స్పాట్ లైట్

నియంత గుప్పిట వెనిజులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాగైనాసరే అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనుకునేవాడికి నిరసనలు, ఉద్యమాలు, ఆందోళనలు ఎంతమాత్రం అడ్డుకావు అని చెప్పడానికి వెనిజులాలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. నెలల తరబడి సాగిన ఉద్యమాలను అణచివేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసిన అధ్యక్షుడు మదురో మరింతగా తన అధికారాన్ని సంఘటితం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇందుకు వీలుగా తనకు అనుకూలంగా ఉండే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలను నిర్వహించిన ఆయన తనకు ప్రత్యర్థిగా నిలిచిన అధికార సోషలిస్టు పార్టీ ఉద్యమ నాయకురాలు ఓర్టెగాను తొలగించుకోగలిగారు. ఏప్రిల్ నెల నుంచి మదురోకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో ఆమె అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ అణచివేత చర్యల్లో 120మందికి పైగా మరణించారు. దేశంలో సుస్థిర శాంతియుత పరిస్థితులను పాదుకొల్పడానికే కొత్త అసెంబ్లీని ఏర్పాటుచేస్తున్నట్లుగా మదురో ప్రయత్నించినప్పటికీ దాని వెనుకనున్న అసలు ఉద్దేశం తనను ప్రశ్నించే అధికారం ఎవరికీ ఇవ్వకుండా పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవడమేనన్నది స్పష్టం. వెనిజులాలో ఉన్నది నియంతృత్వ ప్రభుత్వమని, ఏకస్వామ్య ప్రభుత్వమంటూ ఓర్టెగా ఎంతగా గొంతు చించుకున్నా ప్రయోజనం లేని పరిస్థితులే నెలకొన్నాయి. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి జరిగిన ఎన్నికలు అక్రమాలేనంటూ ఆమె తీవ్ర స్థాయిలోనే ఆరోపించారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా అంతర్జాతీయ పర్యవేక్షణలోనే వీటిని నిర్వహించామని అధ్యక్షుడు మదురొ చెబుతున్నప్పటికీ వాటిని ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు. ఈ కొత్త రాజ్యాంగ అసెంబ్లీ ఆవిర్భావంతో సాంప్రదాయక జాతీయ అసెంబ్లీకి విలువ లేకుండా పోయింది. 2015 నుంచి ఈ జాతీయ అసెంబ్లీ ప్రతిపక్షాల మెజారిటీలోనే ఉన్న నేపథ్యంలో ఈ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మదురో ప్రయత్నించారు. ఇందులో పోటీచేసిన అభ్యర్థులందరూ కూడా మదురోకు అనుకూలంగా ఉన్నవారే కావడంతో ఆ ఎన్నికలను విపక్షాలు బహిష్కరించాయి. కొత్త అసెంబ్లీలో తనకున్న మెజారిటీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలకు ఎలాంటి అధికారం లేకుండా చేసేందుకు మదురో ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కొత్త అసెంబ్లీ రావడంతో ప్రతిపక్షాలను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కలుగుతుంది. ఇప్పటివరకు వారికున్న రాజ్యాంగ కవచం తొలగిపోతుంది. అంటే మదురోకు వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నించినా కూడా వారిని చట్టపరంగా శిక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తం మీద తిరుగులేని అధికారాన్ని సంతరించుకున్న మదురో మరో నియంత కాబోతున్నారా? అసలు వెనిజులాలో ప్రజాస్వామ్యం అంటూ ఉందా? అన్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అయితే ఈ రాజ్యాంగ అసెంబ్లీ పూర్తిస్థాయిలో పనిచేసినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందని చివరికి మదురోను కూడా పదవినుంచి తొలగించే అధికారం దీనికి ఉంటుందన్న నిపుణుల వాదన ఎంతవరకు వాస్తవమో వేచిచూడాలి.