శ్రీకాకుళం

ప్రజా సాధికారత సర్వే విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 25: ప్రజాసాధికారత సర్వే విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ పేర్కొన్నారు. స్మార్ట్‌పల్స్ సర్వేపై శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేను కేవలం ట్యాబ్స్ ద్వారానే జరగాలని ఆదేశించారు. సర్వేలో ఆధార్ నెంబర్ ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు ఆధార్ లేనప్పుడు యుఐడి ఇవ్వాలన్నారు. ఎన్యుమరేటర్లకు మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, ప్రాక్టికల్ ఎక్సర్‌సైజ్ చేయించాలన్నారు. మొత్తం సర్వేను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. జెసిలు, జిల్లా రెవెన్యూ అధికారులు సమన్వయంతో మోనటరింగ్ చేయాలని ఆదేశించారు. వందమందికి జిల్లాస్థాయిలో మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్‌లు, ఎంపిడివోలను ఇంచార్జ్ అధికారులుగా నియమించాలన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ ప్రజాసాధికారత సర్వేనిమిత్తం జిల్లాలో 16 బ్లాక్‌లు ఏర్పాటు చేశామని, 160మంది సూపర్‌వైజర్లను నియమించినట్టు తెలిపారు. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈసమావేశంలో జెసి వివేక్‌యాదవ్, డి ఐవో గంగాధర్, పాలకొండ, టెక్కలి ఆర్డీవో రెడ్డి గున్నయ్య, వెంకటేశ్వరరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర
అభివృద్ధికి కృషి
ఎచ్చెర్ల, జూన్ 25: రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు స్పష్టంచేశారు. శనివారం కుప్పిలి ఉన్నత పాఠశాల ఆవరణంలో నూతనంగా నిర్మించిన అధనపు పాఠశాల భవనాలను ఎమ్మెల్యే కళా వెంకటరావు, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కళా మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల అభివృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారుల అధునాతన నిర్మాణాలు వంటి కార్యక్రమాలను విశాఖ కేంద్రంగా చేపట్టాలని సీ ఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. రుణమాఫీ, డ్వాక్రాసంఘాలకు అర్థిక చేకూర్పు వంటి హామీలు శతశాతం అమలు చేయడం జరుగుతుందన్నారు. నాడు చంద్రబాబు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ అర్హులందరికీ అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్నామన్నారు. మరో మూడేళ్లలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మెరుగైన పాలన అందించి పేదరికలేని సమాజ రూపకల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. విద్యుద్ధీకరణలో గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలతో నవ్యాంధ్రప్రదేశ్ పోటీ పడటం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తుందన్నారు. జెడ్పి చైర్ పర్సన్ ధనలక్ష్మీ మాట్లాడుతూ అర్హులందరికీ అభివృద్ధిసంక్షేమకార్యక్రమాలు రూ.1000 పింఛన్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ పథకంలో 74మంది లబ్ధిపొందిన రైతులకు రుణ ఉపశమన పత్రాలను అందజేశారు. పరిశీలకులు వేణుగోపాలనాయుడు, జిల్లా పార్టీ పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, తహశీల్దార్ బందరు వెంకటరావు, ఎంపిడివో పంచాది రాధ, ఏడి రవికుమార్, ఏవో ఉషారాణి, డి ఇ సూర్యనారాయణ, ఇవో పి ఆర్ డి మోహన్, సర్పంచ్‌లు అలుపున భారతీ నాగిరెడ్డి, పొందూరు భీమారావు ఏ.శ్రీనివాసరావు, వావిలపల్లి రామకృష్ణ, ఏ భువనేశ్వరరావు, పైడి నూకరాజు, పంచిరెడ్డి సత్యన్నారాయణ, బోర వెంకటరావు, మూగి కొర్లయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి రమణారెడ్డి ఎమ్మెల్యే, జెడ్పి చైర పర్సన్, పలువురు పార్టీ నేతలను ఘనంగా సత్కరించారు.
‘్థర్మల్’ ప్లాంట్లపై బాబు రోజుకో మాట!
