స్పాట్ లైట్

మైత్రి కొత్తపుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటినుంచీ కూడా భారత్-నేపాల్ మధ్య మైత్రీ బంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. రెండు దేశాల ప్రజల మధ్య కూడా అనాదిగా బలమైన సంబంధాలే ఉన్నాయి. విస్తృతమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు ఈ రెండు దేశాలనూ అనేక విషయాల్లో సన్నిహితం చేస్తున్నాయి. నేపాల్‌లో దీర్ఘకాలంపాటు రాచరికమే కొనసాగినా అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్యం ఉద్భవించింది. మరికొన్ని రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేపాల్ ప్రధాని దేవుబా భారత్‌ను సందర్శించడం రెండు దేశాల మధ్య రాజకీయంగా పెరుగుతున్న అనుబంధానికి నిదర్శనం. దాదాపు నాలుగు రోజులపాటు నేపాల్ ప్రధాని భారత్‌లో జరిపిన పర్యటన రాజకీయంగానే కాకుండా వ్యాపార వాణిజ్య పరంగా కూడా లోతైన సాన్నిహిత్యానికి బలమైన పునాదే వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తికావడం కూడా నేపాల్ ప్రధాని పర్యటన ప్రాధాన్యతను పెంచింది. రాచరికం ఎప్పుడైతే అంతమైందో అప్పటినుంచి నేపాల్‌లో రాజకీయంగా అస్థిర పరిస్థితులే ఉన్నాయని చెప్పాలి. ఈ ఐదేళ్ల కాలంలో స్థిరమైన ప్రభుత్వం అక్కడ లేకపోవడం వల్ల ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినాకూడా ప్రజలకు ఏ రకమైన మేలు చేకూరని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం అన్నది దేశాన్ని ప్రజాస్వామ్యపథంలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి, అలాగే పార్లమెంటరీ వ్యవస్థను ఏ విధంగా నిర్వహించుకోవాలన్నదానిపై లోతైన అవగాహన పెంపొందించుకోవడానికి నేపాల్‌కు ఎంతగానో దోహదం చేస్తుంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని నేపాల్‌కు భారత్ ఇచ్చిన హామీ ఆ దేశ ప్రజలకు సరికొత్త ధీమానే అందించింది. ఒకపక్క భారత్‌కు అనుకూలంగా ఉన్న దేశాలను తనవైపు తిప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్నా కూడా నేపాల్ మొదట్లో సందిగ్ధంలో పడినప్పటికీ అంతిమంగా భారత్‌తోనే తన మనుగడ అన్న నిర్ధారణకు వచ్చింది. అందుకు కారణం భారత్ నుంచి ఆర్థికంగానూ, వౌలిక సదుపాయాల పరంగానూ విస్తృత సహాయ సహకారాలు అందడమే. నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత నేపాలీ కాంగ్రెస్ పార్టీ భావసారూప్యం కలిగిన ఇతర పార్టీలు అధికారంలోకి వస్తేనే నేపాల్‌లో రాజకీయ సుస్థిరత ఉంటుందన్నది ఎంతైనా వాస్తవం. లేనిపక్షంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏ రకమైన అనిశ్చిత వాతావరణంలో నేపాల్ కొట్టుమిట్టాడుతోందో అనే పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. భారత్‌తో దాని సంబంధాలు అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంటాయి. మొదట్లో మావోయిస్టు నాయకుడు ప్రచండ అధికారంలోకి వచ్చిన్పటికీ ఆయన భారత్‌తో సంబంధాల విషయంలో డోలాయమాన ధోరణినే అవలంబించారు. అలాగే కె.పి.వోలీ కూడా ఇదే రకమైన వైఖరినే అనుసరించడం వల్ల అప్పట్లో కొంతమేర రెండు దేశాల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అనేక రకాలుగా నేపాల్‌ను తనవైపు తిప్పుకునేందుకు చైనా భారీగానే పెట్టుబడులు పెట్టింది. దీర్ఘకాల సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు భవిష్యత్తులో కూడా వాటికి ఏ రకమైన ఇబ్బందీ లేని విధంగా ఇరు దేశాలు రాజకీయంగా మరింత సన్నిహితం కావాలి. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజా సంబంధాల ప్రాతిపదికగానే ఇరు దేశాలు మరింత శక్తివంతం కావాలి. ఇందుకు దేవుబా పర్యటన మరింత ఊతానే్న ఇచ్చిందని భావించడానికి ఈ సందర్భంగా కుదిరిన అనేక ఒప్పందాలే తార్కాణం.