శ్రీకాకుళం

తేలని ‘నామినేటెడ్’ సంగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-శ్రీకాకుళం:పదేళ్ళు ప్రతిపక్షంలో గల తెలుగుదేశం పార్టీని అధికారం వైపు నడిపించేందుకు వ్యయప్రయాసలకులోనైన ముఖ్యనేతలకు రాజకీయ పదోన్నతలు అందిస్తామని ప్రతీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి రెండేళ్ళయినా రాష్టస్థ్రాయి నామినేటెడ్ పదవుల భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడంతో పలువురు ఆశావాహులుగానే మిగిలిపోయారు. ఇటువంటి నేతలను సంతృప్తిపరచడం అధిష్ఠానానికి మరింత తలనొప్పిగా మారింది. ఆరుమాసాలుగా రాష్ట్ర రాజకీయాల్లో మారిన సమీకరణాలు ఫలితంగా వైకాపాలో చురుకైన పాత్ర పోషించిన కేడర్ కూడా సైకిల్ ఎక్కేసారు. ఇటువంటి నాయకులకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని యువనేత నారా లోకేష్, అధినేత చంద్రబాబునాయుడు ఒన్ టూ ఒన్ సిట్టింగ్‌లలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆ నాయకులు ఇప్పుడిప్పుడే గుర్తుచేస్తున్నారు. ఇటువంటి చర్చలు తెలుగుత మ్ముళ్ళను మరింత అభద్రతాభావానికి గురిచేస్తున్నాయి. నియోజకవర్గాలవారీగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్, డైరక్టర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు, విద్యాకమిటీ, నీటి సంఘాలు, గ్రంథాలయాల సంస్థ కమిటీల్లో గల్లీ నేతలకు అవకాశం కల్పించారే తప్ప నియోజకవర్గం స్థాయి నేతలను విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక చోట్ల బంధుప్రీతితో హాస్పటల్ కమిటీలను భర్తీ చేసుకున్నారని సొంతపార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు.
రాజాం ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవిని అక్కడ ఇన్‌ఛార్జిగా వ్యవహారిస్తున్న ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి కుమార్తెతో భర్తీ చేయడంతో చేయడంతో సిక్కోల్ తమ్ముళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. 50 ఏళ్ళు రాజకీయ చరిత్ర కలిగిన ప్రతిభాభారతి వారసురాలుగా ఆమె కూమార్తెకు ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవితో వారసత్వ రాజకీయాలను తెరలేపడం పట్ల తెలుగుదేశం పార్టీలో కూడా బంధుప్రీతి పరాకాష్ఠకు చేరిందన్న సంకేతంపై రాజకీయ పరిశీలకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడలో జరిగిన క్యాబినేట్ సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చ జరగాల్సివున్నప్పటికీ ఆ ప్రస్తావన లేకపోవడంతో మరోసారి క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలవారీగా నిర్వహించిన సమీక్షల్లో కూడా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని నియోజకవర్గాల సమీక్షల్లో ఇన్‌ఛార్జి, జిల్లా మంత్రి, పార్టీ పెద్దల వద్ద ఏకరవుపెట్టుకున్నా ప్రభుత్వం తీరుమారడం లేదంటూ తెలుగు తమ్ముళ్ళు డీలాపడుతున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నామినేటెడ్ పదవుల ప్రస్తావన తెస్తారనుకున్నప్పటికీ, ఆ ఊసే రాకపోవడంతో సిక్కోల్ తెలుగు తమ్ముళ్ళు నిరాశ, నిస్పృహలతో కలహాలకు కాలుదువ్వుతున్నారు. పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలే కన్పించడం లేదు. అసలు నామినేటెడ్ పదవుల భర్తీపై సర్కార్ ఏం ఆలోచిస్తుంది? శ్రీకాకుళం జిల్లాయే కాకుండా - ఏపీలో ఇంకా నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంపై నేతలు, కార్యకర్తలు తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. విభజన అనంతరం ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం దక్కించుకోవడంతో నామినేటెడ్ పదవులు దక్కుతాయని పార్టీలో తొలినాళ్ళ నుంచి పని చేసిన నేతలు భావించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాకపోయినా..నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా, చాలా మంది సీనియర్లకు కార్పొరేట్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఎన్నికల సమయంలో అధిష్ఠానం హామీ కూడా ఇచ్చింది.
