శ్రీకాకుళం

వైద్యుల నిర్లక్ష్య ఫలితం... పల్లెల్లో సంచి వైద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 23: జిల్లాలో వైద్యం అందని ద్రాక్షగా మారింది. మారుమూల గిరిజన ప్రాంతాలైతే మరీ నిర్లక్ష్యం. కనీసం ప్రశ్నిస్తామంటే ప్రజాప్రతినిధులను సమీక్షలకు పిలవరు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ సంచివైద్యంపై ఆధారపడి కుటుంబ నియంత్రణ చేయించుకుంటున్నారంటే నమ్ముతారా? ఎపుడు మీరు మారుతారు అంటూ పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి తనదైన రీతిలో వైద్యాధికారుల సమీక్షా సమావేశంలో మండిపడ్డారు. మధ్యలో సర్దిచెప్పబోతున్న కలెక్టర్‌ను సైతం మీరు ఊరుకోండి, వైద్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడ్డారు. శనివారం ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ముందుగా మాట్లాడుతూ పిహెచ్‌సిల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠవేశాయి. జ్వరాలు, అతిసారంతో మనుషులు మృత్యువాత పడుతున్నారు. అయినా ప్రజల్లో వైద్యాధికారులు చైతన్యం పెంచలేకపోతున్నారు. ఏంటీ పరిస్థితి? భామిని మండలంలో అయితే ఇప్పటికీ అక్కడి వారికి సంచి వైద్యమే గతి అంటే నమ్ముతారా? ఎపుడూ వ్యాధుల బారిన పడుతున్న పాలవలస, హన్మకొండ వంటి ప్రాంతాల్లో వ్యాధి నిర్థారణ పరీక్షలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు. వేలకు వేల రూపాయలు చెల్లించి ఏర్పాటు చేసిన వ్యాధినిర్ధారణ కేంద్రాలను ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. బిటివాడలో అయితే అత్యవసర మందులు అందివ్వలేని పరిస్థితి. ఎన్నడూ లేనిది ఎందుకు ఇపుడు ఇలా జరుగుతుందో అర్థం కావడంలేదు అంటూ తన సహజసిద్ధమైన రీతిలో వైద్యాధికారులను నిలదీశారు.
గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు లేని పరిస్థితి నెలకొందని ఆమె మండిపడ్డారు. ఆమెను సముదాయించడానికి కలెక్టర్ చొరవతీసుకొని ఈ-ఔషధి పెట్టాక స్థాయిపెరిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరైన సమయంలో మందులు రాకపోవడం నిజమే అంటూ అంగీకరించారు. అయితే, దీనిపై తాను ప్రభుత్వానికి లేఖ రాశానని, త్వరలోనే సమస్య పరిష్కారం కాగలదని భరోసానిస్తూ, అత్యవసర సమయంలో మారుమూల గ్రామాలకు వెళ్లడానికి ఎమ్మెల్యేగా మీరు రోడ్లు, కనెక్టివిటీ వంటివి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కళావతి, గ్రామాల్లో ఇంటింటికి మేము వెళ్తుంటే వారితో చీవాట్లు తినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎ.హేమంత్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు డయేరియా, ఫ్లూ జ్వరాలు వంటివి రాకుండా అత్యంత ఆధునిక వాక్సినేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందుగా పిల్లలకు తప్పకుండా మూడు డోసుల మందు వేయించాలని తాము సూచించామన్నారు. ఎందుకంటే డోసు ఎక్కువైనా పర్వాలేదని, ఒకవేళ డోసు తగ్గితే అది పనిచేయకపోవడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ దృష్ట్యా సంభవించే వ్యాధులున్నప్పుడు వైద్యులు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. మెళియాపుట్టిలో 4 