స్పాట్ లైట్

*సీన్ రివర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఆ కూటమికి, బ్రిటన్‌కు సంబంధించిన అంశమే అయినా, ఈ పరిణామం ఏమాత్రం తలకిందులైన ప్రతికూల ఫలితాలకు దారితీసినా, అమెరికాతో బ్రిటన్ సంబంధాలు బెడిసికొట్టే అవకాశం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే మిగతా దేశాలకంటే కూడా బ్రిటన్‌తో అమెరికా సంబంధాలు అత్యంత ప్రత్యేకమైనవి, అత్యంత లోతైనవి, అత్యంత ప్రతిష్టమైనవి కూడా. ఇప్పటివరకూ వచ్చిన అమెరికా అధ్యక్షుకంటే భిన్నమైన శైలి, దృక్పథం కలిగిన డొలాన్డ్ ట్రంప్‌తో అనుకున్న స్థాయిలో సఖ్యత కొనసాగడం లేదు. ఇప్పటికే జరిగాల్సిన ట్రంప్ బ్రిటన్ పర్యటన వాయిదా పడటం ఇందుకు సంకేతం. బ్రెగ్జిట్‌ను అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటు వేసి ఏడాది పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ రెండు దేశాల మధ్య సంబంధాలు అంత ప్రత్యేకంగా ఏమీ లేవు. చాలా సందర్భాల్లో బ్రిటన్ అమెరికా మాట జవదాటలేదు. ఇరాక్ యుద్ధ సమయంలోనూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అడిగిందే తడవుగా కదనరంగానికి బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ తన సైనిక దళాలను పంపించారు. అందుకు బ్రిటన్ రాజకీయ పక్షాలు వ్యతిరేకించినా పెద్దన్నమాట కాదనలేదు. బరాక్ ఒబామా హయాంలోనూ బ్రిటన్-అమెరికా సంబంధాలు అంతే ప్రత్యేకతను కొనసాగించినా, ట్రంప్ రావడంతో సీన్ మారిపోయింది. ఎందుకంటే బ్రెగ్జిట్ ప్రయోజనాలకోసం బ్రిటన్ ఎంతగా పట్టుబడితే ఐరోపా యూనియన్‌లోని మిగతా దేశాలతో దాని సంబంధాలు అంతగానూ బెడిసికొడతాయి. దీని ప్రభావం కచ్చితంగా అమెరికాతో ఉన్న ప్రత్యేక అనుంబంధంపైన కూడా పడతాయి. అంతేకాకుండా అమెరికా, బ్రిటన్ సంబంధాలను బట్టే ఈ రెండు దేశాలకు ఐరోపా యూనియన్‌తో ఉండే అనుంబంధం కూడా ఆధారపడి ఉంటుంది.