రాష్ట్రంలో 13 జిల్లాల్లో 50కిపైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వీటిలో రెండు జిల్లాకు తప్పనిసరిగా వస్తాయన్న ఆశలు ఇంకా నెరవేరలేదు. పట్టుమని 15 కార్పొరేషన్ పదవులు కూడా భర్తీ చేయకపోవడంతో సీనియర్ నేతలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల కమిటీలు ఊసేలేకుండాపోయింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానానికి పాలకమండలిని నియమించకుండా ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని తెలుగు తమ్ముళ్ళు జిల్లా మంత్రి అచ్చెన్నతోపాటు, ఇక్కడ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావును ప్రశ్నిస్తున్నారు. ఒక్క జిల్లా గ్రంథాలయ కమిటీని మాత్రమే మంత్రి చొరవతో నియమించగలిగారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జిల్లా నేతలు గాలికి వదిలేశారని కార్యకర్తలు నేతలతో వాదనలకు దిగుతున్నారు. ఇలా ఉంటే - ప్రభుత్వం వాదన మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ ప్రకారం కొన్ని కార్పొరేషన్ శాఖల్లో పూర్తిగా కేటాయింపులు జరగలేదని, అందుకే నియమకాలు ఆలస్యమవుతుందంటోందంటూ చెప్పుకొస్తోంది. కీలక విభాగాల్లో విభజన ప్రక్రియ పూర్తి అయిన వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామంటోంది. పార్టీ మొత్తానికి నామినేటెడ్ పదవుల ప్రక్రియ అందని ద్రాక్షలాగే ఉంచడమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని పలువురంటున్నారు.
జిల్లాలో మంత్రి అచ్చెన్న కార్యకర్తల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారన్న అపవాదు మరింత బలపడుతోన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షిస్తున్న క్యాడర్ గళం రానున్న రోజుల్లో పార్టీని గందరగోళ పరిస్థితుల్లో నెట్టేయడానికి ఛాన్స్ ఉందంటూ రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

పల్లె పర్యటనలు ప్రజాప్రతినిధులకు తెలపండి
పొందూరు, ఆగస్టు 20: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు పరిశీలించేందుకు పంచాయతీలను సందర్శించే అధికారులు వారి పర్యటన వివరాలను రాజకీయాలకు అతీతంగా వర్గవిభేదాలకు దూరంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు తెలియజేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశించారు. ఆయన స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిపి సువ్వారి దివ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని పై విధంగా అన్నారు. మండలంలో పంచాయతీలను సందర్శించే అధికారులు వారి పర్యటన వివరాలు తెలియజేయకపోవడం వలన తాము జరిగే కార్యక్రమాలను తెలుసుకోలేకపోతున్నామని మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు సీపాన శ్రీరంగనాయకులు ఆందోళన వ్యక్త పరిచారు. దీనిపై స్పందించిన రవికుమార్ మాట్లాడుతూ ఇకపై మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులకు పంచాయతీలను సందర్శించినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పిన మీదటే పర్యటించాల్సిందిగా సూచించారు. మండలంలోగల 75 హేబిటేషన్‌లో జనాలకు గండ్రేడు వద్ద నాగావళి నదిని స్వచ్ఛమైన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టామని ఇందుకు రూ.35కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందన్నారు. మండలంలో ఆరు అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు మంజూరయ్యాయని త్వరలో వీటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని స్థానిక ఐ సి డి ఎస్ సహాయ సంక్షేమాధికారిణి సంతోషి వివరించారు. అలాగే ఖాళీగా ఉన్న ఒక కార్యకర్త, 9 ఆయాల పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. మండలంలో ఆదివారం జరగనున్న సాక్షరభారతీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సర్పంచ్‌లు, ఎంపిటీసీలు తమవంతు సహాయ సహకరించాల్సిందిగా మండల సాక్షరభారత్ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు కోరారు. కృష్ణాపుష్కరాలకు ఈ మండలం నుంచి తుంగపేట సర్పంచ్ గోపీలకు ప్రభుత్వం ఆహ్వానించినట్లు కూన రవికుమార్ తెలిపారు.
