స్పాట్ లైట్

రెచ్చిపోతే సరిపోదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా తీరే వేరు! ఎక్కడ మెలిక పెట్టాలో అక్కడ పెట్టి చిద్విలాసంగా కూర్చుంటుంది. ఓ పక్క భారత్‌తో డోక్లామ్ వివాదాన్ని రగిలిస్తున్న డ్రాగన్ మరోపక్క ఉత్తర కొరియాను వెనకేసుకొస్తూ శాంతికి కొరివి పెడుతోంది. దేనికైనా తెగించే ట్రంప్‌ను సైతం ముందుకెళ్లకుండా చేస్తోంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న వెనిజులా పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ట్రంప్ ఉపక్రమించకుండా ముందరికాళ్లకు బంధం వేసింది. ఎక్కడ సమస్య ఉంటే దాని పరిష్కార బాధ్యత తనదేనని భావించే అమెరికాను వెనిజులా సంక్షోభం వేడెక్కిస్తున్నా చైనా హెచ్చరిక కారణంగా ఏమీ చేయలేకపోతోంది.
ఒక దశలో తనదైన శైలిలో ఆంక్షల కొరడా ఝుళిపించేందుకు ట్రంప్ ఉత్సాహ పడ్డా ‘దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు’ అంటూ చైనా అడ్డుపుల్ల వేసింది. అయినా ఆగని ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు. వెనిజులాపై ఆంక్షలు విధించినా ఇప్పటి వరకూ అది దారికొచ్చిన దాఖలాలు ఏమీ లేకపోవడంతో చైనా నోరువిప్పింది. ఒక దేశ సమస్యను దానికోణంలోనే పరిష్కరించాలే తప్ప చీటికీమాటికీ ఆంక్షలు విధిస్తామని చెప్పడం వల్ల, అలాంటి చర్యలకు పాల్పడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపింది. బాహ్య జోక్యం, ఏకపక్ష ఆంక్షల వల్ల సమస్యలు మరింత జటిలం అవుతాయే తప్ప కొరుకుడు పడవని హితవు పలికింది. వెనిజులా అధినేత నికోలస్ మదురోను దారికి తేవాలంటే ఆయనకు ఆర్థిక సాయం అందకుండా చేయడమొక్కటేనన్నది అమెరికా వాదన. ఇప్పటికే అమెరికాపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తమపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించిందంటూ వైట్‌హౌస్ ను వీధికి లాగుతున్నారు. సకాలంలో తాము చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలన్నదే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని, ఆ విషయంలో అంతిమ విజయం తమదేనని మదురో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి వచ్చిన చైనా ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని తెలిపింది. వెనిజులా సమస్య పూర్తిగా స్థానికమైనది కాబట్టి దాని పరిష్కార బాధ్యతను ఆ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకే వదిలేయడమే ఉత్తమమంటూ అమెరికాకు హితవు పలికింది. ఇంధన రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ వెనిజులాతో చైనాకు వ్యాపార, దౌత్య సంబంధాలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.