స్పాట్ లైట్

ఇంతే సంగతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-పాకిస్తాన్‌ల మధ్య అసలు పూర్తి స్థాయి సఖ్యతకు ఆవకాశం ఉందా? భారత ప్రధాని మోదీతో అంతో ఇంతో సత్సంబంధాలు కలిగిన నవాజ్ షరీఫ్ నిష్క్రమణతో పాక్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు ఇందుకు ఎంత మేరకు దోహదం చేసే అవకాశం ఉంది? భారత వాణిజ్య రాజధాని ముంబయిపై జరిగిన ఉగ్రదాడి మొదలుకుని పఠాన్‌కోట్ వరకూ అన్ని ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్టు శక్తుల గుట్టు విప్పిన భారత్ వాటిని నిషేధించాలని, ఉగ్రదాడులకు పన్నాగం పన్నిన వారిపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసింది. ఆ డిమాండ్లను ఇప్పటి వరకూ పట్టించుకోని పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కుంటిసాకులు చెబుతూ న్యాయపరమైన చర్యల్ని దాటవేస్తూ వచ్చింది. ఇప్పటి వరకూ భారత్‌తో సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తూ వచ్చిన నవాజ్ షరీఫ్ ప్రభుత్వం లేకపోవడంతో..ప్రస్తుత ప్రధాని ఎంత వరకూ భారత్ డిమాండ్లను నెరవేరుస్తారన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు భారత్‌కు సన్నగిల్లుతున్నాయన్న వాదనా బలపడుతోంది. పఠాన్‌కోట్, ఊరీ సహా భారత్‌పై జరిగిన ఉగ్రవాద దాడులన్నింటి వెనుకా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అలాగే దాని సైన్యం హస్తం ఉందన్నది వాస్తవమే!అలాగే ఆధీన రేఖ వెంబడి జరుగుతున్న నిరంతర కాల్పులకూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది, వాటిని ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తున్నదీ పాక్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐఏననీ ఎన్నోసార్లు రుజువైంది. వీటన్నింటికీ తోడు భారత నౌకాదళ మాజీ అధికారి జాధవ్‌ను గూఢచారిగా చిత్రీకరిస్తూ అతడికి పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించిన వ్యవహారం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మరింత చిచ్చు పెట్టింది. గత ఐదు నెలల వ్యవధిలో ఇరు దేశాల ప్రధాన మంత్రులు పలు సందర్భాల్లో సమావేశమైనా వారి మధ్య భేటీ పరస్పర పలుకరింపులకే పరిమితమయ్యాయే తప్ప కీలకమైన సమస్యల పరిష్కారానికి ఏ విధంగానూ దోహదం చేయలేదు. ఇప్పటి వరకూ వచ్చిన పాకిస్తాన్ ప్రధాన మంత్రులందరి కంటే భారత్‌తో తరచూ చర్చలకు సిద్ధపడి తన ప్రజాస్వామ్య స్వభావాన్ని వెల్లడించింది నవాజ్ షరీఫేనన్నది వాస్తవం. మొత్తం తొమ్మిదేళ్ల పాటు అంటే మూడుసార్లు దేశ ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టినప్పటికీ ఎప్పుడూ పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగలేదు. అయితే భారత్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునేందుకు ఆయన చేసినట్టుగా గతంలో వచ్చిన ఏ పౌర ప్రభుత్వాలూ కృషిచేయలేదన్న నిజాన్నీ విస్మరించలేం. ప్రస్తుతం కూడా నవాజ్ సారధ్యంలోని పిఎమ్‌ఎల్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరుగుపరచుకునేందుకు దానికి ఉన్న పరిధి ఏమిటి? అందుకు సైన్యం ఎంత మేరకు దోహదం చేస్తుందన్నది అనుమానమే. పఠాన్‌కోట్‌లోని వైమానిక కేంద్రంపై జరిగిన దాడి వెనుక జైషే మొహమ్మద్ మిలిటెంట్ల హస్తం ఉందన్న వాస్తవం నిగ్గుదేలినా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను భారత్ అందించినా ఎలాంటి పురోగతి లేదు. అంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించే అవకాశాన్నీ పాకిస్తాన్ అధికారులకు భారత్ అందించింది. గత ఏడాది మార్చిలో పాక్ దర్యాప్తు బృందం పఠాన్‌కోట్ వచ్చీ ఇంత వరకూ చేసిందేమీ లేదు. పైగా, ఆ దాడి భారత్ సృష్టించుకున్నదేనంటూ స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత బురదచల్లింది. సీమాంతర ఉగ్రవాదం, కుల్‌భూషణ్ జాధవ్, సరిహద్దుల్లో కాల్పుల విషయంలోనూ పాకిస్తాన్ ఇదే ధోరణిని అవలంబిస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పొరుగు దేశంలో ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దుకోవడం అన్నది భారత్‌కు ఇప్పట్లో సాధ్యం కాని వ్యవహారమే! పాక్ నుంచి ఎలాంటి సహకారం లేకుండా ఈ విషయాల్లో భారత్ ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదు. మారిన పరిస్థితుల్లో పాక్ పాలకులు సహకరిస్తారన్న సంకేతాలు ఇప్పట్లో లేనట్టే..!