స్పాట్ లైట్

మాదంటే మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, మలేసియాల మధ్య నలభై ఏళ్ల వివాదం తెరపై వచ్చింది. అమెరికా యుద్ధనౌక మరో వాణిజ్య నౌకను ఢీకొన్న మాట ఎలా ఉన్నా ఈ రెండు దేశాలు పాత గొడవను తవ్వుకుంటున్నాయ. సహాయ చర్యలకు తమ తమ బృందాలను పంపించాయ. ఈ ప్రాంతం సింగపూర్‌కే చెందుతుందని అంతర్జాతీయ న్యాయస్థానం చెబుతున్నా మలేసియా ఒప్పుకోవడం లేదు.

గత నాలుగు దశాబ్దాలుగా సింగపూర్, మలేసియాల మధ్య రగులుకుంటూ వస్తున్న ప్రాదేశిక వివాదం మరోసారి పడగవిప్పింది. మలాకా సంధిలో అమెరికా యుద్ధ నౌకను మరో చమురు ట్యాంకర్ డీకొనడమే ఇందుకు నిదర్శనం. అమెరికాకు చెందిన యుద్ధ నౌక యుఎస్‌ఎస్ జాన్ మెకైన్ సింగపూర్ వెళుతూండగా అల్‌నిక్ ఎమ్‌సి అనే వాణిజ్య నౌకను ఢీకొనడం, పది మంది అమెరికా నావికులు గల్లంతు కావడం, మరికొందరు గాయపడటం మాట ఎలా ఉన్నా..ఈ సంఘటన తమ ప్రాదేశిక జలాల్లోనే జరిగిందంటూ ఇటు సింగపూర్, అటు మలేసియాలు పాత గొడవను తెరపైకి తెచ్చాయి. కారణం...ఈ ప్రమాదం జరిగిన పెడ్రా బ్రాంకా ప్రాంతంపై రెండు దేశాలు దీర్ఘకాలంగా గొడవ పడటమే! గల్లంతైన వారికోసం రెండు దేశాలూ సహాయ చర్యల్ని చేపటడం వివాదంలో కొత్త మలుపు.
ఒకప్పుడు సింగపూర్ కూడా మలేసియాలో భాగంగా ఉండేది.1965లో తీవ్ర ఘర్షణల కారణంగా విడిపోయినా దౌత్య, ఆర్థిక, ప్రాదేసిక పరమైన వివాదాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పెడ్రా బ్రాంకా విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం 2008లో తీర్పునిచ్చింది.ఈ ప్రాంతం సింగపూర్‌కే చెందుతుందని, దానికి సమీపంలో ఉన్న మిడిల్ రాక్స్ ప్రాంతం మలేసియాకు దక్కుతుందని తేల్చిచెప్పింది. దీన్ని మలేసియా సవాలు చేడటంతో పరిస్థితి మొదటికొచ్చింది.

చిత్రం..అమెరికా నౌక యుఎస్‌ఎస్ జాన్ మెకైన్‌తో ఢీకొన్న అనంతరం సింగపూర్ జలాల్లో నిలిచివున్న ట్యాంకర్ ఆల్విక్ ఎంసి