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ ఒక్క వైద్యుడు లేకపోవడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అప్పటికప్పుడు తనకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారని చెప్పారు. వైద్యులు తమ పనితీరు పట్ల కమిట్‌మెంటు కలిగివుండాలని, ఒకరు చెబితే వైద్యం చేయడం అన్నది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అలాగే ఆయా పిహెచ్‌సిల పరిధిలోని వైద్యులు ఈ ఔషధి, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, మిడాల్ వ్యాధి నిర్థారణ పరీక్షలు, 104 సర్వీసు వంటివి ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయి అన్నది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు. ఇంచార్జి డిఎంహెచ్‌వో డాక్టర్ మెండ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, డిసిహెచ్‌యస్ డాక్టర్ సూర్యారావు, జెడ్పీ సీఈవో బి.నగేష్, రిమ్స్ సూపరింటెండెంటు డాక్టర్ సునీల్ నాయక్, పియంఎస్‌యంఎ నోడల్ అధికారి డాక్టర్ ఆర్.అరవింద్, డిప్యూటీ డియంహెచ్‌వోలు, సిహెచ్‌యన్‌సిలు, పిహెచ్‌సి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళ సాయుధ పోరాటమే

ఉద్యమాలకు స్ఫూర్తి
పలాస, జూలై 23: నక్సల్‌బరి స్ఫూర్తితో 1968లో శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాటానికి కొనసాగింపు నేటి విప్లవ ఉద్యమాలు అని విరసం నాయకుడు వరవరరావు అన్నారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద అమరుల బంధుమిత్రుల సంఘం, ఉత్తరాంధ్ర ద్వితీయ సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర ప్రాంతాల నలుమూలలు నుంచి అమరవీరుల కుటుంబీకులు, అభిమానులు, ప్రజాసంఘాల నాయకులు బొడ్డపాడు పురవీధుల్లో అమరులకు జోహార్లు అర్పిస్తూ ఊరేగుతూ విప్లవ గీతాలను అలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆనాటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు దండకారణ్యంలో జరుగుతున్న విప్లవ ఉద్యమమని, ఆ బాటలోనే అభిమానులు, ప్రజలు నడవాలన్నారు. దండాకారణ్యంలో గ్రామరాజ్యాలుగా విరిసిల్లుతున్న జనతన సర్కారు నేడు ప్రజలందరికీ ప్రత్యామ్నాయమన్నారు. దండకారణ్యంలో జనతన సర్కారు ఏర్పాటుకు మావోయిస్టు నాయకులు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దండాకారణ్య విముక్తి ప్రాంత దిశగా ప్రస్తుతం సాగుతుందని, ఈ దిశకు చేరుకోవడానికి ఎంతో ప్రజాయుద్ధవీరులు అమరుల అయ్యారన్నారు. ఆ బాటలో జిల్లాకు చెందిన గోరు మాధవరావు, గంటి ప్రసాదరావు, చలసాని ప్రసాదరావులు పోరాటాలు చేపట్టి ఇదే నెలలో అమరులైనారన్నారు. అమరులకు జోహార్లు అర్పించడమంటే వారి త్యాగాల దారిలోనే నడుచుకోవడమన్నారు. జనతన సర్కారుతో ప్రజలందరూ మమేకం కావాలని, రాజ్యనిర్భందం, ప్రాణ త్యాగాలు అనే అంశంపై ఎంఎస్ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అమరవీరుల బంధుమిత్రుల గౌరవ అధ్యక్షుడు కాకరాల, సిహెచ్ చంద్రశేఖర్, విరసం కార్యదర్శి వరలక్ష్మి, నరసన్న, కోటి, జె.కోదండరావు, ఎం.్ధనలక్ష్మి, పి.విశ్వనాథం, ఆర్.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ కార్పొరేషన్‌తో ‘హరిత శ్రీకాకుళం’
