శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జోరు వానలోనూ సిఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 21: జిల్లాలో రెండో రోజు శనివారం జోరువానలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగింది. శనివారం ఉదయం ఏడు గంటలకే ఆయన బసచేసిన నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలోని గెస్టుహౌస్‌కు అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. సిఎం ఉదయం 9.16 నిమిషాలకు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ సమావేశ మందిరానికి వచ్చారు. ఈ సమావేశ మందిరంలో ఆయన నెల్లూరు అభివృద్ధిపై దాతలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పది గంటలకు సమావేశ మందిరం నుండి బయటకువచ్చి మాగుంట లేఅవుట్, చిల్డ్రన్స్ పార్కు మీదుగా జాతీయ రహదారికి చేరుకొని సర్వేపల్లి వైపు పయనించారు. 10.45 గంటలకు సర్వేపల్లి చేరుకున్నారు. ఉదయం 11.10 జోసఫ్‌పేట గ్రామానికి చేరుకొని సంబంధిత వరద బాధితులతో మాట్లాడారు. సర్వేపల్లికి వెళ్లే దారి పొడవునా వందలాది మంది ప్రజలు గుంపులు గుంపులుగా అర్జీలతో కనిపించారు. నాయుడుపాళెం వద్ద ప్రజలు తమ కష్టాలను స్వయంగా చెప్పుకొనేందుకు రాగా పోలీసులు వారిని నెట్టివేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎదుటే పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇది చూసిన సిఎం తాను పరిస్థితులను స్వయంగా చూశానని, అన్నివిధాలుగా ఆదుకుంటానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. అక్కడ నుండి సర్వేపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్ కట్టపై స్వయంగా నడిచి పరిశీలించారు. పదిహేను నిమిషాలపాటు రిజర్వాయర్ పరిశీలించి సంబంధిత ఇరిగేషన్ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్వేపల్లి రిజర్వాయర్ ప్రమాదకర స్థితిలో ఉండటంతో గండి కొట్టారని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలో నష్టంపై సర్వే చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 8.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో పక్కా గృహాలు నిర్మిస్తామని, త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. నగరంలో పలు శివారు ప్రాంతాల్లో సిఎం పర్యటించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు జెసిబిని నడిపి పూడికతీత పనులు చేపట్టారు. అనంతరం దగ్గర ఉండి గచ్చు కాలువ పూడిక తీయించారు. ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించిన తరువాత నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చుదిద్దుతామన్నారు. పంట కాలవల ఆక్రమణల వలనే డ్రెయినేజీలోని నీళ్లు రోడ్లపై పారుతున్నాయన్నారు. ఆక్రమణలకు గురికావడం వల్లే నీళ్లు పోయే పరిస్థితి లేక ఇంత నష్టం జరిగిందన్నారు. వరద నుంచి కోలుకున్న తరువాత ఆక్రమణలు తొలగిస్తామన్నారు. రెండో రోజు చంద్రబాబునాయుడు కాన్ఫరెన్స్‌లు, అధికారులు, మంత్రులతో బిజీబిజీగా గడిపారు. వరద సహాయ చర్యలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై జిల్లాలోని 2,500 మంది అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పూర్తిగా అందేలా చూస్తానని ప్రజలకు సిఎం భరోసా ఇచ్చారు.

విపత్తులు ఎదుర్కొనేందుకు శాశ్వత చర్యలు
* కరవు రహిత రాష్ట్రంగా అభివృద్ధి
* 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు
* త్వరలో కృష్ణ, పెన్నా నది అనుసంధానానికి చర్యలు
* వరద బాధితులను ఆదుకుంటాం
వెంకటాచలం, నవంబర్ 21: రాష్ట్రంలో సంభవించే తుఫాన్, వరదలు వంటి విపత్తులు ఎదుర్కొనేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వం తనకు అవినీతి వారసత్వాన్ని అందిస్తే, ఆ అవినీతిని నిర్మూలించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. కొందరు నాయకులు తమ ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాము పట్టించుకోవటం లేదన్నారు. తమ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. వరద ముంపు ప్రాంతాల్లో తాను మరో రెండు రోజులు పర్యటిస్తాన్నానని తెలిపారు. పోర్టురోడ్డు చాలావరకు దెబ్బతిందని, మరమ్మతులు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జాతీయ రహదారి మరమ్మతులకు గురికావడంతో మరో రెండు రోజుల్లో రెండో రహదారిని మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా టెక్నికల్ ప్లానింగ్‌లో మార్పులు చేసి శాశ్వతంగా రహదారి నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాల్లో 8.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. తుఫాన్, వరద నష్టాన్ని సర్వే చేసేందుకు రాజధాని నుండి అధికారులు వస్తారని వెల్లడించారు. నెల్లూరు నగరంలో పంట కాలువలు, మురికికాలువలు అక్రమించడం వల్ల నగరం జలదిగ్బంధంలో చిక్కుకుందని, దీంతో వరద నీరు సర్వేపల్లి రిజర్వాయర్‌పై పడడంతో రిజర్వాయర్ ప్రమాదస్థాయికి చేరిందన్నారు. రిజర్వాయర్ పనులు సక్రమంగా జరగలేదని, దీనిపై విచారణ జరిపిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌కు చేసిన పనులు సక్రమంగా లేనందున ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రిజర్వాయర్‌ను పటిష్ఠంగా నిర్మించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కట్టడాలు పటిష్ఠంగా ఉంటాయని, అటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడాలు నిర్మించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం తాము నిర్మించే కట్టడాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తామని తెలిపారు. వరదలతో పక్కాగృహలు, గుడిసెలు నష్టపోయిన వారికి ప్రభుత్వం నుండి అర్థిక సహాయం అందుతుందని సిఎం భరోసా ఇచ్చారు. ఏడాదిలో అన్ని చెరువుల్లో నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. భారీ వర్షాలు కురిస్తే ముందు తీరప్రారంతాలు ఎక్కువగా నష్టపోతున్నాయన్నారు. భారీ వర్షాలకు తీర ప్రాంతాలు సమర్థవంతంగా ఎదుర్కొనేలా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. కరవు చూసి మనం భయపడకూడదని, అదే మనల్ని చూసి భయపడేలా చేయాలన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం చరిత్రాత్మకమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయిని తిక్కవరప్పాడు పంచాయతీలోని మల్లుగుంట, జోసఫ్‌పేట గ్రామస్థులు ఆపి హారతులు ఇచ్చి వారి సమస్యలను చంద్రబాబుకు మొర పెట్టుకున్నారు. వారు చెప్పిన సమస్యలపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.

జాతీయ రహదారిపై ప్రయాణికుల అవస్థలు
వెంకటాచలం, నవంబర్ 21: జాతీయ రహదారిపై శనివారం ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మనుబోలు వద్ద జాతీయ రహదారికి గండి పడిన విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి రహదారికి మరమ్మతులు చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. కాని మరమ్మతులు చేసిన ప్రదేశం శనివారం కొంత దెబ్బతింది. దీంతో వెంకటాచలం నుండి చెముడుగుంట వరకు జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. వాహనాల రాకపోకలు చాలా ఆలస్యం కావడంతో ప్రయాణికులకు, వాహనచోదకులకు భోజనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకుని రహదారికి శాశ్వతంగా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు.