శ్రీకాకుళం

గణేష్ ఉత్సవాల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 6: నగరంలో వినాయక ఉత్సవాల సందడి నెలకొంది. పలు ప్రధాన వీధులలో, కూడలిలో భారీ ఎత్తున మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్థానిక జి.టి రోడ్‌లో వర్తకసంఘం ఏర్పాటుచేసిన వినాయక మండపం అందరినీ ఆకట్టుకుంది. ఈ పూజల్లో ఎం.పి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా పాలకొండ రోడ్ విజయగణపతి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేకపూజలు, హోమాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొని కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. అదే విధంగా రైతు బజారు, మొండేటివీధి, అరసవల్లి దరి, మంగువారితోట సంపత్‌వినాయక ఆలయం, నానుబాలవారివీధి విజయదుర్గ ఆలయం విజయలక్ష్మీగణపతి తదితర రూపాల్లో ఉన్న స్వామివారిని దర్శించడానికి భక్తులు విరివిగా పాల్గొన్నారు.