రాజీవ్ ఆలోచనా విధానమే నేటి దేశ ప్రగతి
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 20: అతి పిన్న వయసులో దేశ అత్యున్నత ప్రధాని పదవిని చేపట్టి తన ఆలోచనా విధానంతో చేపట్టిన సంస్కరణల ఫలితమే నేటి దేశ ప్రగతి అంటూ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కొనియాడారు. శనివారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ 72వ జయంతి సభా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైమాట్లాడారు. రాజీవ్‌గాంధీ నవభారత నిర్మాణంలో మరువలేని పాత్రను పోషించి చిరస్మరణీయ ప్రధానిగా దేశ ప్రజల మదిలో నిలిచారని కొనియాడారు. నేడు సాఫ్ట్‌వేర్ రంగంలో, ఇంటర్నెట్ ప్రపంచంలో దేశం ఇంతటి అనుపమాన ప్రగతి సాధించిందంటే ఆనాటి రాజీవ్ వేసిన పునాదే కారణం అన్నారు. దక్షిణాసియా దేశాలు అన్నింటి మద్య పూర్తి వ్యాపార దౌత్యపరమైన సహాయ సహకారాల అవసరం ఎంతైనా ఉందని గుర్తించి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) ఏర్పడటానికి రాజీవ్ ఎనలేని కృషిచేసారని అన్నారు. దేశానికి మానవవనరులు యువతరమే అని గ్రహించి వారి ప్రతిభాపాటవాలను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి యువకులకు 18 ఏళ్లకే ఓటుహక్కును కల్పించిన ఘనత రాజీవ్‌గాంధికే దక్కిందన్నారు. అయితే నేటి ప్రభుత్వాలు తమ గుర్తుగా ఎటువంటి అభివృద్ధి చేపట్టలేకపోయారని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేయడం, ప్రతిపక్ష సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దుచేసి అరాచకపాలన సాగిస్తున్నారని టిడిపిపై విరుచుకుపడ్డారు. ముందుగా రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు డోల జగన్మోహనరావు, ఎపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లి రామ్మోహనరావు, ఎపిసిసి యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సతీష్, రత్నాల నర్శింహమూర్తి, నంబాళ్ల రాజశేఖర్, పైడి రవి, బాణ్ణ రాము, గంజి ఆర్ ఎజ్రా, అల్లిబిల్లి రాధ తదితరులు పాల్గొన్నారు.

వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి
శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 20: జిల్లాలో సాధారణంగా ఖరీఫ్‌లో వరి సాగు 2.10లక్షల హెక్టార్లలో సాగు అవుతుందని ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేశారు. క్రాంతి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వంశదార, తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస రిజర్వాయర్‌లలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ నదుల నుండి నీరు సముద్రంలోనికి వృధాగా పోతుందని పేర్కొన్నారు. పై పరిదిలో ఉన్న కాలువ రికార్డెడ్ ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతీ సీజన్‌లో ఇదేతంతు నెలకొందని తెలియజేశారు. నీరు-చెట్టు పనులు చేయడంలో ఉన్న శ్రద్ద సాగునీరు కల్పించడంలో జలవనరుల శాఖ కింది సిబ్బంది నుంచి పై అధికారుల వలకు ఉండటం లేదని పేర్కొన్నారు. దీని పర్యవ స్థానమే కాలువల ద్వారా సాగునీరు అందక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యనే ప్రారంభించిన తోటపల్లి బ్యారేజ్ ఆయకట్టు బాలారిష్టాలు వెంటాడుతున్నాయన్నారు. 60వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినప్పటికీ కేవలం 30వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదన్నారు. వంశదార 9 టి వి కాలువ పరిధిలో సుమారు 2వేల ఎకరాలు పంట ఎండిపోయిందన్నారు. పలాస నియోజకవర్గంలో మొదుగులవలస నుండి గుల్లాలపాడు వరకు కాలువలు సరిగ్గా లేకపోవడంతో సాగునీరు అందడం లేదన్నారు. పెదబుడ్డి సైఫూన్ వద్ద కాలువ గండికి కారకులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మల్లించి ఆదుకోవాలని కోరారు. జంపరకోట, కాట్రగడ్డ, దబార్ సింగ్ తదితర గెడ్డలపై రిజర్వాయర్ పెండింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈవిలేఖర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, చాపర సుందరలాల్, పి.గంగాభవానీ, కె విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్కిల్ డవలప్‌మెంట్‌పై 23న వర్క్‌షాప్
ఎచ్చెర్ల, ఆగస్టు 20: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రిన్సిపల్స్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల కార్యదర్శులు, చైర్మన్‌లతో ఈ నెల 23న స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ వర్శిటీ రిజిస్ట్రార్ జి.తులసీరావు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ అంబేద్కర్ వర్శిటీ సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు శనివారం ఆయన ఛాంబర్‌లో విలేఖర్లకు తెలిపారు. ప్రతీ డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి తద్వారా విద్యార్థులకు వివిధ అంశాలపై స్కిల్ డవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వాలన్న సంకల్పంతోనే ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వర్క్‌షాప్‌కు స్కిల్‌డవలప్‌మెంట్ చైర్మన్ ప్రొపెసర్ గంటా సుబ్బారావు, అకడమిక్ డైరెక్టర్ ఎం.శైలజలు హాజరు కానున్నారని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌కు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, చైర్మన్‌లు, కార్యదర్శులు హాజరు కావాలని ఆయన సూచించారు.
