శ్రీకాకుళం

రైతు ముంగిటకే కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఆగస్టు 22: జిల్లాలో ప్రస్తుతం 159 గోపాలమిత్ర ద్వారా గ్రామాల్లో రైతు ముంగిటకే కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్లు అందిస్తున్నామని సెమన్ బ్యాంక్ ఏడి డాక్టర్ నంబాళ్ల దామోదరరావు అన్నారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ 2016-17 సంవత్సరానికి కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్లు జిల్లా వ్యాప్తంగా 2.19లక్షలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జూలై నెలాఖరు నాటికి 67,169 ఇంజక్షన్లు లక్ష్యంగా కాగా 82,908 ఇంజక్షన్లు చేసి లక్ష్యానికి మించి 123శాతం ప్రగతి సాధించినట్లు తెలియజేశారు. అలాగే 2016-17 సంవత్సరానికి దూడలపుట్టుగ జిల్లా వ్యాప్తంగా 74,865 లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జూలై నెలాఖరు నాటికి 24వేల దూడల పుట్టుగ లక్ష్యంగా 32,007 దూడలు పుట్టినట్లు తెలియజేశారు. కేవలం గోపాలమిత్ర ద్వారానే కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్లు 1.20లక్షలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జూలై నెలాఖరు నాటికి 31,742 లక్ష్యంగా కాగా 39,094 ఇంజక్షన్లు చేసినట్లు తెలియజేశారు. పశుగర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాలు 80నిర్వహించేందుకు లక్ష్యంగా నిర్ణయించి ఇంతవరకు 37 పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఈ మధ్య కాలంలోనే 13గోపాలమిత్రలను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలియజేశారు. కృత్రిమ గర్భోత్పత్తి, ప్రధమచికిత్స అందుబాటులో లేని గ్రామాలు ఇంకా ఏమైనా ఉన్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో గోపాలమిత్ర, పశువైద్య కేంద్రాలు అందుబాటులో లేనట్లయితే అక్కడ కొత్తగా గోపాలమిత్రను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపనున్నట్లు తెలియజేశారు. 19వ ఆర్ ఐ డి ఎఫ్ కింద జిల్లాలో 46 గోపాలమిత్ర కేంద్రాలకు భవనాలు మంజూరు కాగా 26 కేంద్రాల పని పూర్తయ్యాయని మరో ఏడు కేంద్రాలు వివిద దశల్లో ఉన్నాయని ఇంతవరకు 13 కేంద్రాల్లో పని ప్రారంభం కాలేదని తెలియజేశారు.