ఉత్తరాయణం

శ్రీకాకుళం వాసుల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం పట్టణంలో పాత ఇళ్లు కూల్చేసి అపార్టుమెంట్లు, గ్రూప్ హౌసింగ్‌లు కట్టే ప్రక్రియలో చెత్త వ్యర్థ పదార్థాలను, బిల్డింగ్ డెబ్రిస్ రోడ్లపై పడేస్తున్నారు. అట్లే భవన నిర్మాణ సామగ్రి అయిన సిమెంట్, ఇసుక, కంకర, స్టీల్ రాడ్లను సైట్‌ముందే పడేస్తుండడం వలన వాహన చోదకులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొన్ని సందర్భాలలో నిర్మాణం పూర్తయిన ఏడాది వరకు కూడా వాటిని తొలగించడం లేదు. పట్టణంలో అసలే ఇరుకు రోడ్లు, ఈ చెత్త అంతా సగం రోడ్డు ఆక్రమించుకుంటుంటే మిగతా వారు రాకపోకలు ఎలా సాగించాలన్న ఇంగిత జ్ఞానం కూడా నిర్మాణదారులకు వుండడం లేదు. ఇక బోర్లు వేయడం, జెసిబిలలో ఇళ్లు కూల్చే బృహత్తర కార్యక్రమం రాత్రిళ్లు మాత్రమే చేస్తుండడం వలన చుట్టుపక్కల వారికి నిద్రాభంగం కలిగి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. ఈ చెత్తవలన కాల్వలన్నీ పూడుకుపోయి, ఆ మురుగు అంతా రోడ్లపై ప్రవహిస్తోం ది. స్వచ్ఛ్భారత్ అంటూ నినాదాలిచ్చే వారు వాటిని ఆచరణలో కొంతైనా చూపించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
మద్యం ఆదాయమే ముఖ్యమా?
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సారా వరదలై పారుతున్నది. అనేక ప్రాంతాల్లో గుడుంబా ఒక కుటీర పరిశ్రమగా తయారైంది. పెద్దఎత్తున సారా పొయ్యిలు మండుతున్నాయి. పాలకుల అసమర్ధత, అవినీతి, ఆశ్రీత పక్షపాతంతో సారా రక్కసి అదుపు తప్పిపోతున్నది. ఇప్పటి పరిస్థితుల్లో ఆదాయం కోల్పోయే స్థోమత ప్రభుత్వాలకు లేదని పెద్దలు చెబుతున్నారు. ఈ ఒక్క కారణంగానే బార్లు షాపులు పెంచి ఆదాయాన్ని పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. మధ్యంతరాదాయం మీదనే ఆశలు పెంచుకుని బడ్జెట్ రూపొందిస్తున్నారు. కానీ ఇందువల్ల జరుగుతున్న అనర్ధాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం. చీఫ్ లిక్కర్ తాగి లక్షలాది మంది నిరుపేదలు ఆస్పత్రి పాలవుతున్నారు. కొందరు చనిపోతున్నారు. మరికొందరు తాగి తాగి కృశించి, కృశించి మంచానికి పరిమితమై లైవలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే మద్యంవల్ల జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలకు అంతే లేకుండా పోతున్నది. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 15వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో అధిక శాతం మద్యం సేవించడంవల్లనే ప్రమాదాలకు కారణమనేది అధ్యయనాల్లో వెల్లడవుతున్నది. ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. ఒక్కసారి మనసుపెట్టి పరిశీలించాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ఇదేమి చోద్యం?
దిల్లీ పబ్లిక్ స్కూలు బ్రాంచికి అమరావతిలో శంకుస్థాపన చేశాడు సల్మాన్ ఖుర్షీద్. భారత సైనికుల తలలు నరికి పాక్ సైనికులు పట్టుకుపోయిన కొద్ది రోజులకే ఒక పాక్ ప్రముఖునికి బిర్యాని పార్టీయిచ్చిన మహానుభావుడీయన. యూపి ఎన్నికల సభలో బాట్లా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల ఫొటోలు చూసి సోనియా కన్నీరు పెట్టుకున్నారని ప్రచారం చేసి ఆమె ఆగ్రహానికి గురిఅయ్యాడు. అందరూ ఒకే విధమైన దేశభక్తిని ప్రదర్శించాలనడం సరికాదని ఘోషించిన వాడిని శంకుస్థాపనకు ఎంపిక చేయడమే విచిత్రం. ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్ యూనివర్సిటీల్లో కుంపట్లు రాజేశారు. ఆంధ్రలో మరో కుంపటి రాజేస్తున్నారా?- హితీక్ష, రమణయ్యపేట
అవినీతితో సామాన్యుల ఇబ్బందులు
అనేక సమస్యలతో నిండివున్న ప్రజాసమస్యలు ము ఖ్యంగా రెవిన్యూకు సంబంధించిన అపరిష్కృతమైన భూ వివాదాల గురించి ప్రభుత్వ శాఖలు చుట్టూ ప్రజలు ప్రదక్షణ చేయాల్సి వస్తున్నది. ఎన్నిసార్లు తిరిగినా పనులు కావు. పూర్తి స్థాయలో అవినీతిలో కూరుకుపోయఉన్న రెవెన్యూశాఖ వల్ల సామాన్యులు ఇబ్బందులు తప్పడం లేదు. సమస్య పరిష్కారం మాట అట్లా ఉంచి జటిలం కాకుండా ఉంటే చాలన్న పరిస్థితి నెలకొంది. అవినీతి నిర్మూలనపై అంతా మాట్లాడే వారే కాని, చేతలు శూన్యం.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
బయోమెట్రిక్ విధానం అవసరం
ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్ మిషన్లు పెట్టకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే పెట్టివుంటే కోట్ల రూపాయలు వృధా అయ్యేవి కావు. ఉపాధ్యాయుల దొంగ సెలవులు ఉండేవి కావు. మధ్యాహ్న భోజనంలో అవినీతికి చోటు ఉండేది కాదు. అనవసర ఉపాధ్యాయ నియామకాలు జరిగేవి కావు. తక్షణమే బయోమెట్రిక్ అమలుచేసి పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలి.
- చిట్టె ఆంజనేయులు, రాయలచెరువు