శ్రీకాకుళం

చట్టాల అమలులో నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 5: చట్టాల అమలులో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తగదని విశాఖ రేంజ్ డిఐజి ఎన్.శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ(పివోఎ) యాక్ట్ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం ద్వారా లభించే సదుపాయాల కొరకు పోలీసులు చేయాల్సిన విధులను ఆయన వివరించారు. సదరు యాక్టుల్లో పొందుపరచిన అంశాలను ఎవరు ఉల్లంఘించినా తీసుకునే చర్యలగూర్చి వివరించారు. జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులు ఎస్సీ, ఎస్టీ చట్టంపై పూర్తి అవగాహన చేసుకొని చట్టం అమలులో తీసుకోబోవు చర్యలు, బాధితులకు న్యాయం చేకూరేందుకు వ్యవహరించాల్సిన విధివిధానాలు గుర్తుచేసారు. అలాగే కులం పేరుతో దూసిస్తేనే కేసు నమోదు చేయడం అన్న విధానాన్ని విడనాడి, బాధితులు ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలపైన కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఓయస్‌డి కె.తిరుమలరావు, డిఎస్పీలు కె.్భర్గవరావు నాయుడు, సిహెచ్.ఆదినారాయణ, సిహెచ్.పెంటారావు, పి.శ్రీనివాసరావు, టి.మోహనరావు, సిహెచ్.వివేకానంద, సిఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై శ్రద్ధ వహించాలి
* శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ రాణి
పాతశ్రీకాకుళం, జూలై 5: శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు పరిధిలోనున్న అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై కార్యకర్తలు శ్రద్ధ వహించాలని శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం. ఎన్.రాణి కోరారు. కేంద్రంలోని సిడిపిఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై అలసత్వం వహించకుండా ప్రత్యేకశ్రద్ధతో నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలోని రికార్డులలో ఎప్పటికప్పుడు ప్రతీఅంశాన్నీ నమోదు చేయాలన్నారు.