శ్రీకాకుళం

‘ఎత్తిపోతల’కు సంఘాలు: మంత్రి అచ్చెన్నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటబొమ్మాళి, సెప్టెంబర్ 12: జిల్లాలో అన్ని ఎత్తిపోతల పథకాలకు సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మండలంలోని నారాయణవలసలో కోటి 60 లక్షల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు ప్రస్తుతం 16 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని, అవసరమైతే మరికొన్ని గంటలపాటు సరఫరాను అందించేందుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఎర్రంనాయుడు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా వున్న కాలంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు వౌలిక సదుపాయాలు కల్పించారని, తాను మంత్రిని అయ్యాక ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. నాడు ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నారాయణవలస వద్ద 12 ఎత్తిపోతల పథకాలను మంజూరుచేశారని, దీని కృషికి ఎర్రంనాయుడు కూడా ప్రధాన కారకులన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, యువతకు ఉద్యోగవకాశాలు వస్తాయని వైకాపా నేతలు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా హోదా కన్నా అనేక లాభాలు చేకూరుతున్నాయన్నారు. ఎంపి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్న వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ జిల్లాకు, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో సిఎం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బి.రమణమూర్తి, ఎంపిపి కె.రామకృష్ణ, జిల్లా టిడిపి నాయకులు నారాయణమూర్తి, బోయిన రమేష్, ఎఎంసి చైర్మన్ విజయలక్ష్మి, సర్పంచ్ కళావతి, జడ్‌పిటిసి పద్మశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థిపై ఇద్దరి దాడి
శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 12: రూరల్ మండలం పాతృనివలస సమీపంలోని సాయిడెంటల్ కళాశాలలో పాతకక్షల నేపథ్యంలో సీనియర్ స్టూడెంట్‌పై మరో సీనియర్ చేయిచేసుకొని దాడిచేయడంతో అరెస్టు చేయాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. సోమవారం వారు కళాశాల గేట్ ముందు కూర్చొని తరగతులను బహిష్కరించి ఇటువంటి దాడులపై పోలీసులు చర్యలు తీసుకోపోతే తాము తరగతులకు హాజరుకాబోమని భీష్మించుకు కూర్చొన్నారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి డెంటల్ కళాశాలలో పూర్వ విద్యార్థి ప్రసాద్ బిడిఎస్ పూర్తిచేసి తన స్వగ్రామం వెళ్లిపోయాడు. అదే కళాశాలలో ప్రసాద్‌తో పాటు చదువుకున్న సంతోష్ అనే పూర్వ విద్యార్థి శనివారం రాత్రి వినాయక నిమజ్జనం నేపథ్యంలో కళాశాలకు రావాలని ప్రసాద్‌ను ఆహ్వానించగా, నిమజ్జన కార్యక్రమానికి ప్రసాద్ వచ్చాడు. అయితే పాతకక్షల నేపథ్యంలో సంతోష్ నిమజ్జనం అనంతరం ప్రసాద్‌పై తన స్నేహితుడు జగన్‌తో కలిసి దాడిచేసి గాయపరిచాడు. ఈ హఠాత్పరిణామంతో ప్రస్తుత విద్యార్థులతో కలిసి రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో సోమవారం వారు కళాశాల ముందు ధర్నాకు దిగగా, డిఎస్పీ కె.్భర్గవరావు నాయుడు, రూరల్ సిఐ ఆర్.అప్పలనాయుడులు కళాశాలకు చేరుకొని తగిన న్యాయం చేస్తామని సంతోష్‌ను అరెస్టు చేస్తామని విద్యార్థులకు హామీనివ్వడంతో వారు శాంతించి తరగతులకు హాజరయ్యారు. గొడవ అనంతరం యాజమాన్యం వచ్చి సంతోష్‌తో క్షమాపణ చెప్పించినప్పటికీ విద్యార్థులు అంగీకరించలేదు.

మత్స్యకారులకు ఉపాధి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: మత్స్యకారుల స్థితిగతులు మెరుగయ్యేలా జిల్లాలో రెండు ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించామని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సముద్రతీర ప్రాంతం పంచాయతీ సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హార్బర్లు నిర్మించడంవలన మత్స్యకారుల ఆర్థిక ప్రమాణాలు మరింత మెరుగవుతాయన్నారు. మంచి నైపుణ్యం కలిగిన వారిని తీసుకువచ్చి మత్స్యకారులకు మోటార్ బోట్లు, ట్రావెలర్స్‌తో చేపల వేటపై శిక్షణ ఇప్పించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. 193 కిలోమీటర్లు తీరం ఉన్నప్పటికీ స్థానికంగా చేపల వేట లభ్యం కాక పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతున్నట్టు ఈ సమీక్షలో అనేకమంది ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తూ హార్బర్ల నిర్మాణంపూర్తయితే గంగపుత్రులకు ఇబ్బందులు ఎదురవ్వవన్నారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో మొక్కలు నాటేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. తీర ప్రాంతంలో పది వరుసల్లో తాటి, సరుగుడు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. తద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా ఉంటాయని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈనెల 30లోగా పూర్తి చేయాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో స్థలం ఏక్కడుందో గుర్తించాలని ఆ స్థలంలో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు లేకపోవడంతో ఇతర గాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. మొక్కలు అధిక సంఖ్యలో నాటడం వలన గాలి తీవ్రత తగ్గించి విపత్తుల నుంచి తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గతంలో చేపట్టారని గుర్తు చేశారు. గార, శ్రీకాకుళం మత్స్యకార గ్రామాల్లో తాటివనరులు ఉన్నాయన్నారు. జిల్లాలో ఒక్కొక్క ఫిష్ డ్రై ఫ్లాట్ ఫారంలు రూ.1.50లక్షలతో నిర్మించే విధంగా మంజూరయ్యాయని వివరించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి తోడ్పాటు అందించి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. డుమా పిడి ఆర్.కూర్మనాథ్ మాట్లాడుతూ 11 మండలాల్లో 200 ఫిష్ డ్రై ఫ్లాట్‌ఫారాలు ‘ఉపాధి’ హామీ నిధులతో నిర్మించేలా ప్రతిపాదనలు కోరినట్టు చెప్పారు. కార్యక్రమంలో డిఎఫ్‌వో శాంతిస్వరూప్, జెడ్‌పి సిఇవో నగేష్, ఫిషరీస్ డిడి వివి కృష్ణమూర్తి, డిపివో కోటేశ్వరరావు, సెట్ శ్రీ సిఇవో మూర్తి తదితరులు ఉన్నారు.