స్పాట్ లైట్

మైత్రి కొత్తపుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-జపాన్‌ల మధ్య సరికొత్త రీతిలో స్నేహ సంబంధాలు, వ్యూహాత్మక మైత్రీ బంధం పెంపొందేందుకు బలమైన పునాదులు పడుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య ఇప్పటికే ప్రభుత్వాధి నేతలుగానే కాకుండా వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న సమావేశానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక అనుబంధాన్ని బలోపేతం చేసుకున్నాయి. అదే విధంగా అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి కూడా భావసారూప్యతతో ముందుకు సాగుతున్నాయి. బుధవారం జరగనున్న వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ రెండు దేశాల ప్రాధాన్యతలకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న అనుబంధానికి అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకూ పదకొండు వార్షిక శిఖరాగ్ర సదస్సులను ఈ రెండు దేశాలూ నిర్వహించుకున్నాయి. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై ఒక స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సులను నిర్వహించుకున్నాయి. ప్రాంతీయ సహకారంతోపాటు అనేక అంతర్జాతీయ అంశాలపైన కూడా ఏకాభిప్రాయంతో ముందుకు వెళితే ద్వైపాక్షిక ప్రయోజనాలను సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక సమస్యలు ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు బరితెగింపు చర్యలకు పాల్పడడమే కాకుండా అంతర్జాతీయ ఆంక్షలను, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సమస్యల కుంపటిని రాజేస్తోంది. తాజాగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ద్వారా దిగ్భ్రాంతికర రీతిలో సరికొత్త సవాళ్లను విసిరింది. జపాన్ మీదుగా ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి మరింతగా పరిస్థితులను ఉద్రిక్తమయం చేసింది. అదే విధంగా దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతంపై హక్కులు పట్టు తమదేనంటూ చైనా వ్యవహరించడం కూడా అంతర్జాతీయ ఉద్రిక్తతలకు మరింతగా కారణమవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈ సముద్ర జలాలపై చైనా ఏకపక్ష ధోరణిని భారత్-జపాన్ దేశాలు గర్హిస్తున్నాయి. ఈ వివాదాన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నప్పటికీ చైనా ధోరణి మాత్రం ఇందుకు ప్రతికూలంగా మారుతోంది. ఇవన్నీ జపాన్, భారత్ తాజా శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చే అంశాలే కాకుండా వీటిని అధిగమించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన రెండు దేశాల ప్రధానులు ఒక అవగాహనకు రావడానికి ఆస్కారం ఇచ్చేవే అవుతాయి. ఇప్పటివరకూ 11 శిఖరాగ్ర సదస్సులను ఇరు దేశాలు నిర్వహించినప్పటికీ మోదీ, షింజో అబేల మధ్య ఈ సమావేశం జరగడం నాలుగోసారి. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, వౌలిక సదుపాయాలపై సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఇతరత్రా సన్నిహితమయ్యేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపైనా ఇరు దేశాల అధినేతలు దృష్టిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు వార్షిక సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ మోదీ, షింజోల మధ్య ఈ మూడేళ్ల కాలంలో పదిసార్లు వ్యక్తిగత సమావేశాలు జరిగాయి. తాజాగా జి-20 శిఖరాగ్ర సదస్సులో ఇరువురూ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా గత ఏడాది నవంబర్‌లో జపాన్ సందర్శించారు. అంతకుముందు ఏడాది డిసెంబర్‌లో షింజో అబే భారత్ వచ్చారు. ఈ విధంగా ప్రభుత్వాల మధ్యే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అధినేతలుగా కూడా మోదీ, షింజోల మధ్య వ్యక్తిగత అనుబంధం బలోపేతమైంది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు అన్ని కీలక రంగాల్లోనూ సహకారాన్ని, సమన్వయాన్ని పెంచుకోవాల్సిన అవసరం మరింతగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ ఒక కొలిక్కి తేవడంతోపాటు భవిష్యత్ సహకార బంధాన్ని కూడా ఈ తాజా సమావేశం బలమైన పునాదులు వేయగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.