స్పాట్ లైట్

బాబోయ్ ఆగస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్ నాయకులకు ఆగస్టు నెల వచ్చిందంటే ఎక్కడలేని గుబులు పట్టుకుంటుంది.ప్రస్తుతం అలాంటి పరిస్థితినే అధ్యక్షుడు మైఖెల్ తెమర్ ఎదుర్కొంటున్నాడు. బ్రెజిల్ చరిత్రను పరిశీలిస్తే అధ్యక్ష పీఠానికి ఆగస్టు 31 రోజుల్లోనే తీవ్రస్థాయి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి. అభిశంసనకు గురికావడమో లేక రాజీనామా చేయడమో అనివార్యమైన పరిస్థితులు ఆగస్టు నెలలోనే ఈ దేశాధినేతలకు ఇప్పటి వరకూ తలెత్తుతూ వచ్చాయి. ఈ పరిణామాలు తట్టుకోలేక, సంక్షోభాలను అధిగమించలేక ఓ అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకోవడం కూడా ఇదే నెలలో జరిగింది.
టెమర్‌కు ముందు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేసిన దిల్‌మా రౌసెఫ్ అత ఏడాది ఆగస్టు 31నే ఉద్వాసనకు గురయ్యాడు. అందుకు కారణం బడ్జెట్‌కు సంబంధించి విత్తపరమైన నిబంధనలను ఉల్లంఘించడమే. ప్రస్తుతం తెమర్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఆయన సస్పెన్షకు గురవుతారా లేక విచారణను ఎదుర్కొంటారా అన్నది త్వరలోనే తేలబోతోంది. పరిస్థితి ఎలా ఉన్నా ఈ నెలలోనే ప్రస్తుత అధ్యక్షుడి భవితవ్యం కూడా తేలుతుందన్నది వాస్తవం. ఒకవేళ ఈ సంక్షోభాన్ని ఆయన ఎదుర్కొన్నప్పటికీ అధికారంలో కొనసాగుతారా లేదా అన్న అనుమానం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అధ్యక్షుడు తెమర్‌కు ఎంత మాత్రం అనుకూలమైన పరిస్థితులు లేవు. కేవలం 5 శాతం మంది మాత్రమే ఆయన నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పడు తెమర్ సస్పెండ్ చేయాలా వద్దా అన్నదానిపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠను రేకెత్తిస్తోంది.