కృష్ణ

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట:మంత్రి కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఏప్రిల్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయని, గ్రామాల్లో వౌలిక వసతులు కల్పనకు కృషి జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గోపవరంలో రూ. 8లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను రూ. 18.75 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ గ్రామాభ్యుదయం బిజెపి ప్రభుత్వంలోని జరుగుతుందని, ప్రధాని మోదీ పంచాయితీ భవనాలకు రూ. 15 లక్షలు కేంద్ర నిధులు మంజూరు చేస్తున్నారని దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు అందిస్తుందన్నారు. అందరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు గృహాలు మంజూరు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. తాగునీటి పరిస్థితి ఆందోళనంగా ఉందని రెండు రోజుల్లో ఇరిగేషన్ అధికారులతో, మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పరిష్కారమార్గం చేస్తున్నామన్నారు. ఎంతోకాలంగా వివాదాస్పదంగా ఉన్న పల్లెవాడ 91వ రైల్వేగేటు సమస్యపై మంత్రి హామీ ఇచ్చారు. గతంలో రైల్వే అధికారులు చినరామవరం, పెదరామవరం వెళ్ళే రహదారిలో ఉన్న 91వ గేట్‌ను మూసివేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గేటును మూయించకుండా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని ఆటపాకలో కొలువై ఉన్న శ్రీ కనకలింగేశ్వరస్వామి వారి సన్నిధిలో నిర్మించనున్న 30 అడుగుల మహారాజగోపురానికి 27 బుధవారం ఉదయం మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కైకలూరు జెడ్పీటిసి బొమ్మన బోయిన విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
నూజివీడు, ఏప్రిల్ 25:నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు భూముల అవసరం ఉందని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వ భూములు కుంటి సాకులతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని నూజివీడు సబ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ హెచ్చరించారు. భూముల లభ్యత ఉంటే ఎన్నో పరిశ్రమలు, పార్కులు వస్తాయని, తద్వారా ఎంతో మంది ఉపాధి కలుగుతుందని చెప్పారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులు ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని వత్తిడిలు వచ్చినప్పటకీ ప్రభుత్వ భూములను పరిరక్షించటం బాధ్యతని అన్నారు. ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో కొంత మంది భూస్వాములు భూదాన ట్రస్టుకు భూములు దానం చేశారని, అయితే ఆ భూములు భూస్వాముల ఆధీనంలో ఉన్నాయని, వాటిలో ప్రైవేటు వ్యక్తులు శ్రీగంధం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈవిషయంపై లిబరేషన్ నాయకులు ఆందోళన చేస్తున్న విషయాన్ని విలేఖరులు సబ్ కలెక్టర్ లక్ష్మీశ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై సబ్ కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ చెక్కపల్లి గ్రామంలోని భూదాన ట్రస్టు భూములపై ప్రాధమిక సమాచారం తీసుకుంటున్నానని, న్యాయ పరంగా ఆ భూముల్లో పేదలు ఉంటే వారికి అందజేస్తామని, లేకుంటే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు భూ బ్యాంక్‌పై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు, ఇతర పార్కులకు ఎంతో భూమి అవసరం ఉందని, వీటి ఏర్పాటుకు ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. వీటికి భూములు ఇవ్వాలంటే ప్రవేటు భూములు సేకరించి ఇవ్వటంతో ఎంతో వ్యయంతో పాటు కష్టంతో కూడుకున్న విషయమని, ప్రభుత్వ భూముల లభ్యతగా ఉంటే వాటిని కెటాయించవచ్చని ఆయన వివరించారు.