శ్రీకాకుళం

బాబు వచ్చారు... జాబ్ వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 3: రెండేళ్ళు కిందట ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ‘బాబు వస్తే - జాబ్ వస్తోంది’ అన్న మాట నిలబెట్టుకునేలా నిరుద్యోగ యువతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నిరాశా, నిస్పృహాలతో సతమతమవుతూ బి.టెక్, పి.హెచ్.డి విద్యార్హతలతో పోలీసు కానిస్టేబుళ్ళ ఉద్యోగాల కోసం పడిగాపులు పడే నిరుద్యోగ యువతకు తెలుగుదేశం ప్రభుత్వం భరోసాగా ఉంటోందన్నారు. అందుకే రాష్టమ్రంతటా నాలుగు వేల మంది యువతకు పోలీసు, మిలటరీ, నెవీ వంటి జాతికి, జాతీయతకు సేవచేసే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. అటువంటి సేవాదృక్పథంతో పనిచేసేందుకు అర్హత కలిగేవిధంగా శిక్షణ నిస్తోందని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో శనివారం తండ్యాలవలసలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో యువజన సర్వీసుశాఖ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రి ఆర్మీ ట్రైనింగ్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 300 మందికి నెలరోజుల పాటు శిక్షణనిచ్చి వారికి ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడం ముదావహమున్నారు. ఎవరి కాళ్ళపై వారు నిలుచునే విధంగా వారిలో నైపుణ్యాలను వెలికి తీసి, వారికి శిక్షణను ఇచ్చేందుకు ప్రభుత్వం 550 కోట్ల రూపాయలను కేటాయించి, మొదటివిడతగా రాయలసీమ, కోస్తా జిల్లాలలో నాలుగు వేల మందికి రక్షణ, పోలీసు రంగాలకు అనుగుణ్యమైన శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 550 కోట్ల రూపాయలను కేటాయించి మొదటివిడతగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో నాలుగు వేల మందికి రక్షణ, పోలీసు రంగాలకు అనుగుణ్యమైన శిక్షణాకార్యక్రామాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈ కార్యక్రమలకు అధిక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పది వేల ఉద్యోగాలను భర్తీకి సన్నాహాలు చేస్తుండగా, అందులో ఆరు వేల ఉద్యోగాలు పోలీసుశాఖకు చెందినవని తెలిపారు. అభ్యర్థులకు 10 వేల 500 రూపాయలతోపాటు, బూట్లు, యూనిఫారాలకు అదనంగా వెయ్యి రూపాయలను అందిస్తామన్నారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాల ఫాకల్టీలు అందించే శిక్షణా కార్యక్రమాన్ని నిబద్ధతతో, క్రమశిక్షణతోను సద్వినియోగపరచుకుని, మిగిలిని జిల్లాలకు ఆదర్శప్రాయులు కావాలన్నారు. జిల్లా యంత్రాంగం స్థలాన్ని నిర్థారిస్తే, ఐదు కోట్లు రూపాయలతో శిక్షణా కేంద్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. ఉపాధికల్పన కార్యాలయాన్ని కెరీర్ గైడెన్సు కేంద్రాలుగా మార్చినట్టు తెలిపారు. బ్యాంకు పరీక్షలకు కూడా శిక్షణ నివ్వనున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాలద్వారా సంబంధిత విషయాలపై అభ్యర్థులకు శిక్షణనిచ్చి, పరిసర ప్రాంతాలలో నెలకొల్పే పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా హోమ్ కేప్‌శాఖకు విదేశాలకు వెళ్ళే వారు దరఖాస్తులను చేసుకుంటే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. అనంతరం శాసనసభ్యురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ, శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుని జీవితాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. కార్యక్రమానికి ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డి.ఎస్పీ భార్గవరావునాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, పోలీసు అధికారులు, ఐతమ్ కళాశాల, వెంకటేశ్వర కళాశాల, సిస్టమ్స్ కళాశాలల అధ్యాపక బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం చేయూత
సారవకోట, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో చెరువుల్లో చేపలు పెంచి జీవనోపాధి పొందుతున్న స్వదేశీ మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. మండలంలోని రంగసాగరం చెరువులో చేపలుపెంచి జీవిస్తున్న కురుడింగి సత్యనారాయణ సొసైటీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చెరువుల యాజమాన్యం భాగస్వామ్య పథకం నిధుల నుండి రూ.5లక్షలను భవన నిర్మాణానికి మంజూరు చేయగా మత్స్యకారులు సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తిచేసినందుకు ఆయన అభినందించారు. చెరువులో చేపలను బయటకు తీసి నిల్వ ఉంచేందుకు వీలుగా ఫిష్‌ల్యాండ్ సెంటర్‌ను
నిర్మించామని మత్స్యకారులు దీనిని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. అదే విధంగా చేప పిల్లలను ఉత్పత్తి చేసి పెంచేందుకు రూ.11లక్షల వ్యయంతో రెండు చిన్న చెరువులను రంగసాగరం చెరువుగర్భంలో నిర్మించామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ స్వదేశీ మత్స్యకారులు జిల్లాలో ప్రప్రథమంగా ఈ భవనం నిర్మించడం విశేషమన్నారు. తొలుత భవనాన్ని ఎంపితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ తరువాత పెద్దలంబ గ్రామంలో గ్యాస్‌స్టౌవ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని వీరు చేపట్టారు. బెజ్జి, కరడసింగి గ్రామాలలో నిర్మించిన పాఠశాల నూతన భవనాలను ప్రారంభించి, వాండ్రాయి గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో నీటి పారుదల శాఖ ఇఇ ప్రదీప్, ఎఫ్‌డివో గోపీకృష్ణ, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

