శ్రీకాకుళం

సమష్టి సహకారంతోనే ‘స్వచ్ఛాంధ్ర ప్రదేశ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 6: రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల, మూత్రవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, దీనికి యంత్రాంగం యావత్తూ సహకరించాలని మెప్మా మిషన్ డైరెక్టర్ చినతాతయ్య పిలుపునిచ్చారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మంగళవారం కమిషనర్ పి.ఎ.శోభ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో మార్పు వచ్చేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికుల సహాయ సహకారంతో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. అనంతరం కమిషనర్ తాను తయారు చేసిన యాక్షన్ ప్లాన్‌ను వివరిస్తూ పట్టణంలో బహిరంగ ప్రదేశాలను గుర్తించి వాటిని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ప్రజారోగ్య అధికారి, పట్టణ ప్రణాళిక అధికారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ తదితర నలుగురు సీనియర్ అధికారులతో బృందాలను ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణ, పరిశీలన చేయనున్నామన్నారు. అలాగే నగరంలో ఉన్న నదీతీర ప్రాంతాన్ని కలుషితం చేయకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే విశాఖ తరహాలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే జన్మభూమి కమిటీ వార్డు ఇంచార్జిల సహకారం ఇందులో తీసుకోనున్నామని, వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా నిమజ్జన ర్యాలీలను క్రమపద్ధతిలో అనుసరించేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో ఆర్జేడి ఆశాజ్యోతి, ఆమదాలవలస, రాజాం, ఇచ్చాపురం, పలాస మున్సిపాల్టీ కమిషనర్లు పలు సూచనలు చేశారు.