స్పాట్ లైట్

ఇరాన్‌తో ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరాన్ విషయంలో మొదటి నుంచి ఇజ్రాయెల్‌ది ప్రతికూల వైఖరే. కారణం రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కావడం. మిగతా దేశాల పట్ల ఇరాన్ వైఖరి ఎలా ఉన్నా ఇజ్రాయెల్ మాటొచ్చే సరికి నిప్పులు చెరుగుతుంది. అదే తరహాలో ఇజ్రాయెలూ రెచ్చిపోతుంది. ఇరాన్ ఎంతగా ఎదిగితే అంతగానూ ఇజ్రాయెల్‌కు ముప్పేనని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల రష్యా నేతలతో అనడమే ఇందుకు నిదర్శనం. ప్రపంచంలో ఏ దేశానికీ లేని శక్తియుక్తులు, తెలివితేటలూ ఇజ్రాయెల్‌కు ఉన్నాయి. అలాంటప్పుడు ఇరాన్ అంటే దానికి గుబులెందుకు? ఇరాన్ మాటెత్తితే..ఎందుకు చిందులేస్తుందన్నది చారిత్రక పరిణామాల ఫలితం. ముఖ్యంగా సిరియాపై ఇరాన్ పట్టు ఇటీవల పెరుగుతోందని, అదే జరిగితే తమ దేశానికి ముప్పేనంటూ తన మిత్ర దేశమైన అమెరికాకు బదులు ఇప్పుడిప్పుడే పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న రష్యా నాయకత్వం ముందే నెతన్యాహూ తన గోడు వినిపించుకున్నారు. దీనికీ బలమైన కారణం ఉంది. చైనా హెచ్చరికలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనకడుగు వేయడంతో సిరియా తెరపైకి రష్యా వచ్చింది. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రియాశీలకంగానే సిరియా సంక్షోభంలో ఆధిపత్య కోణాలు వెతుక్కుంటున్నారు! కేవలం తమకే ఇరాన్ వల్ల ముప్పు ఉందని చెబితే పుతిన్ ఎక్కడ వినడనుకున్నారేమో..‘సిరియాపై ఇరాన్ పట్టు పెరిగితే అది మొత్తం పశ్చిమాసియాకే ముప్పు’అంటూ నెతన్యాహూ స్పష్టం చేయడంలో ఉద్దేశం ఆయనకే తెలియాలి. ఇప్పటికే ఇరాక్, యెమన్‌లపై ఇరాన్ పట్టు పెరగడం ఇజ్రాయెల్‌కు ఎక్కడ లేని ఆగ్రహాన్నీ కలిగిస్తోంది. అలాగే లెబనాన్‌పైనా ఇప్పటికే ఇరాన్ ప్రభావం స్పష్టం కావడం నెతన్యాహూకు మరింత గుబులే పుట్టిస్తోంది. రోజువారీగానే ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్న ఇరాన్ లక్ష్యం నెరవేరడం మాట ఎలా ఉన్నా..నెతన్యాహూ ఆందోళన మాత్రం ఇరాన్ పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. మరి ఈ విషయంలో రష్యా ఏమి చేస్తుంది? నెతన్యాహూకు పుతిన్ ఏ మేరకు ధీమానందించారన్న విషయాన్ని వేచిచూడాల్సిందే..