స్పాట్ లైట్

శరణార్థులూ.. ఇక రాకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాలన్నీ ముఖ్యంగా ఐరోపాను శరణార్థుల సంక్షేమం కుదిపేస్తోంది. ఉత్తరాఫ్రికాలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకవైపు, ఎంతమాత్రం మనుగడ సాగించలేని దయనీయ వాతావరణం మరొకవైపు కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న శరణార్థులకు ఐరోపా దేశాలే దిక్కవుతున్నాయి. ఆ దిక్కూ ఇప్పుడు మూసుకుపోతోంది. మధ్యదరా సముద్రం మీదుగా ఐరోపాలోకి వచ్చేవారికి దారంటూ లేకుండా చేసే శక్తులు బలపడుతున్నాయి. ఇప్పటివరకూ శరణార్థులను తీసుకువస్తున్న ఎన్జీవో వాహనాలను తాము సేకరించిన నిధుల ద్వారా అడ్డుకుంటూ వచ్చిన ‘డిఫెండ్ ఐరోపా’ గ్రూపునకు ఇప్పుడు నిధులు కొరవడ్డాయి. ఇప్పటివరకూ ఈ సంస్థ చేపట్టిన చర్యల వల్ల మధ్యలోనే ఆగిపోయిన వేలాది మంది శరణార్థులు నీట మునిగి మరణించారు. ఇప్పటివరకూ అనేక దేశాల నుంచి డిఫెండ్ ఐరోపా గ్రూపు నిధులను సేకరించింది.
ఇప్పుడు ఆ నిధులకు గండిపడటంతో దిక్కులేని పరిస్థితిలో పడింది. ఐరోపాను రక్షించడమే తమ ధ్యేయమని ప్రకటించిన గ్రూపు అక్రమ వలసలను అడ్డుకుని తీరతామని చెబుతోంది. ఎక్కడినుంచయితే ఈ వలసదారులు బయలుదేరుతున్నారో అక్కడే వారికి అడ్డుకట్టవేసే ప్రయత్నాలను కొనసాగిస్తామంటోంది. ఇప్పటివరకూ తాము రెండు లక్షల డాలర్లకుపైగా విరాళాలను సేకరించామని చెబుతున్న ఈ గ్రూపు భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.