంగా అమలుచేయాల్సిన పారిస్ పర్యావరణ ఒప్పందం విషయంలోనే పొరపొచ్చాలు రావడం, ఈ ఒప్పందం తమకు నష్టదాయకమంటూ డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా వైదొలగడం భూగోళ హితానికి విఘాతమే. అయితే పారిస్ ఒప్పందంలో మాత్రం ట్రంప్‌ను ఏకాకిని చేస్తూ మిగతా 19 దేశాలు వాటితో పాటు వర్ధమాన దేశాలు పారిస్‌కు పట్టం కట్టడమన్నది భవిష్యత్ తరాలకు కొండంత ధీమాను అందించేదే. వాణిజ్యం, పర్యావరణం వంటి ట్రంప్ మొండిగా వ్యవహరించినా కూడా జి-20 దేశాలు పట్టుదలగా ముందుకు వెళ్లడమన్నది హాంబర్గ్ సాధించిన విజయం. ఈ తరహాలోనే అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులు జరిగితే ఒక్క పర్యావరణ విషయంలోనే కాదు, ఇతర కీలక అన్ని అంశాల్లోనూ గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగితే ఉగ్రవాద నిర్మూలన అసాధ్యమేమీ కాదు. ఈ విషయంలో మంచి చెడులకు తావులేని రీతిలో ప్రపంచ దేశాలన్నీ ముందుకు సాగాలి. జి-20తో పాటు ఇతర అంతర్జాతీయ కూటములన్నీ కూడా నిర్దేశిత లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగడంతో పాటు వాటిలోని సభ్యదేశాలు వ్యక్తిగత స్థాయిలో పరస్పరం సహకరించుకున్నప్పుడే సమస్యలకు సంక్లిష్టతలకు ఆస్కారం ఉండదు. ఎంత పెద్ద దేశమైనా ప్రపంచ హితానికి విరుద్ధంగా వ్యవహరిస్తే దారికి తేవడమన్నది అసాధ్యమేమీ కాదన్న వాస్తవానికి ట్రంప్ విషయంలో జి-20 దేశాలు వ్యవహరించిన తీరే అద్దం పడుతోంది. అదేవిధంగా వర్ధమాన దేశాలుకూడా తమ ఆవేదనను వెళ్లగక్కడంతో పాటు ధనిక దేశాలు వ్యవహరిస్తున్న తీరును కూడా ఈ సదస్సులో స్పష్టం చేశాయి. ఇంతకుముందు జరిగిన శిఖరాగ్ర భేటీలన్నింటికంటే హాంబర్గ్ భేటీ ప్రపంచ దేశాలకో బలమైన సందేశాన్ని ఇచ్చింది. అన్ని దేశాలు చేతులు కలిపితే ఎలాంటి లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించుకోగలుగుతామన్నదే హాంబర్గ్ సమైక్య సందేశం.