స్పాట్ లైట్

యుద్ధమే శరణ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం రోజులుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య చెలరేగుతున్న వాగ్యుద్ధం అంతిమంగా సమరానికే దారితీస్తుందా? ఇటు కొరియా అధినేత కిమ్ జోంగ్, అటు అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కవ్వించుకుంటూ పరస్పరం రెచ్చగొడుతున్న నేపథ్యంలో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది అంతుపట్టడం లేదు. ఇటు క్షిపణి పరీక్షలను నిర్విఘ్నంగా సాగిస్తూ అమెరికా తన సైన్యాన్ని మోహరించిన గువామ్ సైనిక ప్రాంతంపైన దాడికి సన్నద్ధం అవుతున్న ఉత్తర కొరియాను నిలువరించడం ఎలా అన్నది అంతుబట్టడి సమస్యగా మారింది. ఐక్యరాజ్య సమితి తీవ్రస్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ ఉత్తర కొరియా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనిక కేంద్రంపై దాడి చేస్తామని చెప్పడమే గాకుండా అందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో.. యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా శక్తియుక్తులతో పోలిస్తే ఉత్తర కొరియా ఏమాత్రం సరితూగదు అనడం వాస్తవం. అయితే నిజంగా ఎలాంటి శక్తి లేకుండా అమెరికా లాంటి దేశాన్ని ఉత్తర కొరియా ధిక్కరించే అవకాశం ఉండదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌ను చాలా తీవ్రస్థాయిలో జోంగ్ రెచ్చగొడుతున్నారంటే ఆయనకు కచ్చితంగా ఇటు చైనానుంచి గాని, మరో రకంగా గాని గట్టి వెన్నుదన్ను ఉండితీరాలి. ఒకవేళ ఆంక్షలు విఫలమైతే కచ్చితంగా ఉత్తర కొరియాపై దాడి చేసేందుకు అమెరికా ఎంతమాత్రం వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. ఇప్పటికే ఈ దిశగా అమెరికా అనేక ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. దాదాపుగా సైనిక దాడికి తాము సమాయత్తం అన్న సంకేతాలను అందించింది. అయితే ఈ అంతిమ నిర్ణయం తీసుకోవడానికి ముందు దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, అలాగే ఉత్తర కొరియాను మరింతగా ఏకాకిని చేయడానికి ఆంక్షల తీవ్రతను పెంచాలని అమెరికా భావిస్తోంది.
ఒకవేళ దాడి అనివార్యమైతే అందుకు అవసరమైన ఆపద్ధర్మ ఏర్పాట్లను చేసుకోవాలన్నది అమెరికా నిపుణుల సూచన. ఇప్పటికే ఉత్తర కొరియా అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్లుగా సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియాపై దాడి చేయాలంటూ ముందుగా దక్షిణ కొరియాతో అన్ని విధానాలుగా అమెరికా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తమ సైనిక దళాలు మోహరించిన గువామ్ ప్రాంతానే్న ఉత్తర కొరియా లక్ష్యంగా చేసుకోవడంతో అమెరికాకు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. తమ మిత్ర దేశాలను రక్షించుకోవడమే కాకుండా గువామ్ ప్రాంతాన్ని కూడా పరిరక్షించుకోవాలంటూ అమెరికా పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగాల్సిన అగత్యం కనిపిస్తోంది. ఉత్తర కొరియా చేష్టలు అమెరికాకు, దానికీ మధ్యే పరిమితం అవుతాయా లేక ప్రపంచ దేశాలపైన అంతర్జాతీయ శాంతిపైన దీని ప్రభావం ఉంటుందా అన్నది ఆందోళన కలిగిస్తోంది. ఆత్మరక్షణ కోసమే తాము అణు, క్షిపణి కార్యక్రమాలను చేపట్టామని చెబుతున్న ఉత్తర కొరియా తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగితే మాత్రం వెనక్కి తగ్గేది లేదన్న బలమైన సంకేతాలే అందించింది.
ముఖ్యంగా దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాల కోసం ఇప్పటికే అమెరికా భారీఎత్తున ఆయుధాలను, బలగాలను మోహరించిందని, వీటి అంతిమ లక్ష్యం తమపై దాడి చేయాలన్నదేనని ఉత్తర కొరియా స్పష్టం చేస్తోంది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ వివాదం ముదిరి, సంఘర్షణ తీవ్రమైతే అది ఎలాంటి పరిణామాలకైనా దారితీయవచ్చునని చెబుతున్న నిపుణులు తదుపరి పరిస్థితులు అమెరికా తీసుకోబోయే చర్యలపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంక్షోభవం ముదిరితే ఐక్యరాజ్య సమితి నిర్వహించే పాత్ర ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తర కొరియాపై విధించిన ఆర్థిక ఆంక్షలు పూర్తి స్థాయలో ఫలితానివ్వాలంటే కొంత వ్యవధిపాటు వాటి అమలును పర్యవేక్షించాల్సిన అవసరముంది. ఎప్పటికప్పుడన్న ట్టుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరుపుతున్నప్పటికీ పరిస్థితి యుద్ధం వరకు వెళ్లకుండా దాన్ని అరికట్టేందుకు ఇతర మార్గాలపై దృష్టిపెట్టడ మన్నది ఎంతైనా అవసరం. ఇటు ట్రంప్ అటు జోంగ్‌లు పరస్పరం రెచ్చగొట్టుకుంటూ పోతే పరిస్థితి విషమిస్తుందే తప్ప సానుకూల వాతావరణానికి ఎలాంటి అవకాశం ఉండదు. అవకాశాలు చేజారిపోకుండా సంఘర్షణ అనివార్యమన్న పరిస్థితికి ఆస్కారమివ్వకుండా ఈలోగా చేయాల్సిన పనిని ఐరాస చేపట్టాలి.

బి.రాజేశ్వర ప్రసాద్