శ్రీకాకుళం

మహాసంకల్పం.. మహోన్నతంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 6: నవ నిర్మాణ దీక్షలో భాగంగా చివరిరోజు బుధవారం మహాసంకల్పంను మహోన్నతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. మహాసంకల్పం నిర్వహణపైకలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ను ముఖ్యమంత్రి నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో మహాసంకల్పం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల జలవనరులు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖ లు, పరిశ్రమలు, నీరు చెట్టు, ఆరోగ్యం తదితర విషయాలను వివరించాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సూచికలను ప్రజలకు తెలియజేయాలన్నారు. శాస్ర్తియ దృక్పథంతో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మహిళలు, యువత భాగస్వామ్యం వహించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్వో బి.కృష్ణ్భారతి, డి.ఆర్.డి.ఎ.ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.తనుజారాణీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు ఆర్.రవీంధ్రనాథ్, సెట్‌శ్రీ సి.ఇ.వో. మూర్తి, జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు రవీంధ్రనాథ్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు వై.శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.