శ్రీకాకుళం(టౌన్), జూన్ 25: గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉండగా, సోంపేట, కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్లను రద్దుచేస్తానని ప్రకటించి, నేడు ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా వాటి పనులు ప్రారంభిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ రాష్ట్ర సభ్యుడు తమ్మినేని సీతారాం టిడిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం ఈ మేరకు స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన
మాట్లాడారు. సోంపేట, కాకరాపల్లి ఉద్యమాల్లో పోలీసు కాల్పులు, లాఠీచార్జీలకు కొంతమంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బాబు వారి కుటుంబ సభ్యులను పరామర్శించే నేపథ్యంలో అక్కడకు విచ్చేసి తాను అధికారంలోకి వస్తే వెంటనే వాటిని రద్దుచేస్తానని ప్రకటించిన విషయం గుర్తుచేసారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రజల్లో మోసకారిగా ముద్రపడ్డారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, కళింగపట్నంలో పోర్టు, భావనపాడులో హార్బర్, జిల్లాకు గిరిజన వర్శిటీ హామీలు ఏమయ్యాయన్నారు. వీటిపై జిల్లాకు చెందిన మంత్రి సైతం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన సందర్భంగా శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాకు అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నప్పటికీ, వాటిని ఆచరించడంలో బాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జిల్లా అధికారులు, పాలకులు ఇసుక, పిక్క వ్యాపారంలో మునిగిపోయారని, ప్రజల సమస్యలు వారికి పట్టడం లేదని ఎద్దేవా చేసారు. సమావేశంలో సనపల నారాయణరావు, రొక్కం సూర్యప్రకాశరావు, శిమ్మ వెంకటరావు, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటుదాం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూన్ 25: జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నామని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. ఇందుకు ప్రతీ ఒక్కరినీ సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ కమిటీ సమావేశం శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.50 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా నిర్ణయించామని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, డుమాపీడి, డివిజనల్ అటవీ అధికారులు ఉప సంఘంగా ఏర్పడి ఏయే ప్రాంతాల్లో ఏయే విధంగా మొక్కలు నాటాలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. బలరాంపురంలో ఏర్పాటు చేయనున్న సిటీఫారెస్టులో విభిన్న రకాలైన మొక్కలను నాటాలని అంతే కాకుండా భవిష్యత్‌లో వాకింగ్ ట్రాక్, తదితర ఏర్పాట్లపై మాస్టర్ ప్లాన్ రూపొందించి అందుకు అనుగుణంగా ఏ ప్రాంతాల్లో మొక్కలు నాటాలో ప్రణాళికలో పొందుపరచాలన్నారు. సిటీ ఫారెస్ట్ ఏర్పాటులో భాగంగా ముందుగా 50 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. విభిన్న రకాల మొక్కలను వేయుటకు స్థలాలను కేటాయించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటి వాటి బాధ్యతలను ఆలయ కమిటి, హెచ్ ఎంలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈసంస్థలలో మొక్కలు నాటేందుకు ఒక్కో రోజును కేటాయించాలని వాటి షెడ్యూల్‌ను తయారు చేయాలని ఆయన సూచించారు. నాటిన మొక్కలు శతశాతం బతకాలన్నారు. జూలై 1నుండి మొక్కలు నాటేకార్యక్రమం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో ఫల, పుష్ప మొక్కలను వేయాలని ఇతర ప్రాంతాల్లో వేప, వేగు, నేరేడు వంటి మొక్కలు నాటాలన్నారు. భవిష్యత్‌లో జిల్లాలో సేంద్రీయ ఎరువుల సేద్యం పెద్ద ఎత్తున చేపట్టిన సేంద్రీయ సేద్యంలో ప్రధానమైన జిల్లాగా ఏర్పడుటకు వేప మొక్కల పెంపకం ఆవశ్యమన్నారు. 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో గాలి, అలలను ఆపుటకు శక్తిగా పనికివచ్చే మొక్కలను నాటాలన్నారు. జిల్లాలోనాటే 1.50కోట్ల మొక్కల్లో అటవీశాఖ 22.60 లక్షల మొక్కలు, ఉపాధి హామీ జాబ్‌కార్డులద్వారా 25లక్షలు మిగిలిన మొక్కలను సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో నాటనున్నట్టు పేర్కొన్నారు. ఆలయాలలో భక్తులను మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యులు చేయాలని తద్వారా మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. జిల్లాలో అన్ని కొండలు, గుట్టలు పూర్తిగా పచ్చదనంతో నిండాలన్నారు.
