స్పాట్ లైట్

దిక్కులేని రోహింగ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మైన్మార్ రోహింగ్యాల అంశానికి లోతైన చరిత్రే ఉంది. ఎక్కడుండాలో తెలియని, తమకంటూ ఓ ప్రత్యేక ప్రాంతమంటూ లేని దయనీయ స్థితి రోహింగ్యా తెగది. ఎక్కుగా ముస్లింలతో కూడిన ఈ తెగ పశ్చిమ మైన్మార్ ప్రాంతమైన రఖీనాలోనే ప్రధానంగా నివసిస్తోంది. బర్మా భాషను కాకుండా ఈ తెగ ప్రజలు బెంగాలీ మాండలికంలోనే మాట్లాడుకుంటారు. తరతరాలుగా వీరు మైన్మార్‌లోనే ఉంటున్నప్పటికీ వీరందరినీ వలసదారులుగానే ప్రభుత్వం పరిగణిస్తోంది. వలసపాలకుల కాలంలోనే వీరంతా తమ దేశంలోకి వచ్చారన్నది మైన్మార్ వాదన. ఈ కారణం చేతే రోహింగ్యాలకు పూర్తి స్థాయి పౌరసత్వాన్ని కల్పించలేదు. ఇందుకో మెలిక పెట్టింది. 1823 నుంచి తమ పూర్వీకులు మైన్మార్‌లో ఉన్నట్టు ఆధారాలు చూపిస్తేనే రోహింగ్యాలకైనా, ఇతర తెగకు చెందినవారికైనా పౌరసత్వం ఇస్తామని తెలిపింది. పౌర సత్వానికి సంబంధించిన అంశాలను 1982నాటి బర్మా పౌరసత్వ చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి ఆధారాలు ఇవ్వని వారిని తమ దేశంలో ఉన్న విదేశీయులుగానే పరిగణిస్తామని తేల్చేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రోహింగ్యాలకు పౌరసత్వం లేదు కాబట్టి ప్రభుత్వ పరమైన సౌకర్యాలేవీ వీరికి లభించడం లేదు. పైగా వీరు తాము మెజార్టీ సంఖ్యలో ఉంటున్న రఖీనా రాష్ట్రం నుంచి బయటికి వెళ్లకుండా ఆంక్షలూ అమలు అవుతున్నాయి. రఖీనా రాష్ట్రంలో ఓ ప్రత్యేక తెగను ధ్వంసం చేయడానికి మైన్మార్ ప్రయత్నిస్తోందని ఐరాస స్వయంగా ఆగ్రహించింది. 70 దశకంలోనే అప్పటి సైనిక పాలకులు రోహింగ్యాలను వేలసంఖ్యలోనే బంగ్లాదేశ్‌కు తరిమేశారు. 2011లో రాజకీయ సంస్కరణలు తీసుకువచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సూకీ ఉద్యమ ఫలితంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డా వీరికి పౌరసత్వం మాత్రం లభించలేదు.