శ్రీకాకుళం

రెండంకెల ప్రగతి సాధిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 15: జిల్లా స్థూల, తలసరి ఆదాయం పెరగాలి.. తక్కువ స్థూల ఆదాయం కలిగిన మండలాలతో రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుతనం కలిగిన సిక్కోల్‌ను నాలుగో పారిశ్రామిక విప్లవంతో బయటకునెట్టేయాలి.. నవ్యశ్రీకాకుళం నిర్మాణంలో అంకితాభావంతో అందరూ భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశిస్తున్న అభివృద్ధి, సంక్షేమపథకాలు, ఆహార, ఆరోగ్య, గ్యాస్, తాగునీటి భద్రత ప్రతీ ఒక్కరికీ జిల్లాలో అందాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా అచ్చెన్న పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ కోడిరామ్మూర్తి స్టేడియంలో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని మంత్రి అచ్చెన్న ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విజ్ఞానాన్ని అందింపుచ్కుని పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పుతో అవినీతికి తావులేకుండా ఈ-ఆఫీసు విధానంతో ప్రజలకు సుఖవంతమైన పాలన అందించాలని ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ సాంకేతిక విప్లవాన్ని ముఖ్యమంత్రి నాలుగో పారిశ్రామిక విప్లవంగా అభివర్ణిస్తూ - ఇందులో జిల్లా ప్రజలంతా అంకితాభావంతో పనిచేస్తే సి.ఎం. ఆశించిన సరికొత్త ఆంధ్ర రాష్ట్రం నిర్మాణంలో శ్రమపడే శక్తులుగా సిక్కోల్ ప్రజలు ఉండాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌గా స్థాయి పెంపొందించిన తర్వాత ఎన్నికలు మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్నామని, తద్వారా మెరుగైన పాలనకు అత్యంత కీలకమైన పాలకమండలి ఏర్పాటుకు శ్రీకారం చుట్టగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా అంతటా కేవలం 12 శాతం మాత్రమే పచ్చదనం నిండిన అటవీ విస్తరణాన్ని 50 శాతంగా పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. భూగర్భజలాలు పరిరక్షించే మార్గాలు అనే్వషించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఇంకుడు గుంతలు తవ్వి 2.85 లక్షలు ఉద్యమంగా ఏర్పాటు చేసి జలం జీవాధారమేకాదు ప్రాణాధారమంటూ చైతన్యపరిచి జలాన్నిరక్షించుకోవాలన్న చైతన్యం సిక్కోల్ ప్రజల్లో తీసుకువచ్చామన్నారు. అన్నదాతలకు అండగా నిలిచి రానున్న ఏడాది కాలంలో తొమ్మిది లక్షల ఎకరాలకు రెండుపంటలకు సాగునీరు అందించేలా శాశ్వతమైన వంశధార ప్రాజెక్టును అంకితం చేయనున్నామని చెప్పేందుకు గర్వంగా ఉందని అచ్చెన్న అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు తల్లిదండ్రులందరూ ముందుకువచ్చేలా కార్పొరేట్ స్కూళ్ళలో గల అన్నీ సౌకర్యాలు సర్కార్ బడుల్లో ఉండేలా మారుస్తూ డ్రాపౌట్స్ తగ్గించామన్నారు. మంచి వైద్యం సేవలు అందించాలని కృషి చేస్తున్నామన్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి తల్లి-పిల్లలకు ఆరోగ్యభద్రత కల్పిస్తున్నామన్నారు. ర
డ్డిస్, కోవాలెంట్ లాబ్స్ వంటి ఫార్మసీ యూనిట్లు, కొవ్వాడ అణుపార్లు, భావనపాడు పోర్టు, ఎ.పి.జెన్‌కో-సుమిటోమి థర్మల్ ప్లాంటు వంటి ప్రాజెక్టులతో జిల్లా అభివృద్ధి మరోరెండేళ్ళలో పూర్తిస్థాయిలో జరగనున్నాయన్నారు. టెక్కలి నియోజకవర్గంలో రూ. 22 కోట్లతో 98 హెబిటేషన్లలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించిన దివంగతనేత జ్ఞాపకార్ధం ఎర్రన్ననాయుడు మంచినీటి పథకం ప్రజలకు అంకితం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. నవోదయం పేరిట జిల్లాలో 109 గ్రామాల్లో సారా తాగే వారిలో మంచిపరివర్తన కలిగేలా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం దీక్షకు ఎక్సయిజ్‌శాఖ సహకారం సిక్కోల్‌ను మద్యపాన సామాజిక రుగ్మత నుంచి బయటకునెట్టేయడానికి మార్గంగా మారినందుకు కృషి చేసినవారందరికీ అచ్చెన్న అభినందించారు. ఆక్వా పరిశ్రమతో తీరం ఆర్థికకారిడార్‌గా మారనుంది. రూ. 15 కోట్లతో థాయ్‌లాండ్‌కు చెంది సి.పి.ఆక్వా సంస్థ బ్రూడ్‌స్టాక్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంటు రంగంలో ఒక కేంద్రాన్ని నెలకొల్పుతుందని చెప్పడానికి గర్వంగావుందన్నారు. జిల్లా అంతటా 592 అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బి.సి.మైనారిటీ, విభిన్నప్రతిభావంతులు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు సంక్షేమపథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
చేనేతకు చేయూత ఇస్తున్నామన్నారు. కార్మికులను కష్టకాలంలో ఆదుకునే పథకాలు ప్రత్యేకంగా రూపొందించి, అమలు చేస్తున్నామన్నారు. చంద్రన్నబీమాతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చామన్నారు. జాతీయ,అంతర్జాతీయ క్రీడా వేదికపై సిక్కోల్ ప్రతిభ పటిష్ఠమైంది. జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండేళ్ళలో చేసినప్పటికీ, ఇంకా చేయాల్సిందివుందని దానికి అందరూ భాగస్వామ్యులుకావాలంటూ అచ్చెన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు, జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.