* అటవీశాఖ భూముల ఆక్రమణలు తొలగించాలి:
అటవీశాఖ భూములలో ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఆక్రమణలను సంబంధించి 124 కేసులు ఉన్నాయని అటవీశాఖాధికారి సిహెచ్ శాంతిస్వరూప్ తెలియజేయగా వాటిపై స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా ఉన్నవాటిని తక్షణం తొలగించాలన్నారు. డి పట్టాలను పంపిణీ చేసి ఉంటే వాటిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలన్నారు. వి ఎస్ ఎస్ లకు గతంలో అడవుల పెంపకానికి కేటాయించిన భూమిని రద్దు చేయాలని కమిటీ తీర్మాణించింది. గిరిజన ప్రాంతంలో నిర్మించాల్సిన రహదారుల కోసం వచ్చిన ప్రతిపాధనలు పరిశీలించాలన్నారు. అటవీ అధికారులు సిబ్బంది పూర్తిగా తమ విధుల పట్ల పునరంకితమై అడవులను రక్షించాలన్నారు. ఈసందర్భంగా వనం-మనం కార్యక్రమంపై అటవీశాఖ రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు. పుస్తకంలో జిల్లాలో నర్సరీలు, అక్కడ లభ్యంగా ఉన్న మొక్కల వివరాలు పొందుపరిచారు. ఈ సమావేశంలో జెసి వివేక్‌యాదవ్, డివిజనల్ అటవీ అధికారి లోహితాస్యుడు, ఐ టి డి ఏ పివో జె.వెంకటరావు, డుమా పీడి ఆర్.కూర్మనాధ్, పశు సంవర్థక శాఖ జెడి వెంకటేశ్వర్లు, జిల్లా సహకారాధికారి శ్రీహరిరావు, ఉద్యానవన శాఖ ఏ డి ఎం ఏ రహీమ్, మార్కెటింగ్ శాఖ ఏడి వై.వి శ్యామ్‌కుమార్, వ్యవసాయ ఏడి నాగభూషనరావు, ఎండోమెంట్ సహాయ కమీషనర్ వి.శ్యామలాదేవి. అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.

ఎసిబి దూకుడు!
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు వరకు ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీస్‌లుగా రూపొందించడం, ప్రధాన శాఖల్లో సంస్కరణలు చేపట్టి మెరుగైన ప్రభుత్వ సేవలు పౌరులకు అందేలా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. పారదర్శకంగా ఆన్‌లైన్ సేవలు సిబ్బంది నుండి అధికారుల వరకు డిజిటల్ సిగ్నేచర్లకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అవినీతిని అంతమొందించేందుకు ఇక్కడ ఎసిబి అధికారులు దూకుడు పెంచారు. అవినీతికి పాల్పడి లంచం సొమ్ముకు ఆశపడిన పలువురు అధికారులను వలపన్ని పట్టుకోవడంతో ఉద్యోగ వర్గాలు హడలేత్తిపోతున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, పోలీస్, పంచాయతీ రాజ్, ఇచ్ఛాపురం ఉమ్మడి రవాణా కేంద్రం లక్ష్యాలుగా ఎసిబి అధికారులు దాడులు ముమ్మరం చేసి పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గత నెల రోజులుగా ఎసిబి అధికారులు అనేక మంది ఉద్యోగులను వలపన్ని పట్టుకున్నారు.
సంతకవిటి మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ మరణ ధ్రువపత్రానికి లంచం అడిగిన గోపి అనే ఉద్యోగి మే 31న దొరికిపోయాడు. అలాగే ఆమదాలవలస మున్సిపల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జి.రవి రూ.50వేలు లంచం డిమాండ్ చేసి ఈనెల 11న ఎసిబి అధికారులకు చిక్కాడు. ఇక శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన పోలీస్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌గా పొందూరు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ కొట్లాట కేసులో నిందితులను తప్పిస్తామని రూ.3వేలు లంచం తీసుకుంటుండగా చిలకపాలెం కూడలిలో ఈనెల 24న అధికారులకు చిక్కిన విషయం ఆ శాఖలో సంచలనానికి దారి తీసింది.
ఈ ఘటన ఉద్యోగులు మరువక ముందే 25న నరసన్నపేట మేజర్ పంచాయతీలో భవన నిర్మాణ అనుమతులకు లంచం డిమాండ్ చేసి ఇవో ఉమామహేశ్వరరావు, ఒప్పంద ఉద్యోగి శేఖర్‌లు అవినీతి నిరోధక శాఖాధికారులకు దొరికిపోయారు.
