స్పాట్ లైట్

హార్వీ..హతవిధీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుతుపానులు పేద దేశాల పాలిట శాపాలే అవుతాయి. ముందస్తు సమాచారం లేకపోవడం, ఉన్నా దాని తీవ్రతను ఎదుర్కొనే స్థోపత లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అందుకే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో వందలాదిగానే ఈ దేశాల్లో ప్రజలు మరణిస్తారు. సంపన్న దేశాలకు, అదీ అన్ని విధాలుగా శాస్తస్రాంకేతిక విజ్ఞానం, వనరుల సంపద, సంపత్తి ఉన్న దేశాలు సైతం ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు తల్లడిల్లిపోతున్నాయంటే కారణం ఏమిటి? అమెరికాలోని హోస్టన్‌ను ముంచెత్తిన హార్వే తుపాను తీవ్రతను అగ్రరాజ్యం ముందే గుర్తించలేకపోయిందా? ఎప్పుడో వచ్చే సూర్యగ్రహణాన్ని సంవత్సరాల ముందే కనిపెట్టగలిగిన నాసా శాస్తవ్రేత్తలు ఈ ప్రకృతి ఉపద్రవాన్ని ముందస్తుగా కనిపెట్టి నివారణ, నిరోధక చర్యలతో జనాన్ని కాపాడలేకపోయారా? ఇవి సహజంగానే తలెత్తే ప్రశ్నలు. వీటికి అమెరికా నాయకత్వం ఇచ్చే సమాధానం ఏమిటి? దాదాపుగా పెను తుపాను కారణంగా తలెత్తిన వరద ముంపులో హోస్టన్ నిలువునా మునిగిపోయింది. మొత్తం వీధులన్నీ సెలయేళ్లే అయ్యాయి. ప్రాణాలరచేతిలో పెట్టుకుని జనం మనుగడ సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది.2005లో సంభవించిన విల్మా తుపాను తర్వాత అంతే తీవ్రతతో అమెరికాను కుమ్మేసింది హార్వే తుపాను. ఈ తుపాను గురించి ముందే తెలిసినప్పటికీ హోస్టన్ ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేక పోయారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దాదాపుగా ఆరున్నర లక్షల మంది ఈ వరదల కారణంగా వీధిపాలయ్యారు.ఎంత అగ్రరాజ్యమైనా ప్రకృతికి తలవంచాల్సిందే! దాని హెచ్చరికలు గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే!

చిత్రం.. హార్వీ పెను తుపానుకు సర్వం కోల్పోయి బిడ్డతో ఓ చెట్టునే ఆశ్రయించిన మహిళ