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: హరిత శ్రీకాకుళంగా మార్చేందుకు గ్రీన్ కార్పొరేషన్ సహకారంతో ప్రజల భాగస్వామ్యులైతే ఆరునెలలో లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతామన్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలో పార్కులను గ్రీన్ కార్పొరేషన్ సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఇక్కడ అఫీషర్స్ కాలనీ పార్కులో రెడిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎస్.ఆర్.మూర్తి ఏర్పాటు చేసిన మొక్కల నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మీదేవి, అదనపు పోలీసుసూపరింటెండెంట్ కె.తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో రాయల్ ఫామ్ మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ నగరంలోపార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. గ్రీన్ కార్పొరేషన్ ప్రతినిధులు నగరంలో పార్కులను పరిశీలించారని చెప్పారు. అఫీషియల్ కాలనీ పార్కు ఇందులో భాగంగా ఉందని, సుందరమైన పార్కుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పార్కులో పిల్లలు, పెద్దలు సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉండేందుకు నగరపాలక సంస్థ ద్వారా వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొక్కలను నాటడమే కాకుండా అవి పెద్ద అయ్యే వరకు చిన్నపిల్లల మాదిరిగా పోషణ చేసి బతికించాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం పెద్దఎత్తున చేపడుతున్నామని అన్నారు. హరిత జిల్లాగా ఆవిర్భవించాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కాలనీ వాసులు పెద్దఎత్తున ముందుకువచ్చి పార్కులోను, రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటి పట్టణంలో పచ్చదనం నింపాలని, హరిత శ్రీకాకుళం చేయాలని పిలుపునిచ్చారు.
పి.ఎన్.కాలనీలోగల జన్మభూమి పార్కును ఎగ్జిబిషన్ మైదానంగా మార్పు చేసేందుకు యోచిస్తున్నామని ఎమ్మల్యే చెప్పారు. ఎగ్జిబిషన్‌లను పాఠశాల మైదానాల్లో నిర్వహిస్తున్నారని తద్వారా సమస్యలు వస్తున్నాయని అన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఎగ్జిబిషన్ మైదానం ఏర్పాటు చేయడం వలన అన్ని సందర్భాలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని యోచిస్తున్నామని చెప్పారు. విజయ ఆదిత్య పార్కును 25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశామని, అనుసంధాన రహదారిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రెడిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ ఆఫిషియల్ కాలనీ పార్క ఏర్పాటులో ఎమ్మెల్యే సహకారం మరువలేనిది అన్నారు. పార్కు అభివృద్ధిలో ప్రశాంతినగర్, శ్రీనివాస్‌నగర్ కాలనీ వాసులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వివిధ వ్యక్తులు, సంస్థల సహకారంతో పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హనుమంతు కృష్ణారావు, ప్రొఫెసర్ వి.కృష్ణమూర్తి, ఎస్.బాలకృష్ణ, యోగా గురు కె.చినబాబు, గాంధీ, ఢిల్లీశ్వరరావు, టి.వి.రమణ, కాలనీ మహిళలు పెద్దఎత్తున పాల్గొని మొక్కలను నాటారు.