ఇదిలా ఉండగా ఇచ్ఛాపురం ఉమ్మడి రవాణా కేంద్రంలో తరచూ అవినీతి నిరోధక శాఖాధికారులు మెరుపుదాడులు నిర్వహించడం, సిబ్బంది పట్టుబడటం పరిపాటే. డిఎస్పీ రంగరాజు వ్యూహాత్మకంగా అవినీతి నిర్మూలన చేపట్టే లక్ష్యంతో ముందుకు సాగుతూ ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచేందుకు కృషిచేయడం పట్ల సామాన్యపౌరుల నుండి హర్షేతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి.

పేద ప్రజలకు అండగా ఉంటా
పోలాకి, జూన్ 25: మండలం తోటాడ గ్రామం వద్ద నిర్మించబోవు ధర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా పరిసర ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బి.సి. సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ స్పష్టం చేశారు. శనివారం తోటాడ గ్రామం వద్ద ధర్మల్ ప్లాంటు నిర్మాణం కోసం సర్వే కొనసాగిస్తున్నారని, అందోళన ఎంత తీవ్రతరం చేస్తున్నా సర్వేలను నిలిపివేయడం లేదని నిర్వాసిత గ్రామస్థులు మబగాంలోని ధర్మాన క్రిష్ణదాస్ ఇంటి వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా క్రిష్ణదాస్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా పోలాకి మండలంలో ధర్మల్ ప్లాంటు నిర్మాణానికి స్థలం దొరికిందా.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రజలకు నష్టం కలుగకుండా సర్వ ప్రయోజనాలకు అనుగుణంగా మరో పరిశ్రమ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నష్టం కలుగకుండా ఆదుకోవాల్సిందిపోయి చేటు తెచ్చే విధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ధర్మల్ ప్లాంటు పేరిట పోలాకి ప్రాంతాన్ని బుగ్గిపాలు చేయడానికి సిద్ధపడితే రాజకీయాలకు అతీతంగా వెనుకాడనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం జపాన్ సంస్థతో చేతులు కలిపి ఈ ప్రాంతాన్ని నాశనం చేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. సమస్యను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులతో చర్చించానన్నారు. కరిమి రాజేశ్వరరావు, పాగోటి అప్పారావు, సంపతి రామన్న, ముద్దాడ భైరాగినాయుడు గ్రామస్తులు ఉన్నారు.

రుణ ఉపశమనాన్ని సద్వినియోగం చేసుకోండి
గార, జూన్ 25: ప్రభుత్వం రుణ మాఫీ హామీని అంచెలంచెలుగా అమలుపరుస్తోందని, రెండో విడతగా ఉపశమన పత్రాలు ద్వారా రైతులను రుణ విముక్తులను గావించే దిశగా విస్తృత చర్యలు చేపట్టిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు స్పష్టం చేశారు. రెండో విడత రుణమాఫీకి సంబంధించి పంచాయతీ స్థాయిలో ప్రభుత్వం గడచిన రెండు రోజులుగా రుణ ఉపశమన పత్రాలను సంబంధిత రైతులకు అందజేస్తుంది. శనివారం తూలుగు, కొర్ని, కొర్లాం పంచాయతీల్లో మండల స్థాయి అధికారులు మూడు బృందాలుగా వీడి రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండ భాస్కరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఉపశమన పత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పరిధి పెరిగిన కారణంగా రుణ సహాయం పొందే మొత్తాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఇప్పటికి బ్యాంకుల్లో ఉన్న రుణం నుండి విముక్తి పొంది తమ రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని రైతులకు ఈ సందర్భంగా సూచించారు. మండల వ్యవసాయాధికారి బి.వి. తిరుమలరావు, ఎం.పి.డి.ఓ. ఆర్.స్వరూపరాణి, తహశీల్దారు సింహాచలంలు మూడు బృందాలుగా రుణ ఉపశమన పత్రాలు పంపిణీ గావిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో స్తానిక సర్పంచులు కొయ్యాన జగదీష్, ఆరంగి దశరథరావు, పీస శ్రీహరిరావు, ఎం.పి.టి.సి. ప్రగఢ అమ్మన్నాయుడులతో పాటు రైతులు ఉన్నారు.
