శ్రీకాకుళం

ప్రజల వద్దకు పాలన టిడిపికే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, డిసెంబర్ 12: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని జిల్లా ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం పట్టణంలోగల 20వ వార్డువెంగలరావు కాలనీలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఎన్నో సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయని వాటిని జన్మభూమి, మీ ఇంటికి మీ భూమి వంటి కార్యక్రమాల ద్వారా దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. కలెక్టర్ నుండి అటెండర్ వరకు ప్రజల
వద్దకు రప్పించి జవాబుదారుగా ఉండాలని తెలుగుదేశంపార్టీ ఆదేశించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, వార్డు కౌన్సిలర్ రెడ్డి గౌరి, దేశం నాయకులు తమ్మినేని విద్యాసాగర్, రెడ్డి రాంబాబు, కొండబాబు, తంగి గుర్రయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు
పౌష్టికాహారం అందించాలి
బలగ, డిసెంబర్ 12: వివిధ పోటీల్లో పాల్గొంటున్న నేటి క్రీడాకారుల్లో దేహదారుఢ్యం కనిపించడం లేదని కలెక్టర్ లక్ష్మీనృసింహం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా అధికారులు పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆదివారం రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ జిల్లాస్థాయి గ్రామీణ క్రీడల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, రాష్ట్ర, జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయిలో సత్తాచాటి జిల్లా కీర్తిప్రతిష్ఠలు పెంచాలని కోరారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. జిల్లాలో పది నియోజకవర్గాల్లో చెందిన 14 నుంచి 16 ఏళ్లలోపు గల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల్లో పాల్గొంటున్న బాలబాలికలకు కాలికి చెప్పులు లేకపోవడం గమనించిన కలెక్టర్ పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న క్రీడాకారులకు ఒక కిట్‌ను అందిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన దస్త్రాన్ని తయారు చేసి నివేదికలు అందించాలని డి ఎస్.డివోను ఆదేశించారు. ఈ సందర్భంగా బాలబాలికలతో క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి పి.సుందరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బహుమతులు అందజేసిన ఎంపి
సాయంత్రం జరిగిన బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి బహుమతుల అందజేశారు. శనివారం జరిగిన వాలీబాల్, ఖోఖో జిల్లాస్థాయి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, డిఎస్‌డివో శ్రీనివాస్‌కుమార్, పి.సుందరరావు తదితరులు పాల్గొన్నారు.