పథకాలపై అవగాహన అవసరం
పాతశ్రీకాకుళం, జూలై 23: న్యాయస్థానాలు అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలగీతాంబ చెప్పారు. జిల్లా బార్ అసోసియేషన్ సమావేశమందిరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లాలోని పారాలీగల్ వాలంటీర్లు, పానల్ న్యాయవాదుల సమాశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ న్యాయసేవాధికారసంస్థ ద్వారా అమలు చేస్తున్న ఏడు పథకాలను అమలు చేసేవిధానంపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 3 పథకాలను అమలు చేయనున్నామని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా కక్షిదారుల తక్షణ పరిష్కారానికి జాతీయ లోక్‌అదాలత్‌లు ఉపయోగపడతాయన్నారు. న్యాయస్థానాలపట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి, ఏడు పథకాలను సద్వినియోగపరుచుకొనేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు పారా లీగల్ వాలంటీర్లకు అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే త్వరలో జాతీయస్థాయిలో వర్కుషాపును నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బాలల సంరక్షణాధికారి రమణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మేరీ గ్రేసీకుమారి, జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మామిడి క్రాంతి, పలు స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

త్వరితగతిన నాగావళి వంతెన పనులు
శ్రీకాకుళం(టౌన్), జూలై 23: నగరంలోని నాగావళి నదిపై పాత వంతెన స్థానంలో నిర్మిస్తున్న నూతన వంతెన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టరును ఎమ్మెల్యే లక్ష్మీదేవి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంలు ఆదేశించారు. శనివారం ఈ మేరకు వారు వంతెన పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్న నేపథ్యంలో పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. వంతెనని ఆసాంతం పరిశీలించి మిగిలి ఉన్న పనులపై అధికారులతో మాట్లాడారు. అక్కడ నుండి గుజరాతీపేటలోని నాయుడు చెరువు గట్టు వద్ద పార్కును పరిశీలించారు. అక్కడ నుండి నీరు దిగువకు ప్రవహిస్తుండటాన్ని గమనించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, కరగాన భాస్కరరావు, తోనంగి వెంకన్న యాదవ్, కరగాన రాము తదితరులు ఉన్నారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.125 కోట్లు
హిరమండలం, జూలై 23: రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.125 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ ఎండి వెంకట్ తెలిపారు. శనివారం హిరమండంలో జిల్లా స్థాయి బ్రాహ్మణుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి వెంకట్ మాట్లాడుతూ బ్రాహ్మణులను ఆదుకోవడానికి ప్రభుత్వం 2014 సంవత్సరంలో బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. 2014-15, 2015-16 సంవత్సరాలకు రూ.60 కోట్లు, 2016-17 సంవత్సరానికి రూ.65 కోట్లు కేటాయించిందన్నారు. విద్యాభివృద్ధికి భారతి, గాయత్రీ, ద్రోణాచార్య, స్వయం ఉపాధికి చాణక్య, పోటీ పరీక్షలకు వశిష్ట, ఆరోగ్య బీమాకు చెరక, వృద్ధులు, వితంతువులు, అనాధ పిల్లలకు, వికలాంగులకు ఆదుకొనేందుకు సఖ్యత తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. బ్రాహ్మణుల జీవన విధానం మెరుగుపర్చాలన్న ఆలోచనతో బ్రాహ్మణ కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసిందన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకాలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ శర్మ, రాష్ట్ర కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీ మెంబర్ తిరుమలేశ్వరరావు, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు నగేష్, హిరమండలం ప్రతినిధులు జోస్యుల గోవిందశర్మ, వరప్రసాద్, జిల్లా ఒరియా బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు శివాజీ పాణిగ్రాహి పాల్గొన్నారు.

27వేల రక్తయూనిట్లు అవసరం
నరసన్నపేట, జూలై 23: జిల్లాలో రక్తం కొరత విపరీతంగా ఉందని దీనిని భర్తీ చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన అవగాహన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత విపరీతంగా ఉందని కనీసం 27వేల యూనిట్లు రక్తం అవసరం కలిగి ఉందని ఆయన తెలిపారు. అయితే, జిల్లా కేంద్రంలో రక్త నిల్వలు మాత్రం అవసరానికి తగ్గట్టుగా అందించలేకపోతున్నామని దీని వలన ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైకా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపగలిగితే జిల్లాలో ఉన్న 27లక్షల మంది జనాభాలో కనీసం ఒక్క శాతం అయినా రక్తాన్ని సేకరించగలిగితే పెను ప్రమాదం నుండి విముక్తి పొందుతారని పేర్కొన్నారు. ఒక్క నరసన్నపేట కేంద్రంలోనే రక్తదాతలు స్ఫూర్తితో ముందుకు వస్తున్నారని వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గురమణమూర్తిగారు చొరవ చూపగలిగితే రక్తనిధి కేంద్రాన్ని నరసన్నపేటలో ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పి.చైతన్య, వైద్యులు సర్పంచ్ జి.చిట్టిబాబు పాల్గొన్నారు.