బందలోవలో ఏనుగుల తిష్ఠ
బూర్జ సెప్టెంబర్ 3: రెండు రోజులుగా అలజడి సృష్టించిన ఏనుగులు ప్రస్తుతం బూర్జ-ఎల్‌ఎన్ పేట మండలాల సరిహద్దు అయిన బందలోవలో తిష్ఠ వేశాయి. ఈ మేరకు ఫారెస్టు అధికారి రామలింగేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా విలేఖర్లతో శనివారం ఆయన మాట్లాడారు. జంగాలపాడుకు చెందిన లక్ష్మణరావుకు చెందిన వరిపంటను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు బందలోవకు అడుగులు వేసినట్టు తెలిపారు. గ్రామస్తులకు అప్రమత్తం చేసేందుకు సురేష్, ప్రకాష్ అనే ఇద్దరు ట్రాకర్లు ఉన్నారని తెలిపారు. ఏనుగుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేస్తున్నామన్నారు. గ్రామస్తులకు ఏర్పడిన నష్టపరిహారాన్ని అందచేయనున్నట్టు తెలిపారు.

మన్యం రహదారులకు

మోక్షం

సీతంపేట, సెప్టెంబర్ 3: గడిచిన కొనే్నళ్లుగా అటవీశాఖ అభ్యంతరాలతో మారుమూల గ్రామాలకు నిర్మించాల్సిన రహదారులు పెండింగ్‌లో ఉన్నాయి. సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో 54 రహదారులకు అటవీశాఖ నుంచి అనుమతులు ఎట్టకేలకు మంజూరయ్యాయి. శనివారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం
అధ్యక్షతన డిస్టిట్ లెవెల్ కమిటీ సమావేశమైంది. పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు కళావతి, కలమట వెంకటరమణలు, జిల్లా అటవీశాఖాధికారి శాంతిస్వరూప్, ఐటిడి ఎ పి ఒ వెంకటరావులతో పాటు తదితర శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటి విడతలో 54 రహదారులకు కలెక్టర్ అటవీశాఖ అనుమతులు ఇప్పించగా, వీటితో పాటు పంచాయతీరాజ్ 1, గిరిజన సంక్షేమం 24, చిన్ననీటిపారుదల ఒకటి, శాఖల పరిధిలో ఉన్న 26 రహదారులకు కూడా డి ఎల్‌పిలో సమీక్షించి అనుమతులను తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు వేసే రహదారులు నాలుగు కాలాలు పాటు ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే ట్రైబుల్ సబ్‌ప్లాన్‌లో 25 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి స్థల సమస్య ఉందని, వీటిపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చొరవ చూపి స్థలాలు కేటాయిస్తే భవన నిర్మాణాలు వేగవంతమవుతాయన్నారు. అలాగే విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలల భవనాలను ఐసిడి ఎస్, స్ర్తి శిశు సంక్షేమశాఖకు అప్పగిస్తూ మెమో ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సర్వశిక్ష అభియాన్ నిధులతో కూడా నిర్మించాల్సిన మరికొన్ని నిర్మాణాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు. సమీక్షలో పి ఆర్ ఎస్ ఇ మోహనమురళీ, ఆర్‌అండ్‌బి ఇ ఇ రెడ్డి రామకృష్ణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఇ ఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.