శ్రీకాకుళం

సైబర్ కెమెరాలతో నేరాల అదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: నేరాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సైబర్ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాలు అదుపుచేయడం సులభతరం అవుతుందని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. సోమవారం జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ప్రజాసదన్‌కు వెళ్లి ఎంపితో లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఎంపి నేరాల సంఖ్య అదుపు చేసేందుకు సైబర్ కెమెరాలను వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ రహదారి పొడుగున ప్రధాన కూడళ్లతోపాటు జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సైబర్ కెమెరాలను ఏర్పాటు చేయగలిగితే నేరగాళ్లను విజువల్స్ ఆధారంగా పట్టుకోవచ్చునని ఎస్పీ బ్రహ్మారెడ్డి కూడా ఎంపికి వివరించారు. శ్రీకాకుళం నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరణ, అలాగే వివిధ కూడళ్లలో సైబర్ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటు అందించేలా ఎంపి ల్యాడ్ నిధులు కేటాయించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎంపిని ఎస్పీ కోరారు. దీనిపై ఎంపి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి సైబర్‌గ్రిడ్ ద్వారా కెమెరాల ఏర్పాటుకు కావాల్సిన నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 12: సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ దవళ భాస్కరరావు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో ఉన్న పిహెచ్‌సిలో క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. హెల్త్ సిబ్బంది విధులు పట్ల ప్రభుత్వం, కలెక్టర్ మరింత స్పష్టంగా ఉన్నారని లక్ష్యాలు అధిగమించడంలో అలసత్వం వహిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. పనివేళలు పాటించాలని, బయోమెట్రిక్‌కు అనుగుణంగా విధలు కొనసాగించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని అలాగే గర్భిణులు, చిన్న పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులు తయారు చేయాలని సూచించారు. కార్యాలయాల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేసి సమాచారం సేకరిస్తే ఊరుకునేది లేదని సబ్‌సెంటర్ల వారీగా రికార్డులు పక్కాగా రూపొందించాలని స్పష్టంచేశారు. టి.బి వ్యాధి బారిన పడినవారు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందించే వైద్యసేవలు వినియోగించుకోకుంటే మరింత ప్రమాదం తప్పదన్నారు. 34 కెల్ల పరీక్షా కేంద్రాలు, 12 టి.బి నిర్థారణ కేంద్రాలు జిల్లాలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి బారిన పడి ఉపాధి కోసం ఇతరప్రాంతాలకు వెళ్లినవారి వివరాలను సేకరించి ఆయా ప్రాంతాల్లో సంబంధిత మందులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకునేందుకు వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాసరావు, సిహెచ్‌వో లక్ష్మణరావు సిబ్బంది ఉన్నారు.

ఘనంగా సత్యనారాయణ వ్రతాలు

నరసన్నపేట, సెప్టెంబర్ 12: మండల కేంద్రంలోని స్థానిక నాయుడు వీధి కొత్తవీధి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ మేరకు విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఎర్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భాగంగా వ్రతాలను నిర్వహించామని తెలిపారు. అన్నవరం దేవస్థానం నుండి నేరుగా స్వామివారి ప్రతిమలను, ప్రసాదాలను తీసుకుని వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అలాగే మంగళవారం ఘనంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనిని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేద పండితులు రవిశర్మ, ఎం.శ్రీనివాస్, కమిటీ ప్రతినిధులు పాండురంగారావు, శర్మ, ఎస్.వరప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.