గొర్రెలు, మేకల పెంపకానికి
రూ.325 కోట్ల రుణాలు లక్ష్యం
టెక్కలి, ఆగస్టు 20: గొర్రెలు, మేకల్లో వచ్చిన నీలి నాలుక వ్యాధికి సంబంధించి మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమం చేపడుతుందని పశుసంవర్థకశాఖ అదనపు సంచాలకులు కృష్ణమూర్తి తెలిపారు. శనివారం డివిజన్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ నెల్లూరు, కడప, ఒంగోలు ప్రాంతంలో ఈ వ్యాధి సోకడాన్ని గుర్తించి వ్యాక్సిన్ సరఫరా చేసామన్నారు. ఆంత్రాక్స్ వంటి ప్రమాధకర వ్యాధులు కూడా విశాఖ, కడప, కర్నూలు జిల్లాల్లో గుర్తించి నివారణ చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో 45 సంచార వైద్యశాలలు మంజూరయ్యాయని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. 400 గ్రామాలను అధిక పాల ఉత్పత్తి గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. గొర్రెలు, మేకలు పెంపకానికి 325 కోట్ల రూపాయలు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎం.వెంకటేశ్వరరావు, ఎం. కరుణాకర్, బగాది రాము, మాదిన ప్రసాదరావు ఉన్నారు.
పెద్ద మార్కెట్ కళాసీల ఆందోళన
శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 20: నగరంలోని పొట్టి శ్రీరాముల పెద్ద మార్కెట్ కలాసీలు తమకు వెల్ఫేర్ ఫండ్ అమలుచేయాలని కోరుతూ రెండో రోజు ఆందోళన చేపట్టారు. శనివారం స్థానిక మార్కెట్ వద్ద వారు వారు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమకు పియప్, ఇఎస్‌ఐ వంటి సదుపాయాలు కల్పించాలని, అలాగే కలాసీలందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలాసీలు శుక్రవారం నుండి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కొంతమంది వ్యాపారస్తులు తమ సొంత మనుషులను పెట్టి సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్ చేయడాన్ని గమనించిన కలాసీలంతా ఆయా యజమానులపై తిరగబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోను తమ డిమాండ్లు నెరవేరే వరకు తాము ఆందోళన విరమించేది లేదని, బయటి వ్యక్తులు వచ్చి లోడింగ్, అన్‌లోడింగ్ చేయడానికి వీల్లేదని వారు ఖరాఖండిగా తేల్చిచెప్పారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కలాసీలుగా పనిచేస్తున్నా దుర్భర జీవితం గడుపుతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరితే ఈ విధంగా యజమానులు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం భావ్యం కాదని హెచ్ఛరించారు.