చంద్రబాబు రైతు పక్షపాతి
* ప్రభుత్వ విప్ రవికుమార్
పొందూరు, జూన్ 25: అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేయింబవళ్లు శ్రమిస్తూ రైతు పక్షపాతిగా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆయన మండలంలోని కనిమెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న నీటి పథకాలు పునరుద్ధరించి తాగు, సాగును పుష్కలంగా అందించే కార్యక్రమాలు చేపట్టారన్నారు. కాలువలు, గెడ్డలు, వాగులు, వంకలు వెడల్పు చేసి ఎగువ ప్రాంతాల్లో ఉన్న భూములకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని దాతను ఆదుకునేందుకు ఈ ఉపశమన పత్రాలను ఒక సూచికంగా నిలుస్తాయన్నారు. అనంతరం ఇల్లయ్యగారిపేట గ్రామంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. పిఏసిఎస్ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, దేశం అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, జెడ్‌పిటిసి శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలకు రూ. 2 కోట్ల నిధులు
నరసన్నపేట, జూన్ 25: మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భారీ మొత్తంలో రూఫా నిధులు మంజూరు అయ్యాయని కళాశాల ప్రిన్స్‌పాల్ కణితి శ్రీరాములు తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇటీవలి నాక్ బృందం పర్యటించిందని, స్థానిక కళాశాలకు డి గ్రేడ్ ప్రకటించిందన్నారు. ఈ దిశగానే భవనాలు నిర్మాణాలకు, మరమ్మతులకు అత్యాధునికి ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లకు రూ. 2కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. మొదటి విడతగా రూ. కోటి నిధులు విడుదల అయ్యాయని, అభివృద్ధి పనులకు ఎస్.సి. కార్పొరేషన్ ద్వారా పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. అయితే, డిగ్రీ కళాశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ కళాశాలలను పటిష్ఠపరచాలి
శ్రీకాకుళం(రూరల్), జూన్ 15: విద్యా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు దీటుగా పటిష్ఠ పరిచాలని ఏబి విపి నగర సంఘటన కార్యదర్శి టి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టన్రాయకత్వం పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో శనివారం జూనియర్ కళాశాలల బంద్ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల్లో అక్రమంగా నడుపుతున్న వసతిగృహాలపై టాస్క్‌పోర్సు దాడుల చేయాలని కోరారు. అదే విధంగా కొన్ని కళాశాలల్లో వౌలిక సదుపాయాలు, బెంచీలు, కుర్చీలు, తరగతి గదులు లేకుండా అడ్డగోలుగా అడ్మిషన్లు స్వీకరిస్తూ విద్యా విదానాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని అటువంటి కళాశాలలను గుర్తించి తక్షణమే మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరారు. ఈసందర్భంగా కళాశాలలు బంద్ చేసిన చోటే పర్యటించారు. సిటీ ఇంచార్జ్ సంతోష్, నగర కార్యదర్శి ఎర్రన్నాయుడు, సభ్యులు సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఉపయోగపడే పరిశోధనలు అవసరం: కలెక్టర్
ఎచ్చెర్ల, జూన్ 25: విశ్వవిద్యాలయాలు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు ప్రోత్సహించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సూచించారు. శనివారం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో డిగ్రీ, పీ.జి సర్ట్ఫికేట్‌లు అందించే సంస్థలుగా విశ్వవిద్యాలయాలు తయారయ్యాయన్నారు. దీనికి భిన్నంగా వర్శిటీల్లో నాణ్యమైన విద్యా సంస్థలుగా రూపొందించేందుకు అధ్యాపకులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. వర్శిటీల్లో చదువులు సాగించిన 50శాతం మంది విద్యార్థులు సమాజానికి ఉపయోగపడటం లేదని పేర్కొన్నారు. దేశ తొలి విద్యాశాఖామంత్రి వౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ ఐ ఐ టి, వర్శిటీల ఏర్పాటుకు కృషి చేశారని గుర్తుచేశారు. ఇటువంటివారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేసే విద్యార్థులను తయారుచేసేందుకు అధ్యాపక బృందం మరింత అంకిత భావంతో పనిచేయాలన్నారు. 5కోట్ల జనాభా ఉన్న కొరియాలో 200విశ్వవిద్యాలయాలు ఉన్నాయన్నారు. ఆ దేశంలో 8వ ఏట వరకు ప్రాథమిక విద్యలో చేర్పించరని తెలిపారు. 30 ఏళ్లకు పీ.జి పూర్తవుతుందన్నారు.