అయితే పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు కోరాడ హరగోపాల్ వంటి పెద్దలు ఆందోళన బాట పట్టిన కలాసీలతోను, వ్యాపార వర్గాలతోను చర్చించారు. అయినప్పటికీ చర్చలు సఫలం కాకపోవడంతో ఆందోళన కొనసాగుతూనే ఉంది. కార్యక్రమంలో సిటు నాయకులు టి.తిరుపతిరావు, కలాసీ యూనియన్ నాయకులు కె.సూరయ్య, సిహెచ్.గోపి, ముద్దాడ జగదీష్, జి.శ్రీను, టి.అప్పలరాజు, ఎ.అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
కె కె నాయుడుపేటలో డెంగ్యూ కలకలం
ఎచ్చెర్ల, ఆగస్టు 20: మండలంలోని కొయ్యాం పంచాయతీ అనుబంధ గ్రామమైన కొత్తకూర్మినాయుడు పేట గ్రామంలో డెంగ్యూ సోకి జీరు గోవింద(35) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. జ్వరంతో బాదపడుతున్న గోవింద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ప్లేట్‌లేట్స్ డౌన్ కావడంతో హఠాణ్మరణం చెందాడు. దీంతో ఈ గ్రామంలో ఒకింత ఆందోళనకు గురౌతున్నారు. ఇదే వ్యాధి లక్షణాలతో కంబ సుమిత్రా, శిల్లా పావనిలు ఉన్నారని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. గ్రామంలో అనేకమంది జ్వరాలతో బాదపడుతున్నారని అయితే వైద్య సేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యశాఖాధికారులు గ్రామంలో సర్వే నిర్వహించి రక్తనమూనాలు సేకరించి తక్షణ సేవలు అందించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సర్పంచ్ అయ్యప్పరెడ్డి, మాజీ ఏ ఎం సి చైర్మన్ జీరు రామారావులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎచ్చెర్ల ప్రాధమిక వైద్యాధాకారి పర్యవేక్షణలో గ్రామంలో కొనసాగిస్తున్నారు.

జిల్లా జైలును సందర్శించిన బృందం
గార, ఆగస్టు 20 :జిల్లా జైలును బృందం సందర్శించింది. రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వుల మేరకు ఈ బృందాన్ని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం నియమించిన సంగతి విధితమే. జిల్లా జైలులో క్రైమ్ రేటు తగ్గినట్లుగా బృందం గుర్తించినట్లు న్యాయవాధి ఇందిర ప్రసాద్ తెలిపారు. అనధికారిక బృందం సభ్యులుగా టి.బృంద, జి.కృష్ణారావు సందర్శించి జైలులో ఖైదీలకు అమలౌతున్న సౌకర్యాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీలకు సలహాదారులుగా నియమితులైన మన్మధరావు ఖైదీల సమస్యలను తెలుసుకున్నారు. అనధికారిక సభ్యులు ఖైధీలతో ముఖాముఖి మాట్లాడి వాటి సమస్యలు , సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరివర్తన దిశగా ఆలోచించాలని ఖైదీలకు సూచించారు. విద్యను పెంపొందించుకోవాలని సూచించారు.

పాటూరి సేవలు చిరస్మరణీయం
ఎచ్చెర్ల, ఆగస్టు 20: గ్రామీణ ప్రాంతాల్లో గ్రంధాలయ ఉద్యమ నేత పాటూరి నాగభూషణం చేసిన సేవలు కృషి ఫలితంగా గ్రంథాలయాలు ఆవిర్భవించాయని స్థానిక సర్పంచ్ ఎండ నాగరాజు, నీటి సంఘం అధ్యక్షులు బాణ్న రాంబాబులు స్పష్టంచేశారు. ధర్మవరం శాఖాగ్రంధాలయంలో పాటూరి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో వీరు మాట్లాడారు. విజ్ఞాన బాండాగారాలుగా ఫరిడిల్లుతున్న గ్రంధాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. దాతల సహకారంతో గ్రంధాలయాలాభివృద్ధి సాధ్యపడుతుందని ఇందుకు స్థానికులు ముందుకు రావాలన్నారు. పాటూరి సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని అటువంటి మహనీయుల త్యాగాల వల్లే సమాజాభివృద్ధి వేగవంతం అయిందని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఎంపిటీసీ అల్లుకన్నప్పడు, గ్రంధాలయ అధికారి ఎం.చంద్రశేఖర్‌రావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. తొలుత పాటూరి చిత్రపటానికి పూల మాల వేసి అంజలి ఘటించారు.